By: ABP Desam | Updated at : 05 Dec 2022 10:55 AM (IST)
Edited By: jyothi
మహిళల నగ్న చిత్రాలు, వీడియోలు సేకరించే మాంత్రికుడు, ఎలాగో తెలుసా?
Hyderabad Crime News: నీ ఒంట్లో దెయ్యం దాగుంది.. దరిద్రం నడింట్లో నాట్యం ఆడుతుంది. నీ దరిద్రమే నిన్ను ఇలా చేసింది. మీ దరిద్రాన్ని దరిదాపులో కూడా రానివ్వను.. నేను చెప్పినట్టు చేస్తే పూర్వ జన్మలో చేసిన పాపాలన్నీ పటాపంచలవుతాయి. నువ్వు కోరుకునే విధంగా మీ జీవితం ముందుకు సాగుతుంది. అలా జరగాలంటే నేను చెప్పినట్టే చేయాలి. ఒకవేళ నేను చెప్పినట్టు చెయ్యకపోతే కష్టాల్లో ఊపిలో కొట్టుకుపోతావ్... ఇవి ఓ బాబా ఎంతో మంది మహిళలతో మాట్లాడిన మాటలు. నిజంగా ఎవరి మంచి కోరిన వారైనా ఈ విధంగా మాట్లాడతారా? దేవుడిని నమ్మే బాబాలు నిజంగా మహిళలని నగ్నంగా ఉండాలని, చూడాలని కోరుకుంటారా? పాతబస్తీ చంద్రయాన్ గుట్టలో ఇదే జరిగింది.
మంత్ర తంత్రాలతో.. మీ కష్టాలు తీరుస్తా.. దోషాలను నివారిస్తా.. నేను చెప్పింది వింటే డబ్బుల వర్షం కురిపిస్తా.. జన్మ జన్మల దారిద్ర్యాన్ని తొలగిస్టా అంటూ మాయ మాటలు చెప్తూ మహిళలను నమ్మించి నగ్న ఫోటోలు, వీడియోలు తీస్తూ బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. ఎన్నో రోజులుగా కొనసాగుతున్న ఈ అరాచకాల్ని ఓ మహిళ ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. రెడ్ హ్యాండెడ్ గా నకిలీ బాబాని అదుపులోకి తీసుకున్నారు. ఈ నకిలీ బాబా బసవ కళ్యాణ్ కు చెందిన మరో బాబాకు మహిళల నగ్న చిత్రాలు పంపుతున్నట్లు పోలీసులు కనుగొన్నారు.
భూత వైద్యుడిగా మారిన లారీ డ్రైవర్..
లారీ డ్రైవర్ గా పని చేస్తున్న సయ్యద్ హుస్సేన్ (35) కొంత కాలం క్రితం బార్కాస్సలాలా ప్రాంతానికి వలస వచ్చాడు. ఇక్కడ నకిలీ భూత వైద్యుని అవతారం ఎత్తాడు. నిరుపేద ముస్లిం మహిళలను టార్గెట్ గా ఎంచుకొని వారి నగ్న వీడియోలను సోషల్ మీడియాలో పెడతా అని బెదిరించి అడ్డ దారిలో డబ్బులు సంపాదించుకోవడానికి అలవాటు పడ్డాడు. కష్టాలు తీరుస్తానంటూ మహిళలను నమ్మించేవాడు. నా గురువు ఆరితేరిన భూత వైద్యుడని ఎంతటి కష్టాన్నైనా ఇట్టే తొలగించేస్తాడని మాయ మాటలతో బురిడి కొట్టించేవాడు. తాను చెప్పినట్లు వింటే కష్టాలు తొలగిపోవడమే కాకుండా డబ్బుల వర్షం కూడా కురిపిస్తానని గదిల్లోకి తీసుకు వెళ్లేవాడు. అక్కడ మహిళల న్యూడ్ ఫోటోలు, వీడియోలు తీసుకునే వాడు. వారి నగ్న చిత్రాలను గుల్బర్గాకు చెందిన మంత్రగాడు గులాంకు పంపేవాడు.
500లకు పైగా మహిళల నగ్న ఫొటోలు, వీడియోలు
ఇలా వాళ్ల వలలో చిక్కుకున్న ఓ మహిళ బాధితురాలు బాధ భరించలేక నారినికేతన్ అధ్యక్షురాలు సఫియా మాహికు తన గోడును వెల్లబోసుకుంది. ఎలాగైనా నకిలీ మాంత్రికుడి కుట్ర బయట పెడతామని సఫియా మాహి మరో మహిళను వెంట బెట్టుకుని సయ్యద్ హుస్సేన్ దగ్గరికి వెళ్లింది. ఈ క్రమంలోనే అతని మాయ మాటలు నమ్మినట్టు నటించారు. గదిలోకి తీసుకు వెళ్లగానే అప్పటికే మాటు వేసిన పోలీసులు సయ్యద్ హుస్సేన్ ను రెడ్ హ్యాండెడ్ గా అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ నకిలీ బాబా ఫోన్లో దాదాపు 500 కు పైగా మహిళల నగ్న ఫోటోలు, వీడియోలు ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. అయితే సయ్యద్ తో పాటు ఈ దొంగ బాబా అవతారం ఎత్తిన వారు ఇంకా ఎవరున్నారు, అన్న దానిపైన కూడా పోలీసులు విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. అలాగే గుల్బర్గాలో ఉన్న గులాం ని కూడా పట్టుకునే దిశలో పోలీసులు అడుగు వేస్తున్నారు.
Hyderabad News: ఈజీ మనీ కోసం డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఐదుగురు యువకులు అరెస్ట్ - ఎవరో తెలిస్తే షాక్ !
Viveka Murder Case : నిజాలు బయటపడే రోజు దగ్గర్లోనే, సీఎం జగన్ సహకరించి ఉంటే 10 రోజుల్లో విచారణ పూర్తి - దస్తగిరి
Eluru: తల్లీకూతుర్లను ఇంటికి తెచ్చుకున్న ప్రియుడు, ఆమెతో సహజీవనం! విషాదం మిగిల్చిన కరెంటు బిల్లు!
Jagityal: కన్నకూతుర్లని బావిలోకి తోసేసిన తండ్రి, ఆ వెంటనే తర్వాత మరో ఘోరం!
Hero Naveen Reddy : టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ రెడ్డి అరెస్టు, చీటింగ్ చేసి జల్సాలు!
Harirama Jogaiah Vs Amarnath : నువ్వు రాజకీయాల్లో బచ్చావి, మీరు మానసికంగా బాగుండాలి- హరిరామజోగయ్య వర్సెస్ మంత్రి అమర్నాథ్
Jr NTR: అప్డేట్ ఉంటే భార్య కంటే ముందు మీకే చెప్తా - ఫ్యాన్స్‌కు ఎన్టీఆర్ క్లాస్!
Bandi Sanjay: నాందేడ్ లో బీఆర్ఎస్ సభ అట్టర్ ఫ్లాప్, రూ.500 ఇచ్చి జనాన్ని పట్టుకొచ్చి డ్రామాలు: బండి సంజయ్
AP SI Hall Tickets: ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్ష హాల్‌టికెట్లు వచ్చేశాయ్! డైరెక్ట్ లింక్ ఇదే! ఫిబ్రవరి 15 వరకు అందుబాటులో! పరీక్ష ఎప్పుడంటే?