అన్వేషించండి

Hyderabad Drugs Party: హైదరాబాద్ రిసార్ట్‌లో పార్టీ.. డ్రగ్స్ టెస్టులో బాలీవుడ్ నటుడు, ఓ జంటకు పాజిటివ్

Hyderabad Crime News | తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ నిర్మూలించేందుకు చర్యలు తీసుకుంటున్నా మార్పు కనిపించడం లేదు. వీకెండ్ వస్తే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో డ్రగ్స్ పార్టీలు ఏదో చోట జరుగుతూనే ఉన్నాయి.

Drug Bust at Hyderabad Resort | హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ నిర్మూలనకు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ, వీకెండ్ వచ్చిందంటే చాలు నగర పరిసర ప్రాంతాల్లో మత్తు పార్టీల జోరు తగ్గడం లేదు. తాజాగా హైదరాబాద్‌లోని గోల్కొండ సమీపంలో గల తారామతి బారాదరి రిసార్ట్‌లో ‘మోర్‌ దెన్‌ ఫ్రెండ్స్‌’ పేరుతో నిర్వహించిన ఒక భారీ డ్రగ్ పార్టీని పోలీసులు అడ్డుకున్నారు. శనివారం అర్ధరాత్రి ఈగల్‌ టాస్క్‌ఫోర్స్, హైదరాబాద్‌ నార్కొటిక్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌ (H-NEW), గోల్కొండ పోలీసులు సంయుక్తంగా జరిపిన ఈ దాడుల్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

బాలీవుడ్ నటుడు, భార్యాభర్తలకు డ్రగ్స్ పాజిటివ్
రిసార్టులో జరిగిన పార్టీకి సుమారు 300 మంది వరకు హాజరయ్యారు. పక్కా సమాచారంతో తారామతి బారాదరి రిసార్ట్‌పై ఆకస్మిక దాడులు చేసిన పోలీసులు ప్రాథమికంగా అనుమానం వచ్చిన 35 మందికి డ్రగ్స్ టెస్టులు నిర్వహించారు. వీరిలో బాలీవుడ్‌ నటుడు అబ్దుల్‌ సర్వర్‌తో పాటు అభినాశ్‌ ఫణి, యోగేశ్వర్, బ్రెట్‌ జాసన్‌లతో పాటు నిహార్- ఆషి అనే భార్యాభర్తలు సైతం గంజాయి, కొకైన్ వంటి మాదకద్రవ్యాలు సేవించినట్లు నిర్ధారణ అయింది. మొత్తం ఆరుగురికి డ్రగ్స్ టెస్టులో పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. డీజే జాసన్ సూచన మేరకు వీరంతా ఈ పార్టీకి హాజరైనట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.

ఈ పార్టీకి హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, ఢిల్లీ, ముంబయి  నుంచి భారీ సంఖ్యలో యువతీ యువకులు, విద్యార్థులు, ఐటీ ప్రొఫేషనల్స్ హాజరయ్యారు. అయితే పాల్గొన్న వారిలో స్థానికుల కంటే ఇతర నగరాల నుంచి వచ్చిన వారే ఎక్కువగా ఉన్నారని పోలీసులు గుర్తించారు. అయితే నిందితులకు డ్రగ్స్ ఎక్కడి నుంచి సరఫరా అయ్యాయి, ఈ పార్టీలు రెగ్యూలర్ గా జరుగుతున్నాయా అనే కోణంలో హైదరాబాద్ నార్కోటిక్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు గోల్కొండ పీఎస్‌కు తరలించి కేసు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఈవెంట్ నిర్వహించిన వారిపై చర్యలు తీసుకునే దిశగా దర్యాప్తు సాగుతోంది. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Shabad Mass Murder Accused Suicide: షాబాద్ వరుస హత్యల కేసులో ట్విస్ట్! సైకో కిల్లర్ రాజ్‌కుమార్ ఆత్మహత్య!
Shabad Mass Murder Accused Suicide: షాబాద్ వరుస హత్యల కేసులో ట్విస్ట్! సైకో కిల్లర్ రాజ్‌కుమార్ ఆత్మహత్య!
Bangkok Pub Fire Accident: థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఘోర ప్రమాదం.. పబ్‌లో మంటలు చెలరేగి 27 మంది మృతి
థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఘోర ప్రమాదం.. పబ్‌లో మంటలు చెలరేగి 27 మంది మృతి
Vikarabad Crime News: అనంతగిరి కొండల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లి హైదరాబాద్ మహిళ మృతి.. వికారాబాద్ జిల్లాలో ఘటన
అనంతగిరి కొండల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లి హైదరాబాద్ మహిళ మృతి.. వికారాబాద్ జిల్లాలో ఘటన
Hyderabad Crime News: చార్మినార్ ఏసీపీ భార్య ఆత్మహత్య.. సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకొని బలవన్మరణం
చార్మినార్ ఏసీపీ భార్య ఆత్మహత్య.. సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకొని బలవన్మరణం

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jr NTR Political Entry: జులై 18న Jr NTR పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన చేస్తారా? ఇదిగో క్లారిటీ
జులై 18న Jr NTR పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన చేస్తారా? ఇదిగో క్లారిటీ
One Nation One Election Bill: దేశ రాజకీయాల్లో మహా మార్పులు! వన్ నేషన్-వన్ ఎలక్షన్, 850 లోక్‌సభ సీట్లు.. మహిళా రిజర్వేషన్ల అసలు కథ!
దేశ రాజకీయాల్లో మహా మార్పులు! వన్ నేషన్-వన్ ఎలక్షన్, 850 లోక్‌సభ సీట్లు.. మహిళా రిజర్వేషన్ల అసలు కథ!
virat Kohli Records: 6 నెలల తరువాత బ్లూ జెర్సీలో విరాట్ కోహ్లీ.. రికార్డుల వేటకు కింగ్ రెడీ
6 నెలల తరువాత బ్లూ జెర్సీలో విరాట్ కోహ్లీ.. రికార్డుల వేటకు కింగ్ రెడీ
Jagan Mohan Reddy Lone Battle: మిత్రుల వేటలో అలసిపోతున్న జగన్‌ - వైసీపీ ఒంటరి పోరాటం - కూటమి కట్టే ఆప్షన్ లేదా?
మిత్రుల వేటలో అలసిపోతున్న జగన్‌ - వైసీపీ ఒంటరి పోరాటం - కూటమి కట్టే ఆప్షన్ లేదా?
26/11 ఉగ్రదాడి కాంగ్రెస్, ISI ల మ్యాచ్ ఫిక్సింగ్.. UPA హయాంలోనే హిందూ ఉగ్రవాదం! మాజీ అండర్ సెక్రటరీ సంచలన ఆరోపణలు
26/11 ఉగ్రదాడి కాంగ్రెస్, ISI ల మ్యాచ్ ఫిక్సింగ్.. UPA హయాంలోనే హిందూ ఉగ్రవాదం! మాజీ అండర్ సెక్రటరీ ఆరోపణలు
187km రేంజ్‌తో కొత్త Vida VX2 Plus లాంచ్‌ - ఆంధ్రప్రదేశ్ & తెలంగాణలో ఆన్‌రోడ్ ధర వివరాలు ఇవే!
సింగిల్‌ ఛార్జ్‌తో దాదాపు 190km జర్నీ- భారీ బ్యాటరీతో Vida VX2 Plus లాంచ్‌, తెలుగు రాష్ట్రాల్లో ధర ఎంత?
Bangkok Pub Fire Accident: థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఘోర ప్రమాదం.. పబ్‌లో మంటలు చెలరేగి 27 మంది మృతి
థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఘోర ప్రమాదం.. పబ్‌లో మంటలు చెలరేగి 27 మంది మృతి
Vikarabad Crime News: అనంతగిరి కొండల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లి హైదరాబాద్ మహిళ మృతి.. వికారాబాద్ జిల్లాలో ఘటన
అనంతగిరి కొండల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లి హైదరాబాద్ మహిళ మృతి.. వికారాబాద్ జిల్లాలో ఘటన
Embed widget