అన్వేషించండి

Amaravati: అమరావతిలో దొంగలు బీభత్సం, పోలీస్ డిపార్ట్‌మెంట్ భవనంలో చోరీ!

నిన్న గుంటూరు జిల్లాలో డీఎస్పీ ఆఫీసు ఎదురుగా ఉన్న దుకాణాల్లో చోరీ జరిగితే ఇవాళ ఏకంగా నిర్మాణంలో ఉన్న పోలీస్ భవనంలో దొంగతనం జరిగింది. పోలీసుల భవనాల్లోనే దొంగతనం చేస్తూ పోలీసులకే సవాల్ విసురుతున్నారు.

అమరావతి సచివాలయానికి సమీపంలోని నిర్మాణంలో చోరీ జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నత సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేస్తున్న గరుడా హెడ్ క్వార్టర్స్ లో‌ దొంగతనం జరిగింది. అయితే దొంగతనం జరిగిన మాట వాస్తవమే కాని పోలీస్‌ డిపార్ట్మెంట్ కు చెందిన చోట కాదని పోలీసులు ‌చెబుతున్నారు. రాజధాని అమరావతిలో‌ దొంగలు ‌బీభత్సం‌ సృష్టించారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న గరుడా పోలీస్‌ కంట్రోల్ రూంలో చోరీ‌ జరిగిందని దళిత‌ సంఘాల‌ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ‌దొంగ‌తనం జరిగింది వాస్తవమే కానీ విపత్తులు, వాతావరణ శాఖ నిర్మాణ భవనంలో‌ అని పోలీసులు అంటున్నారు. విలువైన ఏసీలు, ఎల్ఈడీ కండక్టర్లు, లైట్లు విలువైన ‌సామాగ్రి పెద్ద మొత్తంలో చోరీకి గురైంది. గతంలో రోడ్లపై ఉన్న మట్టిని సహితం దోచుకువెళ్లారని వార్తలు వచ్చాయి. ఇప్పటికైనా రాజధాని ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ ఆస్తులను పరీక్షించాలని స్థానికులు కోరుకుంటున్నారు.

డీఎస్పీ ఆఫీసు ఎదుటి దుకాణంలో చోరీ

పోలీసులంటే ఓ భద్రత భరోసా. ఇది పోలీసు డిపార్ట్ మెంట్ స్లోగన్ ( AP Police ) .  కానీ సామాన్యులకు మాత్రం పోలీసులను చూస్తే ఓ రకమైన టెర్రర్. తప్పు చేయని వాళ్లకే ఈ టెర్రర్. నిజానికి దొంగతనాలకు అలవాటు పడిపోయిన వాళ్లకు ఈ పోలీసులను అసలు పట్టించుకోరు. పోలీసుల ఇళ్లలోనే దొంగతనాలు జరిగిన ఘటనలు చూశాం. ఇప్పుడు అలాంటిదే ఒకటి గుంటూరు జిల్లా గురజాలలో ( Gurajala ) చోటు చేసుకుంది. గురజాలలో డీఎస్పీ ఆఫీసు ( DSP Office ) ఉన్న ప్రాంతం అంటే ఎవరైనా కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే. హెల్మెట్లు లేకుండా లేకపోతే లైసెన్సులు లేకుండా ఎవరూ అటువైపు కూడా పోరు. 

కానీ అలాంటి చోట చేతివాటం అలవాటయిన దొంగలు మాత్రం అలవోకగా లూటీలు చేసేస్తున్నారు. గురజాల డీఎస్పీ ఆఫీసు ఎదురుగా కొన్ని దుకాణాలు ఉన్నాయి. వాటిలో సెల్ ఫోన్ షాపు (Cell Phone Shop ) ఒకటి. ఆ దుకాణం యజమాని యధావిధిగా వ్యాపారం ముగించుకుని ఇంటికెళ్లాడు. మళ్లీ పొద్దున దుకాణం తెరిచి చూస్తే దుకాణం ఖాళీగా ఉంది. పై నుంచి ఎండ లోపలికి వస్తూ కనిపించింది. ఏమిటా అని తలపైకెత్తి చూస్తే అక్కడ పెద్ద బొక్క ఉంది. తన దుకాణంపై కప్పుకు పెద్ద బొక్క పెట్టి అందులోనుంచి దిగి తన సొత్తు అంతా దోచుకెళ్లాడని రెండు నిమిషాలకే ఆ యజమానికి స్ట్రైక్ అయింది. 

అంతే లబోదిబోమంటూ ఎదురుగా ఉన్న డీఎస్పీ ఆఫీసుకు పరుగెత్తుకెళ్లి కంప్లైంట్ ఇచ్చారు. ఎంతయినా అది పోలీసుల ఇజ్జత్‌కు సంబంధించిన విషయం. తమ కార్యాలయం ఎదుటే  దుకాణానికి కన్నం వేసి మరీ దోచుకెళ్లిపోయాడంటే అది వారికి అవమానమే. ఇంకా ఇందులో ట్విస్టేమిటంటే దొంగతనం జరిగిన రోజు పగటి పాటు డీఐజీ త్రివిక్రమ్, ఎస్పీ విశాల్ గున్నీ గురజాల డీఎస్పీ ఆఫీస్‌ను ఆకస్మిక తనిఖీ చేశారు. రికార్డులు సరిగ్గా ఉన్నాయా.. పోలీసులు భద్రత అందరికీ సక్రమంగా కల్పిస్తున్నారా అనిసమీక్ష చేశారు. సంతృప్తి చెంది వెళ్లారు. కానీ వాళ్ల సమీక్షలో ఏదో మిస్సయిందని చెప్పడానికన్నట్లు దొంగ ఆ రోజు రాత్రే డ్యూటీ ఎక్కాడు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Extramarital Affair: పదో తరగతి ప్రేమ - పెళ్లయ్యాక వివాహేతర బంధం - క్లైమాక్స్ చాలా వయోలెంట్ !
పదో తరగతి ప్రేమ - పెళ్లయ్యాక వివాహేతర బంధం - క్లైమాక్స్ చాలా వయోలెంట్ !
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Hyderabad Crime News: బీటెక్ విద్యార్థిది ప్రీ ప్లాన్ మర్డర్.. మరదలు తనకు దక్కదన్న కోపంతో హత్యకు బావ ప్లాన్
బీటెక్ విద్యార్థిది ప్రీ ప్లాన్ మర్డర్.. మరదలు తనకు దక్కదన్న కోపంతో హత్యకు బావ ప్లాన్
Bandi Bhagirath POCSO Case: బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు.. తక్షణ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు.. తక్షణ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం

వీడియోలు

Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్
Abhishek Sharma: అభిషేక్ శర్మ vs పంజాబ్: ఇది బ్యాటింగ్ కాదు.. తాండవం
Medchal Infant Kidnap: '50 CC కెమెరాలతో గంటల్లో పట్టుకున్న పోలీసులు.

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NEET Paper Leak: NEET UG 2026 పరీక్ష రద్దు చేసిన NTA .. పేపర్ లీకేజీ కేసుపై CBI దర్యాప్తు..
NEET UG 2026 పరీక్ష రద్దు చేసిన NTA .. పేపర్ లీకేజీ కేసుపై CBI దర్యాప్తు..
Vijay Astrologer: విజయ్ కూడా అంతే - ఆస్థాన జ్యోతిష్యుడికి సీఎంవో బాధ్యతలు !
విజయ్ కూడా అంతే - ఆస్థాన జ్యోతిష్యుడికి సీఎంవో బాధ్యతలు !
Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
Ranveer Singh: శివునిగా రణవీర్ సింగ్... Dhurandhar సక్సెస్ తర్వాత పౌరాణిక ఫ్రాంచైజీ?
శివునిగా రణవీర్ సింగ్... Dhurandhar సక్సెస్ తర్వాత పౌరాణిక ఫ్రాంచైజీ?
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Trisha Krishnan: మళ్ళీ డుమ్మా కొట్టిన త్రిష... హైదరాబాద్ ఈవెంట్‌కూ పిలవలేదా?
మళ్ళీ డుమ్మా కొట్టిన త్రిష... హైదరాబాద్ ఈవెంట్‌కూ పిలవలేదా?
Lamborghini నుంచి Fenomeno Roadster లగ్జరీ కారు లాంచ్.. 15 మంది అదృష్టవంతులకే లభ్యం
Lamborghini నుంచి Fenomeno Roadster లగ్జరీ కారు లాంచ్.. 15 మంది అదృష్టవంతులకే లభ్యం
Jagan towards Congress: మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
Embed widget