అన్వేషించండి

Bapatla Crime News: బాపట్లలో దారుణం - మద్యం మత్తులో వివాహితపై వాలంటీర్ అత్యాచారయత్నం

Bapatla Crime News: మద్యం మత్తులో ఓ వాలంటీర్.. వివాహితపపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు వచ్చి అతడిని అక్కడి నుంచి పంపించి వేశారు. 

Bapatla Crime News: బాపట్ల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఫుల్లుగా మద్యం సేవించిన ఓ వాలంటీర్.. నేరుగా ఓ ఇంటికి వెళ్లాడు. అక్కడ ఒంటరిగా ఉన్న వివాహితపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. నీవంటే నాకిష్టమంటూ బలవంతం చేయబోయాడు. మహిళ అతడిని వద్దని వారిస్తూనే... కాలితో గట్టిగా తన్నింది. దీంతో ఆ వాలంటీర్ కింద పడిపోయాడు. అలాగే మహిళ కేకలు వేయడంతో స్థానికులు పరిగెత్తుకొచ్చారు. దీంతో నిందితుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కానీ ఇంటికి వెళ్లి బంధువులు, స్నేహితులును వెంట బెట్టుకొని వచ్చాడు. ఆమెపై దాడి చేసే ప్రయత్నం చేయగా.. మరోసారి తప్పించుకొని పోలీసులను ఆశ్రయించింది. 

బాపట్ల బాప్టిస్ట్ పాలెంకు చెందిన ఓ వివాహిత అరుగుపై కూర్చొని ఉంది. అదే సమయంలో స్థానిక వాలంటీర్ అయిన గాలిమోటు లోక కుమార్ ఆమె వద్దకు వచ్చాడు. అప్పటికే లోక కుమార్ ఫుల్లుగా మద్యం సేవించి ఉన్నాడు. మద్యం మత్తులో ఉన్న అతడు సదరు మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. నీవంటే నాకిష్టం అంటూ బలవంతం చేయబోయాడు. అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. భయపడిపోయిన మహిళ ప్రతిఘటించింది. లోక కుమార్ ను గట్టిగా కాలితో కేకలు వేసింది. దీంతో స్థానికులు అందరూ పరిగెత్తుకొచ్చారు. భయపడిపోయిన లోక కుమార్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కానీ ఇంటికి వెళ్లిన అతడు బంధువులు, స్నేహితులను వెంటబెట్టుకొని బాధితురాలి ఇంటికి చేరుకున్నాడు. 

ఆమెపై దాడికి ప్రయత్నించాడు. కానీ బాధిత మహిళ అక్కడి నుంచి తప్పించుకొని పోలీసులను ఆశ్రయించింది. మద్యం మత్తులో.. వాలంటీర్ లోక కుమార్ తనపై అత్యాచార యత్నానికి పాల్పడడమే కాకుండా, దాడి చేయబోయడానికి తెలిపింది. కేసు పెట్టింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే లోక కుమార్ పై గతంలో కూడా అనేక ఫిర్యాదులు వచ్చాయని, మహిళలతో అతడు ఎప్పుడూ అసభ్యంగానే ప్రవర్తిస్తాడని తెలుస్తోంది. వాలంటీర్ అయినప్పటికీ.. అతడిని ప్రజలు ఇళ్లకు రానీయడం లేదని స్థానికులు చెబుతున్నారు.  

సత్యసాయి జిల్లాలో విద్యార్థినిపై అత్యాచారయత్నం

శ్రీ సత్య సాయి జిల్లా చిలమత్తూరు మండలం నల్ల రాళ్లపల్లిలో దారుణం చోటు చేసుకుంది. అభం శుభం ఎరుగని ఆరవ తరగతి విద్యార్థినిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డ శ్రీనివాసులు అనే వ్యక్తిపై పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు. నల్ల రాళ్లపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాసులు అనే యువకుడు... అదే గ్రామానికి చెందిన ఆరో తరగతి విద్యార్థినిపై కన్నువేశాడు. ఈ క్రమంలోనే కొంత కాలంగా ఆ చిన్నారితో మాటలు కలుపుతూ వచ్చాడు. ఈరోజు బాలికకు మాయ మాటలు చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. ఆపై అత్యాచారం చేయబోయాడు. అయితే బాలిక గట్టిగా ఏడ్వడంతో సదరు నిందితుడు పారిపోయాడు. దీంతో బాలిక ఏడుస్తూ ఇంటికి తిరిగి వచ్చింది. ఇంట్లోనే ఉన్న తల్లిదండ్రులు ఏమైందని ప్రశ్నించగా... బాలిక అసలు విషయం చెప్పింది. దీంతో వెంటనే తల్లిదండ్రులు స్థానిక చిలమత్తూరు పోలీస్ స్టేషన్ కు వెళ్లి శ్రీనివాస్ పై ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు... నల్ల రాళ్లపల్లి గ్రామానికి చేరుకుని శ్రీనివాసులు కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Minor Girls Assault Case: గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Anantapur Road Accident: ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి
Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Rukmini Vasanth : అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
Embed widget