అన్వేషించండి

Cell phone Recovery : ఫోన్ పోతే ఇట్టే పట్టిస్తారు తెలంగాణ పోలీసులు - ఏడాదిలో 30వేల మొబైల్స్ రికవరీ

Telangana News : ఏడాదిలో 30వేల సెల్ ఫోన్లను హైదరాబాద్ పోలీసులు రికవరీ చేశారు. CEIR పోర్టల్ తో పాటు లోకల్ ట్రాకింగ్ ద్వారా ఈ రికవరీ చేసినట్లు పోలీసులు ప్రకటించారు.

Hyderabad Police :  ఫోన్ పోయినా.. దొంగతనానికి గురయినా  ఆశలు వదిలేసుకోవాల్సింది. పోలీసులు ఫిర్యాదు కూడా తీసుకోరు. కానీ తెలంగాణ పోలీసులు నెమ్మది ఆ పరిస్థితి మారుస్తున్నారు. ఫిర్యాదులు తీసుకోవడమే కాదు..రికవరీపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.  చోరీకి గురైన, మిస్సైయిన  సెల్ ఫోన్  రికవరీలో దేశంలో రెండో స్థానంలో నిలిచింది.  ఏడాదిలో  30 వేల ఫోన్లు రికవరీ చేసి కర్ణాటక తర్వాతి స్థానంలో  నిలిచింది.   CEIR  పోర్టల్ తో  పాటు లోకల్ ట్రాకింగ్ ద్వారా  సెల్ ఫోన్  రికవరీ చేసినట్లుగా పోలీసులు ప్రకటించారు. 

దేశంలో ఫోన్ రికవరీలో తెలంగాణ రెండో స్థానంలో నిలిచిందని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ప్రకటించారు.   2023 ఏప్రిల్ 19 నుంచి ఇప్పటి వరకు 30049 ఫోన్లను రికవరీ చేసినట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 4869, సైబరాబాద్ పరిధిలో 3078, రాచకొండ పరిధిలో 3042 ఫోన్లను రికవరీ చేసినట్లు ఆయన తెలిపారు. సెల్ ఫోన్ చోరికి గురైనప్పుడు లేదా కనిపించకుండా పోయిన వెంటనే సిఈఐఆర్ పోర్టల్ లో నమోదు చేసుకోవాలని సూచించారు. సిఈఐఆర్ పోర్టల్ లో నమోదు చేసుకుంటే ఫోన్ల ట్రాకింగ్ సులభం అవుతుందని మహేశ్ భగవత్ వివరించారు.  

 

గతంలోలా ఫోన్లు చోరీ చేస్తే.. ట్రాక్ చేయడానికి కూడా రాకండా దొంగలు ప్రత్యేక సాఫ్ట్  వేర్లను ఉపయోగిస్తున్నారు. అందుకే ప్రత్యేకంగా CEIR  పోర్టల్ న అందుబాటులోకి తెచ్చారు. చరవాణి పోయిన వ్యక్తి మొదట తన సిమ్ కార్డును బ్లాక్ చేయించి.. తిరిగి అదే నంబర్‌తో కొత్త సిమ్‌ కార్డును పొందాలి. చరవాణికి సంబంధించిన ఐఎమ్ఈఐ నెంబర్‌ను నమోదు చేయాలి. మొబైల్‌ను బ్లాక్ చేసే సందర్భంలో సిమ్ కార్డుకు వచ్చే ఓటీపీని నమోదు చేయాలి. కొనుగోలు చేసినప్పుడు ఇచ్చే ఇన్‌వాయిస్ కాపీని వెబ్‌ సైట్‌లో నమోదు చేయాలి. అంతేకాకుండా చిరునామాకు సంబంధించిన గుర్తింపు కార్డుతో పాటు.. ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందనే వివరాలు పేర్కొనాలి. అంతగా అవగాహన లేకపోతే పోలీసులే పీఎస్​లో నమోదు చేస్తారు. ఒకసారి నమోదు చేస్తే తిరిగి దాన్ని మళ్లీ నమోదు చేసే అవకాశం ఉండదు.చరవాణి ఐఎమ్ఈఐ నెంబర్లను దేశంలోని అన్ని టెలికాం ఆపరేటర్లకు పంపిస్తారు. ఇక సెల్‌ఫోన్‌ను దేశంలో వినియోగించే అవకాశమే ఉండదు.                            

రాష్ట్రంలోని అన్ని పోలీస్‌స్టేషన్‌లలో ఈ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేస్తున్నారు. సీఈఐఆర్ వెబ్‌సైట్‌ను టీఎస్ పోలీస్ సిటిజన్ పోర్టల్‌కు సైతం అనుసంధానించారు. చోరీకి గురైన సెల్‌ఫోన్ గురించి ఏదైనా సమాచారం ఉంటే వెంటనే ఫిర్యాదుదారుడికి సందేశం వచ్చేలా సీఈఐఆర్ వెబ్‌సైట్ ను తీర్చిదిద్దారు. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC gas blowout: కోనసీమ జిల్లాలో గ్యాస్ బ్లో అవుట్ - దడ పుట్టిస్తున్న మంటలు - ఆర్పకుంటే పెను ప్రమాదం
కోనసీమ జిల్లాలో గ్యాస్ బ్లో అవుట్ - దడ పుట్టిస్తున్న మంటలు - ఆర్పకుంటే పెను ప్రమాదం
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Telugu Woman Murder: అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
Nizamabad Crime News:నిజామాబాద్‌లో మిస్టరీ డెత్‌; గుండెపోటుతో భర్త చనిపోయినట్టు భార్య డ్రామా! ఒక్క ఫోన్ కాల్‌తో ఆటకట్టు!
నిజామాబాద్‌లో మిస్టరీ డెత్‌; గుండెపోటుతో భర్త చనిపోయినట్టు భార్య డ్రామా! ఒక్క ఫోన్ కాల్‌తో ఆటకట్టు!

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC gas blowout: కోనసీమ జిల్లాలో గ్యాస్ బ్లో అవుట్ - దడ పుట్టిస్తున్న మంటలు - ఆర్పకుంటే పెను ప్రమాదం
కోనసీమ జిల్లాలో గ్యాస్ బ్లో అవుట్ - దడ పుట్టిస్తున్న మంటలు - ఆర్పకుంటే పెను ప్రమాదం
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Telugu Woman Murder: అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
Nizamabad Crime News:నిజామాబాద్‌లో మిస్టరీ డెత్‌; గుండెపోటుతో భర్త చనిపోయినట్టు భార్య డ్రామా! ఒక్క ఫోన్ కాల్‌తో ఆటకట్టు!
నిజామాబాద్‌లో మిస్టరీ డెత్‌; గుండెపోటుతో భర్త చనిపోయినట్టు భార్య డ్రామా! ఒక్క ఫోన్ కాల్‌తో ఆటకట్టు!
Ind vs Ban 5 Major controversies: భారత్, బంగ్లాదేశ్ క్రికెట్ జట్ల మధ్య 5 పెద్ద వివాదాలు.. ఓసారి ఏకంగా కొట్టుకునే వరకు వెళ్లిన ఆటగాళ్లు
భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య 5 పెద్ద వివాదాలు.. ఓసారి ఏకంగా కొట్టుకునే వరకు వెళ్లిన ఆటగాళ్లు
Dhurandhar OTT : ఓటీటీలోకి 1200 కోట్ల బ్లాక్ బస్టర్ 'ధురంధర్' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఓటీటీలోకి 1200 కోట్ల బ్లాక్ బస్టర్ 'ధురంధర్' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Donald Trump: 120 దేశాల వలసదారులకు అమెరికా సాయం.. జాబితాలో కనిపించని భారత్, పలు దేశాల్లో గందరగోళం
120 దేశాల వలసదారులకు అమెరికా సాయం.. జాబితాలో కనిపించని భారత్, పలు దేశాల్లో గందరగోళం
Crazy Kalyanam : 'క్రేజీ కల్యాణం' చూసేందుకు రెడీయేనా! - క్రేజీ కాంబోతో వంద శాతం ఎంటర్టైన్మెంట్ కన్ఫర్మ్
'క్రేజీ కల్యాణం' చూసేందుకు రెడీయేనా! - క్రేజీ కాంబోతో వంద శాతం ఎంటర్టైన్మెంట్ కన్ఫర్మ్
Embed widget