అన్వేషించండి

Hyderabad: భయ్యా అంటూ కళ్లలో కారం కొట్టి, డబ్బుతో ఉడాయిస్తారు, హైదరాబాద్‌లో మరో కొత్త గ్యాంగ్ కలకలం

'భయ్యా అంటూ పిలిచి వారు తేరుకునేలోపే కళ్లలో కారం కొట్టి దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తులను ఇరానీ గ్యాంగ్ అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

ఆభరణాల దుకాణాలను లక్ష్యంగా చేసుకుని అక్కడ పని చేస్తున్న వారిని ఫాలో అవుతూ వారి కదలికలపై దృష్టి సారించి 'భయ్యా అంటూ పిలిచి వారు తేరుకునేలోపే కళ్లలో కారం కొట్టి దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తులను ఇరానీ గ్యాంగ్ అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ నెల (నవంబర్) 22న రాత్రి హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45లోని కృష్ణా జ్యువెలర్స్ యజమాని అంకిత్ అగర్వాల నివాసం వద్ద అక్కడ పని చేస్తున్న ఉద్యోగి కళ్లల్లో కారం కొట్టి బ్యాగుతో ఉడాయించారు.

హైదరాబాద్‌లో వరుస చోరీలు.. 
ఇదే గ్యాంగ్ ఈ నెల 24న రాత్రి నారాయణగూడలో డివినిటి ఆభరణాల షాపు నుంచి వెళ్తున్న ఉద్యోగిని సైతం కళ్లల్లో కారం కొట్టి 25 తులాల బంగారు నగలున్న బ్యాగుతో ఉడాయించారు. ఒక్క రోజు వ్యవధిలోనే ఈ రెండు ఘటనలు చోటు చేసుకోగా అటు నారాయణగూడ క్రైం పోలీసులకు, ఇటు జూబ్లీహిల్స్ క్రైం పోలీసులకు ఈ ముఠాను పట్టుకోవడం సవాల్‌గా మారింది. రెండు పోలీస్ స్టేషన్ల పరిధిలోనూ గత మూడు రోజుల నుంచి సీసీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు ఈ ముఠా స్నాచింగ్లకు పాల్పడుతున్న తీరు, వీరి కదలికల ఆధా రంగా నిందితులు మహారాష్ట్రకు చెందిన ఇరానీ గ్యాంగ్ గుర్తించారు. గతంలోనూ వీరు స్నాచింగ్ చేసిన పద్ధతులను కూడా పరిశీలించారు. నెంబర్ ప్లేట్ లేని బైక్పై మంకీ క్యాపులు ధరించిన ఇద్దరు యువకులు ఈ చోరీలకు పాల్పడినట్లుగా నిర్ధారణకు వచ్చారు. 
నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోనూ, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోనూ సీసీ ఫుటేజీలను పరిశీ లించగా ఈ రెండు స్నాచింగ్లు వీరిద్దరే చేసినట్లుగా తేలింది.ఈ ముఠా కోసం జూబ్లీహిల్స్, పంజాగుట్ట, నారాయణగూడ క్రాంపోలీసులతో పాటు వెస్ట్, సెంట్రల్ జోన్ టాస్క్ పోర్స్ పోలీసులు ఐదు బృందాలుగా ఏర్పడి గాలింపు ముమ్మరం చేశారు. గతంలో స్నాచింగ్ కు పాల్పడిన ఇరానీ గ్యాంగ్ వేలి ముద్రలను, ఫొటోలను పరిశీలిస్తున్నారు. సికింద్రాబాద్, పంజగుట్ట ప్రాం తాల్లో లాడ్జీల్లో బస చేసిన ఇతర ప్రాంతాల వారి వివరాలను రాబడుతూ అక్కడ సీసీఫుటేజీలు పరిశీలిస్తున్నారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్యోగి నుంచి బ్యాగు లాక్కొని తస్క రించగా అందులో కేవలం తాళం చెవులు మాత్రమే ఉండటంతో ఆ బ్యాగును నగల దుకాణం వద్ద విసిరేసి పరారైనట్లుగా సీసీ ఫుటేజీలు స్పష్టం చేస్తున్నాయి. 
నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో మాత్రం బ్యాగులో 25 తులాల బంగారు ఆభరణాలు ఉండగా బాధితుడు జితేంద్ర శర్మ అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు ప్రధాన రహదారుల్లో సీసీ పుటేజీలను కూడా పరిశీలిస్తున్నారు. ఈ గ్యాంగ్ ఎక్కడా క్షణం కూడా నిలబడకుం డా దూసుకుపోతున్నట్లు తేలింది. ఇంకోవైపు మంకీ క్యాంప్ ధరించడంతో ముఖ ఆనవాళ్లు గుర్తించలేకపోతున్నారు. బైక్ నెం బర్ ప్లేట్లు కూడా తొలగించడంతో కేసు దర్యాప్తు జఠిలంగా మారిందని ఓ అధికారి తెలిపారు. అయితే పాత నేరస్తుల కద లికలపై దృష్టి పెట్టిన పోలీసులు మరో రెండు, మూడు రోజుల్లో ఈ గ్యాంగ్ను పట్టుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ganja Seized: బ్యాంకాక్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు.. వ్యక్తి లగేజీ చెక్ చేస్తే రూ. 14 కోట్ల గంజాయి
బ్యాంకాక్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు.. వ్యక్తి లగేజీ చెక్ చేస్తే రూ. 14 కోట్ల గంజాయి
Zaheerabad Crime: పోలీసుల ముందే ఘోరం - ప్రియుడితో వెళ్లిన భార్య గొంతు కోసిన భర్త!
పోలీసుల ముందే ఘోరం - ప్రియుడితో వెళ్లిన భార్య గొంతు కోసిన భర్త!
First Night Crime: హైదరాబాద్‌లో దారుణం.. ఫస్ట్ నైట్ నవవధువుపై భర్త, స్నేహితులు సామూహిక అత్యాచారం!
హైదరాబాద్‌లో దారుణం.. ఫస్ట్ నైట్ నవవధువుపై భర్త, స్నేహితులు సామూహిక అత్యాచారం!
Sathankulam Custodial Deaths Case: మధురై జిల్లా కోర్టు సంచలన తీర్పు - 9 మంది పోలీసులకు మరణశిక్ష - ఏం చేశారంటే ?
మధురై జిల్లా కోర్టు సంచలన తీర్పు - 9 మంది పోలీసులకు మరణశిక్ష - ఏం చేశారంటే ?

వీడియోలు

Bumrah vs Vaibhav Suryavanshi IPL 2026 | బుమ్రా యార్కర్ల ముందు వైభవ్ నిలబడగలడా?
Ashwin about CSK’s Failure IPL 2026 | సీఎస్కే వైఫల్యంపై అశ్విన్ కామెంట్స్
Who Is Prashant Veer CSK IPL 2026 | ఎవరీ ప్రశాంత్ వీర్
Hardik Pandya back in Mumbai Indians Team | ముంబై టీంలోకి కెప్టెన్ హార్దిక్ కమ్‌బ్యాక్
IPL 2026 KKR VS PBKS Cameron Green | వరుసగా విఫలమవుతున్న కామెరూన్ గ్రీన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Gazette: అమరావతి గెజిట్‌తోనే అన్నీ అయిపోవు - ప్రభుత్వం మూడేళ్లలో చేయాల్సింది చాలా ఉంది - లేకపోతే?
అమరావతి గెజిట్‌తోనే అన్నీ అయిపోవు - ప్రభుత్వం మూడేళ్లలో చేయాల్సింది చాలా ఉంది - లేకపోతే?
Congress guarantees: కారణాలు కాదు హామీల అమలు కావాలి - మాటల చాణక్యంతో ఆర్థిక నిస్సహాయతను రేవంత్ అధిగమిస్తారా?
కారణాలు కాదు హామీల అమలు కావాలి - మాటల చాణక్యంతో ఆర్థిక నిస్సహాయతను రేవంత్ అధిగమిస్తారా?
Toll Tax New Rule: టోల్ ప్లాజాల వద్ద కేవలం క్యాష్‌లెస్ పేమెంట్స్.. ఏప్రిల్ 10 నుంచి FASTAG, UPI ద్వారా చెల్లింపులు
టోల్ ప్లాజాల వద్ద కేవలం క్యాష్‌లెస్ పేమెంట్స్.. ఏప్రిల్ 10 నుంచి FASTAG, UPI ద్వారా చెల్లింపులు
IPL 2026 RR VS MI Result Update: రాజ‌స్థాన్ రాయ‌ల్స్ హ్యాట్రిక్.. ముంబైపై ఘ‌న విజ‌యం.. దుమ్మురేపిన జైస్వాల్, సూర్య‌వంశీ.. ప‌ట్టిక‌లో టాప్ ప్లేస్ కు రాయ‌ల్స్
రాజ‌స్థాన్ రాయ‌ల్స్ హ్యాట్రిక్.. ముంబైపై ఘ‌న విజ‌యం.. దుమ్మురేపిన జైస్వాల్, సూర్య‌వంశీ.. ప‌ట్టిక‌లో టాప్ ప్లేస్ కు రాయ‌ల్స్
Vaibhav Suryavanshi: డేయ్.. బుమ్రా అనుకుంటున్నావా..? లేక టుమ్రీ అనుకున్నావా ఆ కొట్టుడేంది.. బుడ్డోడా..?
డేయ్.. బుమ్రా అనుకుంటున్నావా..? లేక టుమ్రీ అనుకున్నావా ఆ కొట్టుడేంది.. బుడ్డోడా..?
Sabarimala: శబరిమలలోకి మహిళల ప్రవేశంపై ఆంక్షలకు కేంద్రం మద్దతు! సుప్రీంకోర్టు అఫిడవిట్ దాఖలు!
శబరిమలలోకి మహిళల ప్రవేశంపై ఆంక్షలకు కేంద్రం మద్దతు! సుప్రీంకోర్టు అఫిడవిట్ దాఖలు!
Middle East War: పశ్చిమాసియాలో బాంబుల మోత! భారతీయులకు ఎంబసీ కీలక సూచనలు! 
పశ్చిమాసియాలో బాంబుల మోత! భారతీయులకు ఎంబసీ కీలక సూచనలు! 
Google Gemini: ఆత్మహత్య ఆలోచనలు పసిగట్టే ఏఐ ఫీచర్‌! గూగుల్ జెమినీలో విప్లవాత్మక మార్పు!
ఆత్మహత్య ఆలోచనలు పసిగట్టే ఏఐ ఫీచర్‌! గూగుల్ జెమినీలో విప్లవాత్మక మార్పు!
Embed widget