అన్వేషించండి

Girl Suicide in Nizamabad: ప్రేమలో మోసపోయానంటూ టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య, కన్నీళ్లు పెట్టిస్తోన్న సూసైడ్ లెటర్

ప్రేమ పేరుతో మోసపోయిన బాలిక ప్రాణాలు తీసుకుంది. దూలానికి చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తెలిసీతెలియని వయస్సులో ప్రేమ ఉచ్చులో పడి బలవన్మరణానికి పాల్పడింది.

- ప్రేమ పేరుతో మోసపోయిన పదో తరగతి విద్యార్థిని
- ప్రేమించిన వ్యక్తి వేధించడంతో భరించలేక ఆత్మహత్య
- ఇంట్లో దూలానికి చున్నీతో ఉరేసుకున్న బాలిక
- అమ్మ నాన్నలను జాగ్రత్తగా చూసుకో అన్నయ్య అంటూ సూసైడ్‌ లెటర్‌
- బాలిక ప్రేమించినది మైనర్‌ బాలుడినని చెప్తున్న పోలీసులు

తెలిసీ తెలియని వయస్సు. మంచిగా మాట్లాడితే... ప్రేమ అనుకుని భ్రమపడతారు. ఎవరో తెలియకుండా... వారి వలలో చిక్కుకుంటారు. వారు చెప్పిందల్లా చేస్తారు. చివరగా తాము మోసపోయామని తెలుసుకుని తట్టుకోలేరు. కొందరైతే ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు. తల్లిదండ్రులకు తీరని కడుపుకోత మిగులుస్తారు. ఇలాంటి విషాద సంఘటనే నిజామాబాద్‌ జిల్లాలో జరిగింది. 

నిజామాబాద్‌ జిల్లా యాలాల మండలం హాజీపూర్‌ గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థిని ప్రవళిక ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి చున్నీతో మురివేసుకుని ప్రాణాలు తీసుకుంది. బాలిక మృతికి ప్రేమ వ్యవహారమే కారణమని తెలిసింది. ప్రవళిక... యాలాల జడ్పీ హైస్కూల్లో పదో తరగతి చదువుతోంది. శనివారం ఉదయం... బాలిక తల్లి కూరగాయల మార్కెట్​కు వెళ్లి ఇంటికి తిరిగివచ్చింది. ఇంట్లో దూలానికి ఉరేసుకుని వేలాడుతున్న కూతుర్ని చూసి ఆందోళన చెందింది. పెద్దగా కేకలు వేసింది. అందరూ వచ్చి బాలికను కిందికి దించారు. అప్పటికే ప్రవళిక మృతిచెందింది. దీంతో గుండెలవిసేలా రోధించారు తల్లిదండ్రులు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలిక రాసిన సూసైడ్‌ లెటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. 

Girl Suicide in Nizamabad: ప్రేమలో మోసపోయానంటూ టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య, కన్నీళ్లు పెట్టిస్తోన్న సూసైడ్ లెటర్

బాలిక రాసిన సూసైడ్‌ లెటర్‌ అందరికీ కంటతడి పెట్టింది. అన్నయ్య.. అమ్మ నాన్నలను జాగ్రత్తగా చూసుకో అంటూ లెటర్‌ రాసింది బాలిక. తాను ప్రేమ పేరుతో మోసపోయానని.. ఒకరు టార్చర్​ చేస్తున్నారని రాసింది. వేధింపులు భరించలేకపోతున్నానని... ఇక, బతకాలని లేదని, అందుకే మిమ్మల్ని వదిలేసి వెళ్లిపోతున్నాను అని లెటర్‌లో రాసింది. నా లైఫ్​ ముగిసింది.. మిమ్మల్ని మిస్​ అవుతున్నాను అంటూ బాలిక రాసిన సూసైడ్​నోట్ చదివిన వారందరికీ కన్నీరు తెప్పించింది.

ప్రవళిక.. అదే గ్రామానికి చెందిన ఒక యువకుడిని ప్రేమించిందని పోలీసుల విచారణలో తేలింది. వారి మధ్య విభేదాలు వచ్చాయి. ప్రేమించిన వ్యక్తి సోషల్​ మీడియాలో ఆమెను వేధిస్తున్నాడని గుర్తించారు. అందుకే బాలిక ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. అతని ఫోన్​ నంబర్ ​సూసైడ్ ​లెటర్​లో రాసి ఉంది. ప్రేమించిన వ్యక్తి మైనర్ ​అని పోలీసులు తెలిపారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. కంటికి రెప్పలా పెంచుకున్న కూతురు కళ్ల ముందే విగతజీవిగా పడి ఉండటం చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు. 

చిన్న వయసులో ప్రేమ, ఆకర్షణ లాంటి విషయాలకు దూరంగా ఉండాలని వైద్య నిపుణులు, అధికారులు, పోలీసులు తరచుగా సూచిస్తుంటారు. అమ్మాయిలకే కాదు, అబ్బాయిలకు సైతం జీవితం నాశనం అవుతుందని.. కొన్నిసార్లు రెండు కుటుంబాలు రోడ్డున పడతాయని అంటున్నారు. పరువు పేరుతో కుటుంబం మొత్తం ఆత్మహత్యలు చేసుకుటాయని, లేకపోతే పరువు హత్య పేరుతో అమ్మాయి, అబ్బాయిలను చంపేస్తున్న ఘటనలు ఉన్నాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. తల్లిదండ్రులు పిల్లల్ని ఓ కంట కనిపెడుతుండాలని సూచించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Shock for YCP:  వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
Special Trains: తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్ - 20 ప్రత్యేక రైళ్లు పొడిగింపు, ఈ రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే!
తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్ - 20 ప్రత్యేక రైళ్లు పొడిగింపు, ఈ రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే!
Allu Arjun Bail Petition: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా వేసిన నాంపల్లి కోర్టు, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
JC Prabhakar Reddy News: డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రాయల చెరువులో డ్రాగన్ బోట్ రేస్‌ ప్రారంభంఎంతో అందమైన ఈ వైజాగ్ వ్యూ పాయింట్ గురించి మీకు తెలుసా..?అన్నామలై వ్యూహాలతో బలం పెంచుకుంటున్న బీజేపీనచ్చని పని చేసిన మన్మోహన్, అయినా మోదీ పొగడ్తలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shock for YCP:  వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
Special Trains: తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్ - 20 ప్రత్యేక రైళ్లు పొడిగింపు, ఈ రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే!
తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్ - 20 ప్రత్యేక రైళ్లు పొడిగింపు, ఈ రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే!
Allu Arjun Bail Petition: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా వేసిన నాంపల్లి కోర్టు, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
JC Prabhakar Reddy News: డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
Gay Murderer: గే కానీ అమ్మాయిలా వేషం వేసి మగాళ్లను పిలుస్తాడు - వెళ్లారో చచ్చినట్లే - ఇప్పటికి 11 మంది !
గే కానీ అమ్మాయిలా వేషం వేసి మగాళ్లను పిలుస్తాడు - వెళ్లారో చచ్చినట్లే - ఇప్పటికి 11 మంది !
Manmohan Singh: 'మన్మోహన్ దూరదృష్టితో ఆర్థిక సంస్కరణలు తెచ్చారు' - మాజీ ప్రధాని పార్థివ దేహానికి తెలుగు రాష్ట్రాల సీఎంల నివాళి
'మన్మోహన్ దూరదృష్టితో ఆర్థిక సంస్కరణలు తెచ్చారు' - మాజీ ప్రధాని పార్థివ దేహానికి తెలుగు రాష్ట్రాల సీఎంల నివాళి
Vadde Naveen: వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
Boxing Day Test Live Updates: పట్టు బిగించిన ఆసీస్.. తొలి ఇన్నింగ్స్ లో ఎదురీదుతున్న భారత్.. అర్ధసెంచరీతో ఆకట్టుకున్న జైస్వాల్
పట్టు బిగించిన ఆసీస్.. తొలి ఇన్నింగ్స్ లో ఎదురీదుతున్న భారత్.. అర్ధసెంచరీతో ఆకట్టుకున్న జైస్వాల్
Embed widget