అన్వేషించండి

ఇటలీలో భారత విద్యార్థి అనుమానాస్పద మృతి, బాత్‌రూమ్‌లో డెడ్‌బాడీ

Indian Student Death: ఇటలీలో భారతీయ విద్యార్థి బాత్‌రూమ్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.

Indian Student Dead in Italy: 


ఝార్ఖండ్ విద్యార్థి మృతి..

ఝార్ఖండ్‌కి చెందిన ఓ స్టూడెంట్‌ ఇటలీలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఝార్ఖండ్‌లోని సింగ్బం జిల్లాకి చెందిన రామ్ రౌత్‌ జనవరి 2న చనిపోయినట్టు స్థానిక ఇటలీ పోలీసులు వెల్లడించారు. MBA చేసేందుకు రామ్ రౌత్ ఈ మధ్యే ఇటలీ వెళ్లాడు. ఓ చోట ఇల్లు రెంట్‌ తీసుకుని ఉంటున్నాడు. న్యూ ఇయర్ విషెస్ చెప్పేందుకు తల్లిదండ్రులు కాల్‌ చేశారు. ఎంతకీ ఫోన్ అటెండ్ చేయకపోవడం వల్ల ఆందోళన చెందారు. ఆ తరవాత రామ్ ఉంటున్న ఇంటి ఓనర్‌కి కాల్ చేశారు. అయితే...అప్పటికే అతను చనిపోయినట్టు చెప్పారు. మరో ఇంట్లో బాత్‌రూమ్‌లోనే అనుమానాస్పద స్థితిలో పడిపోయి ఉన్నట్టు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే తల్లిదండ్రులు ఝార్ఖండ్‌లో సీనియర్ అధికారులను సంప్రదించారు. వీలైనంత త్వరగా మృతదేహాన్ని ఇండియాకి రప్పించేందుకు సాయం చేయాలని కోరారు. ఈ ఘటనపై పోలీసులు స్పందించారు. ఇప్పటికే రామ్ రౌత్ మృతికి సంబంధించిన సమాచారం అందిందని స్పష్టం చేశారు. హోంశాఖకు సమాచారం అందించామని మైగ్రేషన్ సెల్‌కి కూడా వివరాలు చెప్పామని తెలిపారు. అవసరమైన ఏర్పాట్లు చేయాలని కోరినట్టు వివరించారు. కుటుంబ సభ్యులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నామని, విచారణ కొనసాగుతోందని వెల్లడించారు. 

యూకేలోనూ..

ఇటీవల యూకేలో అదృశ్యమైన భారతీయ విద్యార్థి జీఎస్ భాటియా మృతి చెందాడు. ఈస్ట్ లండన్‌లోని ఓ సరస్సులో అతడి మృతదేహం కనిపించింది. గతేడాది డిసెంబర్ 14వ తేదీ రాత్రి నుంచి భాటియా కనిపించకుండా పోయాడు. అప్పటి నుంచి అతని ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. చివరకు ఓ లేక్‌లో శవమై తేలాడు. దాదాపు వారం రోజులుగా భాటియా జాడ కోసం విచారణ కొనసాగిస్తున్నారు. చాలా చోట్ల CC కెమెరా ఫుటేజ్‌ని పరిశీలించారు. ఫోన్‌ డేటానీ సేకరించారు. ఈ సమాచారం ఆధారంగా ఓ సరస్సులో తనిఖీలు చేపట్టారు. అందులోనే భాటియా డెడ్‌బాడీ దొరికింది. ఈ ఘటనపై పోలీసులు స్పందించారు. ఇప్పటి వరకూ ఇది అనుమానాస్పద మృతి అనడానిక ఆధారాలు ఏమీ దొరకలేదని వెల్లడించారు. అయినా అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేపడుతున్నట్టు తెలిపారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అయితే...భాటియాకి సంబంధించిన ఏ సమాచారం తెలిసినా వెంటనే తమకు తెలియజేయాలని కోరారు. ఇప్పటికే భాటియా మృతి పట్ల సోషల్ మీడియాలో పోస్ట్‌లు వెల్లువెత్తుతున్నాయి. ఖలిస్థాన్ వివాదం ఉద్ధృమవుతున్న సమయంలో  భారత్‌కి చెందిన ఓ సిక్కు విద్యార్థి ఇలా అనుమానాస్పద రీతిలో ప్రాణాలు కోల్పోవడం అలజడి సృష్టిస్తోంది. భాటియా మిస్సింగ్ కేసుని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ దృష్టికి తీసుకెళ్లారు బీజేపీ నేత మన్‌జిందర్ సింగ్ సిర్సా. భాటియా మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గతంలోనూ 23 ఏళ్ల భారతీయ విద్యార్థి మిత్‌కుమార్ పటేల్ అదృశ్యమయ్యాడు. చివరికి థేమ్స్‌ నదిలో శవమై తేలాడు. ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే చదువుకునేందుకు లండన్‌కి వచ్చిన మిత్‌కుమార్‌ నవంబర్‌లో చనిపోయాడు. అయితే..ఇది అనుమానాస్పద మృతి కాదని పోలీసులు వెల్లడించారు. 

Also Read: బీచ్‌ టూరిజంలో భారత్‌ మాతో పోటీ పడలేదు, మోదీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవ్స్ అక్కసు

టాప్ హెడ్ లైన్స్

Konda Surekha Apology To KTR : కేటీఆర్‌కు కొండా సురేఖ క్షమాపణ - న్యాయస్థానాల భయం.. లీగల్ వ్యూహం - బేషరతు సారీ వెనుక అసలు కథేంటి?
కేటీఆర్‌కు కొండా సురేఖ క్షమాపణ - న్యాయస్థానాల భయం.. లీగల్ వ్యూహం - బేషరతు సారీ వెనుక అసలు కథేంటి?
Andaman Sea Low Pressure: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
AP Cyclone Arnab Relief: తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
AP vs TS Essential Commodities Subsidies: నిత్యావసర వస్తువుల ధరల మంట - ప్రజా వ్యతిరేకత ముప్పు - ప్రభుత్వాల మాస్టర్ ప్లాన్లు ఇవే !
నిత్యావసర వస్తువుల ధరల మంట - ప్రజా వ్యతిరేకత ముప్పు - ప్రభుత్వాల మాస్టర్ ప్లాన్లు ఇవే !

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha Apology To KTR : కేటీఆర్‌కు కొండా సురేఖ క్షమాపణ - న్యాయస్థానాల భయం.. లీగల్ వ్యూహం - బేషరతు సారీ వెనుక అసలు కథేంటి?
కేటీఆర్‌కు కొండా సురేఖ క్షమాపణ - న్యాయస్థానాల భయం.. లీగల్ వ్యూహం - బేషరతు సారీ వెనుక అసలు కథేంటి?
Andaman Sea Low Pressure: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
AP Cyclone Arnab Relief: తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
AP vs TS Essential Commodities Subsidies: నిత్యావసర వస్తువుల ధరల మంట - ప్రజా వ్యతిరేకత ముప్పు - ప్రభుత్వాల మాస్టర్ ప్లాన్లు ఇవే !
నిత్యావసర వస్తువుల ధరల మంట - ప్రజా వ్యతిరేకత ముప్పు - ప్రభుత్వాల మాస్టర్ ప్లాన్లు ఇవే !
జియో జాక్‌పాట్..మార్కెట్‌లోకి వచ్చిన మొదటిరోజే దేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా అవతరణ.. షేర్ ఎంత పెరిగిందంటే..
జియో జాక్‌పాట్..మార్కెట్‌లోకి వచ్చిన మొదటిరోజే దేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా అవతరణ.. షేర్ ఎంత పెరిగిందంటే..
Balmoor Induja Complaint On KTR: కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో పొలిటికల్ రగడ!
కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో పొలిటికల్ రగడ!
Karnataka MLC Election Results 2026: కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం - అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి తప్పదా?
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం - అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి తప్పదా?
DA Hike For Govt Employees: దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
Embed widget