IPL, 2022 | Qualifier 2 | Narendra Modi Stadium, Ahmedabad - 27 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RR
RR
VS
RCB
RCB
IPL, 2022 | Final | Narendra Modi Stadium, Ahmedabad - 29 May, 08:00 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
TBC
TBC

Saroornagar Honour Killing : సరూర్ నగర్ పరువు హత్య, ఇద్దరు నిందితులు అరెస్టు

Saroornagar Honour Killing : సరూర్ నగర్ పరువు హత్య కేసులో ఇద్దర్ని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. తన చెల్లిని ప్రేమ పెళ్లి చేసుకున్నాడని ప్లాన్ చేసి హత్య చేసినట్లు పోలీసులు నిర్థారించారు.

FOLLOW US: 

Saroornagar Honour Killing :  హైదరాబాద్ సరూర్ నగర్ మర్డర్ కేసులో ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఎల్బీనగర్ డీసీపీ సంప్రీత్ సింగ్  తెలిపారు. ఈ కేసు వివరాలను ఆయన గురువారం మీడియాకు వివరించారు. బుధవారం రాత్రి సరూర్ నగర్ లో మర్డర్ కేసులో బాలానగర్ కి చెందిన సయ్యద్ మొబిన్ అహ్మద్,  షేర్ లింగంపల్లికి చెందిన నసీర్ ను అరెస్ట్ చేశామని తెలిపారు. ప్రధాన నిందితుడు సయ్యద్ మోబిన్ అహ్మద్ సోదరని మృతుడు నాగరాజు ఈ ఏడాది జనవరి 31న ప్రేమ వివాహం చేసుకున్నాడు. అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్లిపోయి ఆర్యసమాజ్ లో వివాహం చేసుకుంది. యువతి కుటుంబ సభ్యులు మిస్సింగ్ కేస్ పెట్టడంతో ట్రేస్ చేసి  కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు పోలీసులు. 

యువతి సోదరుడు సయ్యద్ అప్పటి నుంచి నాగరాజుపై కోపం పెంచుకున్నాడు. మృతుడు నాగరాజు సయ్యద్ సిస్టర్ చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నారు. అనంతరం ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు. నాగరాజు గురించి ప్రధాన నిందితుడు పూర్తిగా విచారణ చేసి ప్లాన్ ప్రకారం బైక్ పై వెళ్తోన్న వారిని కొట్టి చంపాడు. గతంలో కూడా నాగరాజును చంపడానికి ప్లాన్ చేసి విఫలమయ్యాడు. ఈ కేసు ఫాస్ట్ ట్రాక్ కోర్టులో త్వరగా పూర్తి చేసి నిందితులకి శిక్ష పడేలా చేస్తామని డీసీపీ తెలిపారు. మృతుని కుటుంబానికి ప్రభుత్వం నుంచి వచ్చే బెనిఫిట్స్ అందెలా చేస్తామన్నారు. దయచేసి ఈ కేసు విషయంలో ఎలాంటి సమస్యలు సృష్టించవద్దని డీసీపీ కోరారు. 

అసలేం జరిగింది? 

పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. అన్యోన్యంగా ఉంటున్న టైంలో పిడుగులాంటి సంఘటన. సరూర్‌నగర్‌ పరిధిలో జరిగిన ఈ సంఘటన కలకలం రేపింది. బుధవారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో కొత్త జంటపై దాడి జరిగింది. ఈ దుర్ఘటనలో భర్త స్పాట్‌లోనే చనిపోయాడు. రంగారెడ్డి జిల్లా మర్పల్లికి చెందిన బిల్లారపురం నాగరాజు, మర్పల్లి సమీపంలోని ఘనాపూర్‌ వాసి ఆశ్రిన్‌ సుల్తానా ప్రేమించుకున్నారు. విషయం తెలుసుకున్న ఆశ్రిన్‌ బంధువులు నాగరాజును హెచ్చరించారు. ఆమె వెంట తిరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. ప్రమాదాన్ని గ్రహించిన నాగరాజు హైదరాబాద్‌లో ఉద్యోగం వెతుక్కున్నాడు. ఓ కంపెనీలో సేల్స్‌మెన్‌గా చేరాడు. స్థిరపడిన తర్వాత పెళ్లి చేసుకుందామని ఆశ్రిన్‌కు చెప్పాడు.

అనుకున్నట్టుగానే లైఫ్‌లో స్థిరపడ్డ తర్వాత ఆశ్రిన్‌కు కబురు పెట్టాడు. జనవరిలో ఇంట్లో చెప్పకుండా ఆశ్రిన్ హైదరాబాద్‌ వచ్చేసింది. ఆర్యసమాజ్‌లో జనవరి 31న ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. తమ జాడ ఆశ్రిన్‌  బంధువులకు తెలియకుండా ఉండేందుకు ఉద్యోగం, నివాసాన్ని కూడా మార్చేశారు. ఆశ్రిన్, నాగరాజు ఎన్ని ప్లేస్‌లు మారుతున్నా ఆమె బంధువులు వదల్లేదు. వెంటాడుతునే ఉన్నారు. ప్రస్తుతం సరూర్‌నగర్‌లో ఉన్నారని తెలుసుకున్న ఆశ్రిన్ బంధువులు మరోసారి దాడి చేశారు. 

Published at : 05 May 2022 07:44 PM (IST) Tags: Crime News Hyderabad News Honour Killing two arrested Saroor Nagar

సంబంధిత కథనాలు

Anantapur: సచివాలయాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ట్రైనీ జేసీ తనిఖీలు - పోలీసులు అరెస్టు చేయడంతో కి‘లేడీ’ ట్విస్ట్

Anantapur: సచివాలయాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ట్రైనీ జేసీ తనిఖీలు - పోలీసులు అరెస్టు చేయడంతో కి‘లేడీ’ ట్విస్ట్

DK SrinivaS Arrest : డ్రగ్స్ కేసులో డీకే ఆదికేశవులు కుమారుడు - బెంగళూరులో అరెస్ట్ చేసిన ఎన్సీబీ !

DK SrinivaS Arrest :  డ్రగ్స్ కేసులో డీకే ఆదికేశవులు కుమారుడు - బెంగళూరులో అరెస్ట్ చేసిన ఎన్సీబీ !

Texas Gun Fire: కాల్పులతో దద్దరిల్లిన టెక్సాస్, ప్రైమరీ స్కూల్లోకి చొరబడి విచ్చలవిడి కాల్పులు - 18 పిల్లలు, టీచర్లు మృతి

Texas Gun Fire: కాల్పులతో దద్దరిల్లిన టెక్సాస్, ప్రైమరీ స్కూల్లోకి చొరబడి విచ్చలవిడి కాల్పులు - 18 పిల్లలు, టీచర్లు మృతి

Goa News: దొంగల నయా ట్రెండ్- ఇల్లంతా దోచేసి, లవ్ లెటర్ రాసి పరార్!

Goa News: దొంగల నయా ట్రెండ్- ఇల్లంతా దోచేసి, లవ్ లెటర్ రాసి పరార్!

Hyderabad: వంట మాస్టర్‌తో మహిళ సహజీవనం, ఇంతలో గది నుంచి కంపు వాసన - తెరిచి చూసి స్థానికులు షాక్

Hyderabad: వంట మాస్టర్‌తో మహిళ సహజీవనం, ఇంతలో గది నుంచి కంపు వాసన - తెరిచి చూసి స్థానికులు షాక్
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Diabetes: అధ్యయనంలో షాకింగ్ రిజల్ట్, టైప్ 2 డయాబెటిస్ ఉంటే మెదడు త్వరగా ముసలిదైపోతుంది

Diabetes: అధ్యయనంలో షాకింగ్ రిజల్ట్, టైప్ 2 డయాబెటిస్ ఉంటే మెదడు త్వరగా ముసలిదైపోతుంది

Weather Updates: నేడు ఈ జిల్లాల్లో వర్షం, ఎల్లో అలర్ట్ జారీ! ఏపీలో నేడు 2-4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు

Weather Updates: నేడు ఈ జిల్లాల్లో వర్షం, ఎల్లో అలర్ట్ జారీ! ఏపీలో నేడు 2-4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు

YS Jagan Davos Tour: మచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ జోన్‌, ఏపీతో ఏస్‌ అర్బన్‌ డెవలపర్స్‌ ఒప్పందం

YS Jagan Davos Tour: మచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ జోన్‌, ఏపీతో ఏస్‌ అర్బన్‌ డెవలపర్స్‌ ఒప్పందం

Hyderabad: నేడు Hydకి మోదీ, ఈ రూట్లలో ట్రాఫిక్‌కు నో ఎంట్రీ! ముందే వేరే మార్గాలు చూసుకోండి

Hyderabad: నేడు Hydకి మోదీ, ఈ రూట్లలో ట్రాఫిక్‌కు నో ఎంట్రీ! ముందే వేరే మార్గాలు చూసుకోండి