News
News
X

Teacher Murder : ఏడేళ్ల వయసులో అవమానించిందని 30 ఏళ్ల తర్వాత టీచర్ హత్య ! ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా ?

ఏడేళ్ల వయసులో ఉన్నప్పుడు క్లాసులో టీచర్ అవమానించిందని తనకు 37 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత హత్య చేశాడో సైకో. అదీ కూడా 101 సార్లు కత్తితో పొడిచాడు. ఈ సైకో పూర్తి డీటైల్స్ ఇవిగో

FOLLOW US: 
Share:

అది 2020.  బెల్జియంలోని ఆంటెవెర్స్‌ సమీపంలో ఉన్న హెరెంటల్స్‌ ఉన్న ఓ ఇల్లు.  సైలైన్స్‌లో ఎంత వయోలెన్స్ ఉంటుందో  అన్నంత సైలెంట్‌గా ఉంది. ఏదో తెలియని భయం వెంటాడుతూండగా.. ఆ ఇంట్లోకి వెళ్లి తొంగి చూశారు కొంత మంది. ఓ మహిళ ఒంటి నిండా కత్తి పోట్లతో.. కనిపించింది. అంతే వాళ్లు కెవ్వుమన్నారు. కాసేపటికి పోలీసులు వచ్చారు. అన్ని ఆధారాలను సేకరించారు. ఇక హంతకుడెవరు అనే దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక ఆధారాలను బట్టి చంపింది దొంగ కాదు అని నిర్ధారించుకున్నారు..ఎందుకంటే ఆ ఇంట్లో ఎలాంటి దోపిడీ జరగలేదు. ఇక అప్పట్నుంచి పోలీసులు వేట ప్రారంభించారు. ఆమెకు ఎవరెవరు శత్రువులు ఉన్నారు..? ఎవరితో గొడవలు ఉన్నాయని ఆరా తీశారు. కానీ ఒక్క క్లూ కూడా దొరకలేదు. ఆమెతో ఎవరికీ గొడవల్లేవు.. వివాదాల్లేవు..పైగా ఆమె టీచర్ . దాంతో ఆ హత్య కేసు ఛేదించడం పోలీసులకు సవాల్‌గా మారింది. 

అనుమానితుల డిఎన్‌ఎలను పరిష్కరించినా నిందితుడు దొరకలేదు. చివరకు ఆమె భర్త .. ఈ హత్య ఎవరైనా చూస్తే చెప్పాలంటూ సాక్షుల కోసం బహిరంగ విజ్ఞప్తి చేశారు. దాదాపుగా రెండేళ్ల పాటు ఎవరికీ హంతుకుడు ఎవరో ఎవరికీ తెలియదు. కానీ ఓ వ్యక్తి.. ఇలా తాను ఓకామెను చపానని తన స్నేహితుడుకి చెప్పుకున్నాడు. ఆ స్నేహితుడికి భయం వేసి ఆ సమాచారాన్ని పోలీసులకు ఇచ్చాడు. అంతే  నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకు చంపాడో అని ఆరా తీస్తే పోలీసులకు మైండ్ బ్లాంక్ అయింది. 
 
హత్యకు గురైన మహిళ దగ్గర గుంటర్‌ ఉవెంట్స్‌ ప్రాథమిక విద్యాభ్యాసం చేశాడు. యూకేజీలో ఉన్నప్పుడు అంటే ఏడేళ్ల వయసులో ఉన్నప్పుడు టీచర్ ఉవెంట్స్ ను తిట్టింది. దాన్ని అవమానంగా ఫీలయ్యాడు ఉవెంట్స్. అంతే మనసులో ఉంచుకున్నాడు. ముఫ్పై ఏళ్ల తర్వాత ప్రతీకారం తీర్చుకునేందుకు ... ఆ టీచర్ ఒంటరిగా ఇంట్లో ఉన్న సమయంలో దాడి చేశాడు. ఆమెను అత్యంత కిరాతకంగా 101 సార్లు పొడిచి చంపాడు. అవమానం తట్టుకోలేక 30 ఏళ్ల తర్వాత ఆమెను హత్యచేసినట్లు అంగీకరించాడని బెల్జియం పోలీసులు ప్రకటించారు. 

సాధారణంగా ఆరేడేళ్ల వయసులో ఉన్న వారు ఇలాంటి ఘటనలు మర్చిపోతారు. కానీ ప్రతీకారంతో రగిలిపోయిన ఉవెంటర్స్ ముఫ్పై ఏళ్ల తర్వాత కూడా అదే కసితో పెట్టుకుని టీచర్‌ను చంపేశాడు. ఈ ఘటన బెల్జియంలో సంచలనం సృష్టించింది.  గుంటర్‌ ఉవెంట్స్‌  తన నేరాన్ని అంగీకరించాడంతో  కేసు  మిస్టరీ వీడిపోయినట్లయింది. 

Published at : 19 Mar 2022 06:05 PM (IST) Tags: Crime News Teacher murder Belgium student who killed teacher psycho

సంబంధిత కథనాలు

Nellore Spa: నెల్లూరులో ఆల్ ఇన్ వన్ మసాజ్, స్పెషల్ సర్వీస్ అంటూ వల! 15 మంది అరెస్ట్

Nellore Spa: నెల్లూరులో ఆల్ ఇన్ వన్ మసాజ్, స్పెషల్ సర్వీస్ అంటూ వల! 15 మంది అరెస్ట్

Cyber Crime : కమీషన్ కోసం కక్కుర్తి పడితే అకౌంట్ ఖాళీ, వాట్సాప్ చాటింగ్ తో చీటింగ్!

Cyber Crime : కమీషన్ కోసం కక్కుర్తి పడితే అకౌంట్ ఖాళీ, వాట్సాప్ చాటింగ్ తో చీటింగ్!

Dial 100 Saves Life : డయల్ 100కు కాల్ చేసి, ఆత్మహత్యాయత్నం చేసిన యువతి- చాకచక్యంగా కాపాడిన కానిస్టేబుల్

Dial 100 Saves Life : డయల్ 100కు కాల్ చేసి, ఆత్మహత్యాయత్నం చేసిన యువతి- చాకచక్యంగా కాపాడిన కానిస్టేబుల్

Karimnagar Accident : హెల్మెట్ ధరించినా దక్కని ప్రాణం, రోడ్డు ప్రమాదంలో మహిళా టీచర్ మృతి

Karimnagar Accident : హెల్మెట్ ధరించినా దక్కని ప్రాణం, రోడ్డు ప్రమాదంలో మహిళా టీచర్ మృతి

TSPSC పేపర్ లీకేజీలో మొత్తం హవాలా మార్గమేనా?  నిందితులు ఆర్థిక లావాదేవీలు ఎలా జరిపారు?

TSPSC పేపర్ లీకేజీలో మొత్తం హవాలా మార్గమేనా?  నిందితులు ఆర్థిక లావాదేవీలు ఎలా జరిపారు?

టాప్ స్టోరీస్

Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ

Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ

AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!

AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!

IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!

IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!

Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి

Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి