అన్వేషించండి

Elamanchili: గంజాయి కోసం పోలీస్‌ స్టేషన్‌కే కన్నం- కిటికీ ఊచలు తొలగించి చోరీ

ఇళ్లకు కన్నాలేసే దొంగలను చూశాం. కానీ.. వీళ్ల రూటే వేరు. ఏకంగా పోలీస్‌ష్టేషన్‌కే కన్నమేశారు. సీజ్‌ చేసి స్టేషన్‌లో పెట్టిన గంజాయి మొత్తం ఎత్తుకెళ్లారు. చివరికి పోలీసులకు చిక్కి ఊచలు లెక్కిస్తున్నారు.

Theft In Police Station: ఎక్కడైన దొంగలు పడితే.. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. మరి పోలీస్‌ స్టేషన్‌లోనే దొంగలు పడితే..! ఏం చేయాలి..? వారు ఎవరికి  చెప్పుకోవాలి. ఒక్కసారి కాదు.. రెండు సార్లు.... ఆరు నెలల వ్యవధిలోనే రెండు సార్లు ఒకే పోలీస్‌స్టేషన్‌కు కన్నమేశారు దొంగలు. అది కూడా... గంజాయి కోసం. పోలీసులు  సీజ్‌ చేసిన గంజాయిని దోచుకెళ్లారు దొంగు. ఈ విషయం స్వయంగా పోలీసులే ఒప్పుకున్నారు. డే అంట్‌ నైట్‌ పోలీసులతో... ఫుల్‌ సెక్యూరిటీతో ఉండే పోలీస్‌ స్టేషన్‌లోనే  దొంగతనం జరిగిందంటే... మరి సామాన్యుల పరిస్థితి ఏంటి..? వారికి భద్రత ఏది..? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇంతకీ చోరీ జరిగింది ఏ పోలీస్‌స్టేషన్‌లో..?  పోలీస్‌స్టేషన్‌కే కన్నం వేసినా ఆ దొంగలను పోలీసులు పట్టుకోగలిగారా..?

స్టేషన్‌కే కన్నవేసిన దొంగలు 

అనకాపల్లి జిల్లా ఎలమంచిలి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌... ఈ స్టేషన్‌కే కన్నం వేశారు దొంగలు. అది పోలీస్‌స్టేషన్‌... ఎప్పుడూ పోలీసులు ఉంటారు.. దొరికితే పనిపడతారు అన్న  భయం లేకుండా దర్జాగా స్టేషన్‌లో చొరబడి దొంగతనం చేశారు. పోలీసులు సీజ్‌ చేసి భద్రపరిచిన గంజాయిని... దోచుకెళ్లారు దొంగలు. ఎవరి కంటా పడకుండా... పోలీస్‌  స్టేషన్‌లోని స్టోర్‌రూమ్‌లోకి చొరబడి... అక్కడున్న గంజాయితో ఉడాయించారు. ఈ కేసులో ఎనిమిది మందిని అరెస్టు చేసినట్టు సీఐ గఫూర్‌ తెలిపారు. 

గంజాయితో ఉడాయించిన దొంగలు

ఎలమంచిలి పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం... వేర్వేరు ప్రాంతాల్లో స్వాధీనం చేసుకున్న గంజాయిని... రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లోని స్టోర్‌ రూమ్‌లో భద్రపరచారు. అయితే  ఎలమంచిలికే చెందిన రవితేజ, కుసుమకుమార్‌, తేజ, సాయి, వెంకటేష్‌, గణేష్‌, మరో ఇద్దరు మైనర్లు కలిసి... ఆ గంజాయిని దొంగిలించారు. స్టోర్‌ రూమ్‌ కిటికీ గ్రిల్‌ తొలగించి..  లోపలికి చొరబడ్డారు. స్టోర్‌ రూమ్‌లో దాచిన 362 కిలోల గంజాయి దోచుకెళ్లారు. ఆరు నెలల క్రితం ఒకసారి... 15 రోజుల క్రితం ఒకసారి.. ఇలా రెండుసార్లుగా మొత్తం గంజాయి  ఎత్తుకెళ్లారు. స్టేషన్‌లో భద్రపరిచిన గంజాయి చోరీ అవడంతో... పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఎనిమిది మంది నిందితులను అరెస్ట్‌ చేశారు. వారి నుంచి 310  కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

దర్యాప్తు వేగవంతం 

పోలీస్‌స్టేషన్‌కే కన్నమేశారంటే... వారు మామూలోళ్లు కాదు అనుకున్నారో ఏమో...? ఈ కేసులో లోతుగా దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక బృందాన్ని నియమించనున్నట్టు  తెలిపారు పోలీసు అధికారులు. నిందితులకు సంబంధించి.. గత రికార్డులు కూడా వెరిఫై చేస్తున్నారు పోలీసులు. పోలీస్‌ స్టేషన్‌కు కన్నం వేయడం ఇదే మొదటిసారా..? లేక  ఇలాంటి చోరీలు ముందు కూడా చేశారా అన్న కోణంలో దర్యాప్తు చేయనున్నారు. అలా... దొంగిలించిన గంజాయిని ఏం చేయబోయారు..? పోలీస్‌స్టేషన్‌ నుంచి 362 కేజీల  గంజాయిని తీసుకెళ్లిన వారి నుంచి... 310 కిలోలు మాత్రమే రికవరీ చేశారు పోలీసులు. మరి మిగిలిన గంజాయిని ఏం చేశారు..? ఎవరికి విక్రయించారు..? అన్నదానిపై కూడా  ఆరా తీస్తున్నారు. ఈ కేసులో లోతుగా దర్యాప్తు చేస్తే... గంజాయి ముఠా లింకులు కూడా బయటపడే అవకాశం ఉందంటున్నారు పోలీసులు.

పోలీసులు అరెస్ట్‌ చేసిన ఎనిమిది మంది నిందితుల్లో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నారు. వారు మైనర్లు కావడంతో.. వారి వివరాలు గోప్యంగా ఉంచారు పోలీసులు. ఈ ముఠా  కేవలం దొంగతనాలు చేసే గ్యాంగేనా...? లేక... గంజాయి బ్యాచ్‌లో సంబంధాలు ఉన్నాయా అన్నది కూడా విచారణలో తేలుస్తామంటున్నారు పోలీసులు. ప్రస్తుతం ఎనిమిది  మంది నిందితులను రిమాండ్‌కు పంపారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Ram Charan: మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
Mechanic Rocky Review - 'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
IND vs AUS 1st Test: ఆస్ట్రేలియాతో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌- ప్లేయింగ్ 11లో నితీశ్‌కు చోటు 
ఆస్ట్రేలియాతో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌- ప్లేయింగ్ 11లో నితీశ్‌కు చోటు 
Sabarimala Temple 18 Steps: శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
Embed widget