Vijayawada News: అర్ధరాత్రి బాలిక ఇంటికి వెళ్లిన యువకుడు - బలవంతంగా పెళ్లి చేసేశారు, ఎక్కడంటే?
Andhra News: ప్రేమించిన బాలిక ఇంటికి అర్ధరాత్రి వెళ్లిన యువకుడికి ఆమెతో బలవంతంగా పెళ్లి చేయించిన ఘటన కృష్ణా జిల్లా గన్నవరంలో చోటు చేసుకుంది. ఆమె మైనర్ అని తేలడంతో పోలీసులు ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చారు.
Young Man Forced Marriage In Gannavaram: తాను ప్రేమించిన బాలిక ఇంటికి వెళ్లిన యువకుడికి ఊహించని షాక్ ఎదురైంది. అర్ధరాత్రి అతన్ని గుర్తించిన బాలిక బంధువులు అతనితో బలవంతంగా ఆమెకు తాళి కట్టించారు. ఈ ఘటన కృష్ణా జిల్లా గన్నవరంలో (Gannavaram) చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గన్నవరం పరిధిలోని ఓ గ్రామంలో బాలిక తన పిన్ని వద్ద ఉంటోంది. అదే మండలంలో సూరంపల్లి గ్రామానికి చెందిన గుర్రం శ్రీకాంత్ అనే యువకుడు ఆమెను ప్రేమించాడు. కొద్దిరోజుల తర్వాత బాలిక సైతం అతన్ని ప్రేమించింది. ఇలా ఏడాదిగా వారిద్దరూ ప్రేమించుకుంటున్నారు. కొంతకాలంగా బాలిక ఉంటున్న ఇంటి వద్దకు శ్రీకాంత్ వెళ్తుండగా చుట్టుపక్కల వాళ్లు గమనించారు. ఈ క్రమంలోనే శనివారం రాత్రి బాలిక ఇంటికి శ్రీకాంత్ వెళ్లగా ఆమె బంధువులు యువకుడిని తాళ్లతో బంధించారు.
బలవంతంగా పెళ్లి
బాలిక మెడలో తాళి కట్టాలని యువకుడిని బలవంతం చేశారు. యువకుడి తల్లిదండ్రులకు సైతం సమాచారం ఇచ్చారు. బాలికను పెళ్లి చేసుకోవాలని ఆమె తరఫు బంధువులు వారిని అడగడంతో.. కులాలు వేరు కావడం వల్ల వారు ఒప్పుకోలేదు. అయితే, బాలిక తరఫు బంధువులు గ్రామపెద్దల సమక్షంలో బాలిక మెడలో శ్రీకాంత్‌తో బలవంతంగా తాళి కట్టించి.. ఇద్దరికీ పెళ్లైనట్లు ప్రకటించారు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. పోలీసులు బాలిక, యువకుడి కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. బాలిక మైనర్ అని తేలడంతో ఐసీడీఎస్‌కు సమాచారం ఇచ్చారు. వారు బాలికను ఉజ్వల హౌంకు తరలించారు.
Also Read: Vizag Crime News : విశాఖలో మాయలేడి జాయ్ హానీ ట్రాపే హాట్ టాపిక్ - ఆమె బాధితుల్లో ఉన్న ప్రముఖులెవరు ?