News
News
X

Guntur Crime : అద్దె కారు, పోలీస్ స్టిక్కర్, ఐటీ అధికారుల పేరిట తనిఖీలు- రూ.50 లక్షలు చోరీ

Guntur Crime : ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులమంటూ వచ్చి తనిఖీలు చేస్తున్నట్లు నటించి నగదు, నగలతో ఉడాయించారు కేటుగాళ్లు. ఈ కేసును గుంటూరు పోలీసులు రెండ్రోజుల్లోనే ఛేదించారు.

FOLLOW US: 
Share:

Guntur Crime : అది పేదలు ఎక్కువగా నివసించే కాలనీ... ఆ కాలనీలో అందమైన భవనం....భవనం చుట్టూ ఎనిమిది సీసీ కెమెరాలు. భవనంలోకి వచ్చి పోతుండే రిచ్ పర్సన్స్. దీంతో చుట్టూ పక్కల కలకలం. వస్తున్న వాళ్లు ఎవరు? ఆ ఇంట్లో ఏం జరుగుతుందన్న చర్చ.  చివరికి వారు ఊహించిందే కరెక్ట్. కట్టల కొద్దీ డబ్బులు. సవర్ల కొద్దీ బంగారు ఆభరణాలు. ఇంకేంముంది పక్కాగా ప్లాన్ వేశారు. అనుకున్నదంతా కొట్టేశారు. కానీ పోలీసులకు చిక్కారు. ఇది నకిలీ ఐటీ అధికారులు చోరి బాగోతం. 

అసలేం జరిగింది? 

 గుంటూరులోని ప్రగతి నగర్.. ఐదో లైన్ లో సింగంశెట్టి కల్యాణి అనే మహిళ నివస్తుంది. ఈమెకు పరిచయస్తులైన ప్రసాద్ వ్యాపారం చేస్తుంటాడు. ఇతనికి ఆస్తి వివాదాలున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రసాద్ తన డబ్బులును కల్యాణి వద్ద దాచి పెడుతుంటాడు. ఒకటి బంధువులకు తెలియకూడదన్న జాగ్రత్త.. రెండోది ప్రభుత్వ అధికారుల నుంచి అక్రమ సంపాదననను కాపాడుకోవడం లక్ష్యంగా ప్రసాద్ దాచి పెడుతున్నాడు. అయితే ప్రసాద్ వచ్చి పోతుండటాన్ని గమనించిన స్థానికులు ఇంట్లో పెద్ద ఎత్తున నగదు, నగలున్నట్లు భావించారు. కల్యాణి ఇంటికి వచ్చి పోయే జాన్ బాబు, యేసు బాబులు కల్యాణి ఇంట్లో పెద్ద ఎత్తున నగదు, నగలున్నట్లు తెలుసుకున్నారు. ఈ మధ్య కాలంలో ప్రసాద్ పొలం అమ్మగా వచ్చిన డబ్బుల్లో యాభై లక్షల రూపాయలను కల్యాణి ఇంటిలో దాచి పెట్టాడు. ఈ విషయం జాన్ బాబు, యేసు బాబుకు తెలిసింది. ఆ డబ్బులతో పాటు నగలు కొట్టేయాలని బాబులిద్దరూ డిసైడ్ అయ్యారు. ఇంకేంముంది బాబులకు స్నేహితులైన సురేష్, రవీంద్ర, వెంకట స్వామి, విజయ్ కుమార్ లకు విషయాన్ని చెప్పారు. అందరూ కలిసి ప్లాన్ వేశారు. ఐటీ అధికారుల రూపం ఎత్తితే పని సులువుగా చేయొచ్చని భావించారు. దీంతో సురేష్ కారు అద్దెకు తీసుకున్నాడు. నంబర్ ప్లేట్ తీసేసి పోలీస్ స్టిక్కర్ అంటించాడు. అతని స్నేహితులైన రవీంద్రబాబు, వెంకటస్వామిలను కారులో ఎక్కించుకున్నాడు. వీరికి ముందు ఆటోలో జాన్ బాబు, యేసు బాబు, విజయ్ కుమార్ లు వెళ్తూ కల్యాణి ఇల్లు చూపించారు. 

ఐటీ అధికారుల పేరిట దోపిడీ

ఆటోలో ప్రయాణించిన ముగ్గురు ఇంటి బయట కాపలా ఉండగా కారులో వచ్చిన ముగ్గురు ఐటీ అధికారులమంటూ ఇంటిలోకి వెళ్లారు. కల్యాణిని బెదిరించి డబ్బులు, నగలు తీసుకున్నారు. ఆమె వేలి ముద్రల కూడా సేకరించారు. ఐడీ కార్డులు చూపించారు. చివర్లో తుపాకీ పెట్టి కల్యాణిని బెదిరించారు కూడా. ఇంట్లో ఉన్న నగదు, నగలు తీసుకొని ఇంటి బయటకు వచ్చి కారులో వెళ్లి పోయారు. జాన్, యేసు బాబు ఆ తర్వాత ఇంట్లోకి వెళ్లి ఏం జరిగిందో తెలుసుకొని కల్యాణిని వెంట పెట్టుకొని పోలీస్ స్టేషన్ వెళ్లారు. నకిలీ ఐటీ అధికారులు పేరుతో దోపిడి చేసినట్లు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పాత గుంటూరు పోలీసులు సీసీ కెమెరాలు, కాల్ డేటా ఆధారంగా కేసును చేధించారు. ఐదుగురిని అరెస్ట్ చేసి రూ.48,50,000 నగదు, 1326 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. తుపాకీతో బెదిరించిన వెంకట స్వామి మాత్రం పరారీలో ఉన్నాడు. అతన్ని పట్టుకున్న తర్వాత తుపాకి నిజమైనదా కాదా అన్న వివరాలు వెల్లడిస్తామని ఎస్పీ ఆరీఫ్ హాఫీజ్ చెప్పారు. రెండు రోజుల్లోనే నిందితులను పట్టుకన్న పోలీసులను ఎస్సీ అభినందించారు. 

Published at : 25 Feb 2023 09:57 PM (IST) Tags: AP News Crime News Cash Guntur Robbery fake IT officials

సంబంధిత కథనాలు

Tirupati: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సజీవ దహనం, కారుతోసహా తగలబెట్టిన దుండగులు

Tirupati: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సజీవ దహనం, కారుతోసహా తగలబెట్టిన దుండగులు

TSPSC పేపర్ లీకేజీ కేసులో రేణుకకు షాక్ - ఆమె రిక్వెస్ట్ ను తోసిపుచ్చిన నాంపల్లి కోర్టు

TSPSC పేపర్ లీకేజీ కేసులో రేణుకకు షాక్ - ఆమె రిక్వెస్ట్ ను తోసిపుచ్చిన నాంపల్లి కోర్టు

Tirupati Crime : విద్యార్థినికి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్న లెక్చరర్, నిందితుడికి అంతకు ముందే పెళ్లి!

Tirupati Crime :  విద్యార్థినికి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్న లెక్చరర్, నిందితుడికి అంతకు ముందే పెళ్లి!

Data Theft Case : వినయ్ భరద్వాజ ల్యాప్ టాప్ లో 66.9 కోట్ల మంది డేటా- 24 రాష్ట్రాలు, 8 మెట్రోపాలిటిన్ సిటీల్లో డేటా చోరీ

Data Theft Case : వినయ్ భరద్వాజ ల్యాప్ టాప్ లో 66.9 కోట్ల మంది డేటా- 24 రాష్ట్రాలు, 8 మెట్రోపాలిటిన్ సిటీల్లో డేటా చోరీ

Tirupati News : ఏడో తరగతి విద్యార్థినితో ఆర్టీసీ డ్రైవర్ అసభ్య ప్రవర్తన, ఫొటోలు తీసి పైశాచిక ఆనందం

Tirupati News : ఏడో తరగతి విద్యార్థినితో ఆర్టీసీ డ్రైవర్ అసభ్య ప్రవర్తన, ఫొటోలు తీసి పైశాచిక ఆనందం

టాప్ స్టోరీస్

Nara Lokesh: చెప్పేవి నీతులు దోచేవి గుట్టలు, గుడ్‌మార్నింగ్ ధర్మవరం అబద్ధం - ఎమ్మెల్యే కేతిరెడ్డిపై లోకేష్

Nara Lokesh: చెప్పేవి నీతులు దోచేవి గుట్టలు, గుడ్‌మార్నింగ్ ధర్మవరం అబద్ధం - ఎమ్మెల్యే కేతిరెడ్డిపై లోకేష్

MLA Durgam Chinnaiah: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వార్నింగ్! మావోయిస్టుల లేఖ కలకలం

MLA Durgam Chinnaiah: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వార్నింగ్! మావోయిస్టుల లేఖ కలకలం

IPL Match Hyderabad: హైదరాబాద్‌లో IPL సందడి - టీఎస్ఆర్టీసీ, హైదరాబాద్ మెట్రో కీలక ప్రకటనలు

IPL Match Hyderabad: హైదరాబాద్‌లో IPL సందడి - టీఎస్ఆర్టీసీ, హైదరాబాద్ మెట్రో కీలక ప్రకటనలు

NBK108 OTT Details : రికార్డు రేటుకు బాలకృష్ణ సినిమా ఓటీటీ రైట్స్

NBK108 OTT Details : రికార్డు రేటుకు బాలకృష్ణ సినిమా ఓటీటీ రైట్స్