Goa Murder: గోవాలో గోదావరి యువకుడ్ని కొట్టి చంపిన హోటల్ వ్యాపారులు - రేట్లు ఎందుకు పెంచారని అడగడమే పాపం!
Godavari: గోవాలో రవితేజ అనే తాడేపల్లి గూడెం యువకుడ్ని హోటల్ నిర్వాహకులు కొట్టి చంపేశారు. ఈ ఘటన కలకలం రేపుతోంది.
godavari district youth beaten to death goa hotel management: గోవాలో నూతన సంవత్సర వేడుకలు చేసుకోవడానికి వెళ్లిన ఓ యువకుడ్ని గోవాలో హోటల్ నిర్వాహకులు కొట్టి చంపేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నూతన సంవత్సర వేడుకల కోసం తాడేపల్లిగూడెం నుండి గోవా వెళ్లిన ఎనిమిది మంది స్నేహితుల బృందం వెళ్లింది. డిసెంబర్ 31 ఆదివారం అర్ధరాత్రి గోవాలో రెస్టారెంట్‌కు వెళ్లారు. అక్కడ ఫుడ్ ఆర్డర్ చేశారు. అయితే ఫుడ్ రేట్లను రెండింతలు వేసి బిల్లు వేయడంతో ఇదేమని ఆ స్నేహితులు ప్రశ్నించారు. ఈ సందర్భంగా సిబ్బందికి స్నేహితులకి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
పోలీసుల అండ చూసుకుని హోటల్ వ్యాపారులు మరింతగా రెచ్చిపోతున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రవితేజను దారుణంగా కొట్టి చంపినా పోలీసుల నుంచి అనుకున్నంత స్థాయిలో స్పందన రాలేదని అంటున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని గోవా ప్రభుత్వంతో మాట్లాడి రవితేజ కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలన్న వాదనలు వినిపిస్తున్నాయి.