అన్వేషించండి

కూలిన తరగతి గది పైకప్పు, నలుగురు విద్యార్థులకు గాయాలు! 

తిరుపతిలోని మహాత్మ గాంధీ మున్సిపల్ హైస్కూల్ లో తరగతి పైకప్పు కూలింది. ఈ ఘటనలో నలుగురు విద్యార్థులకు గాయాలు అయ్యాయి. ప్రస్తుతం వీరంతా స్విమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని మహాత్మా గాంధీ నగరపాలక ఉన్నత పాఠశాల క్లాస్ రూము పైకప్పు పడి పోవడంతో నలుగురు విద్యార్ధులు గాయాల పాలయ్యారు. ఈ ప్రమాదంలో 9వ తరగతి విద్యార్ధి యశ్వంత్ తీవ్రంగా గాయపడగా.. మరో నలుగురు విద్యార్ధులు తేజత ప్రభావ్, సంతోష్, మోహిత్ కుమార్ స్వల్పంగా గాయాలు అయ్యాయి. అయితే విషయం గుర్తించిన అధ్యాపకులు వెంటనే వీరిని స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు. పాఠశాలలోని 9వ తరగతి బి సెక్షన్ తరగతి గదిలో ఈ ఘటన చోటు చేసుకుంది. విద్యార్థులకు వైద్యం అందించిన వైద్యులు.. విద్యార్థుల ప్రాణాలకు ఎలాంటా అపాయం లేదని తెలిపారు.


కూలిన తరగతి గది పైకప్పు, నలుగురు విద్యార్థులకు గాయాలు! 

తమ పిల్లలకు ఏమైందోనని కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు..

పాఠశాల ఉపాధ్యాయుల ద్వారా విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు.. కన్నీరుమున్నీరుగా విలపిస్తూ ఆస్పత్రికి చేరుకున్నారు. తమ పిల్లలకు ఏమైపోయిందోనని తెగ హైరానా పడిపోయారు. కానీ వారి ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు చెప్పడంతో.. కాస్త కుదుట పడ్డారు. తమ పిల్లల అదృష్టం బాగుండబట్టే పెను ప్రమాదం తప్పిందని చెబుతున్నారు. పిల్లలకు ఏమైనా జరిగితే తమ పరిస్థితి ఏంటని ఆవేదన చెందుతున్నారు. శిథిలావస్థలో ఉన్న భవనంలో తరగతులు నిర్వహించడం వల్లే ఈ ప్రమాదం ఏర్పడిందని.. ఇప్పటికైనా అధికారులు స్పందించి పాఠశాల భవనాన్ని నిర్మించాలని కోరారు. 


కూలిన తరగతి గది పైకప్పు, నలుగురు విద్యార్థులకు గాయాలు! 

సంఘటనా స్థలానికి చేరుకున్న మున్సిపల్ కమిషనర్..

పాఠశాలలో జరిగిన ఘటన గురించి తెలుసుకున్న నగర పాలక కమిషనర్ అనుపమ అంజలి హుటాహుటిని మహాత్మా గాంధీ నగరపాలక ఉన్నత పాఠశాలకు చేరుకున్నారు. అక్కడి పరిస్థితిని గురించి అడిగి తెలుసుకున్నారు. అయితే ఘటన జరగడానికి గల కారణాలపై ఆరా తీశారు. ల్యాబ్ లోని విద్యార్ధులను ఖాలీ చేయించి మరో క్లాస్ రూంకు తరలించారు. అయితే మహాత్మా గాంధీ నగర పాలక ఉన్నత పాఠశాల ఆవరణలో నాడు - నేడు ఫేజ్ -2  కింద కొత్తగా నాలుగు తరగతి గదుల నిర్మాణం జరుగుతోంది. ఈ పనులు మరో మూడు నెలల్లో పూర్తి కానున్నాయని అధికారులు చెబుతున్నారు. పాఠశాల పాత భవనం కావడంతో గత కొద్ది రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల కారణంగా క్లాస్ రూంలోని పైకప్పు ఊడి పడినట్లు అధికారులు నిర్ధారణకు వచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని నగర పాలక కమిషనర్ అనుపమ అంజలి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

టాప్ హెడ్ లైన్స్

Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Embed widget