అన్వేషించండి

Hyderabad Crime News: బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్

హైదరాబాద్‌లోని బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలోని కౌకూర్‌లో ఐదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య కేసును పోలీసులు ఛేదించారు. బిహార్‌కు చెందిన విక్రమ్‌ అనే సెక్యూరిటీ గార్డును పోలీసులు అరెస్టు చేశారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • బొల్లారం బాలిక కిడ్నాప్, హత్య: ప్రధాన నిందితుడు విక్రమ్ అరెస్ట్.
  • ఆడుకుంటున్న బాలికను కిడ్నాప్ చేసి, నీటి సంపులో పడేశాడు.
  • పనిలోంచి తీసివేయడంతో పగబట్టి, బాలికను కిడ్నాప్ చేసి హత్య.

హైదరాబాద్‌: బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలోని కౌకూర్‌లో ఐదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన నిందితుడు, బిహార్‌కు చెందిన సెక్యూరిటీ గార్డ్ విక్రమ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న విక్రమ్‌ బాలికను కిడ్నాప్ చేసి తీసుకెళ్లి, ఆపై హత్య చేసి నీటి సంపులో పడేయడం తెలిసిందే.

పాప హత్యపై కేసు నమోదు చేసిన బొల్లారం పోలీసులు సీసీటీవీ ఫుటేజీ పరిశీంచారు. మరోవైపు సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌, సాంకేతిక ఆధారాల సాయంతో హత్య చేసింది సెక్యూరిటీ గార్డ్ విక్రమ్‌ అని  పోలీసులు గుర్తించారు. విల్లా ఆర్కిడ్‌ గేటెడ్‌ కమ్యూనిటీలో ఆడుకుంటున్న ఐదేళ్ల చిన్నారిని విక్రమ్‌ కిడ్నాప్ చేసి, క్లబ్‌హౌస్‌ దగ్గర ఉన్న సెల్లార్‌లోకి తీసుకెళ్లాడు. కాళ్లు, చేతులు కట్టేసి, ఓ పెద్ద రాయి బాలికకు కట్టి ఆపై నీటి సంపులో పడేశాడు. చిన్నారి చనిపోయిన తరువాత రాత్రి 7.30 గంటల సమయంలో సెల్లార్‌ నుంచి ఒక్కడే బయటకు వచ్చాడు. అనంతరం అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బందితో ఏదో విషయం మాట్లాడి వెళ్లిపోయాడని పోలీసులు తెలిపారు. 

బిహార్ కు చెందిన విక్రమ్‌ తీరు నచ్చకపోవడంతో కొన్ని రోజుల కిందటే అతడ్ని పనిలోంచి తీసివేశారు. దాంతో కక్ష పెంచుకున్న అతడు టార్గెట్ చేసి బాలికను కిడ్నాప్ చేశాడు. పాప తండ్రికి ఫోన్ చేసి 20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. డబ్బులు ఇచ్చేందుకు సైతం తండ్రి ఒప్పుకున్నట్లు ఆడియో వైరల్ అయింది. అయితే డబ్బులు తీసుకుని పాపను ఇవ్వకపోతే ఎలా అంటూ కొన్ని విషయాలు నిందితుడితో ఫోన్లో మాట్లాడాడు. కానీ ప్లాన్ ప్రకారం చేసిన కిడ్నాప్, కానీ ఇది డబ్బుల కోసం చేసిన పని కాకపోవడంతో చిన్నారి హత్య చేసినట్లు తెలుస్తోంది. నేటి మధ్యాహ్నం మల్కాజిగిరి సీపీ సుమతి ప్రెస్‌మీట్‌ పెట్టి ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించనున్నారు. 

పగబట్టి ఐదేళ్ల చిన్నారిని హత్య చేసిన మాజీ వాచ్‌మన్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మిల్టన్ ఫెర్నాండెజ్, డేజి ఇవాంజెలియా దంపతులు 2019 నుంచి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలోని కౌకూరు విల్లా ఆర్కిడ్ గేటెడ్ కమ్యూనిటీలో ఉంటున్నారు. వీరికి బాబు జేడెన్ ఫెర్నాండెజ్, కూతురు మోజెస్ అరేలియా (5) ఉన్నారు. ఈ విల్లాలకి విక్రమ్ అనే యువకుడు గతంలో వాచ్‌మన్‌గా పనిచేశాడు. ఇటీవల విల్లా నిర్వాహకులు సెక్యూరిటీ గార్డును జాబ్ నుంచి తొలగించారు. 

విల్లా అసోసియేషన్ సభ్యులతో పాటు హత్యకు గురైన బాలిక కుటుంబంతోనూ విక్రమ్‌కు తీవ్ర గొడవ జరిగింది. దాంతో కక్ష పెంచుకున్న సెక్యూరిటీ గార్డు శనివారం సాయంత్రం విల్లాల వద్ద బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తుండగా, అరేలియా ఫ్యామిలీ అక్కడికి వెళ్లింది. బాలిక ఇంటి సమీపంలోని క్లబ్‌హౌస్ దగ్గర సైకిల్ తొక్కుతుండగా సాయంత్రం 6:30 సమయంలో విక్రమ్ విల్లాల వద్దకు రాగా, సెక్యూరిటీ సిబ్బంది అతడిని లోపలికి అనుమతించారు. క్లబ్‌హౌస్ వద్ద ఉన్న చిన్నారిని విక్రమ్ సెల్లార్‌లోకి తీసుకెళ్లి, కాళ్లు చేతులు కట్టేసి పెద్ద రాయిని పాప శరీరానికి కట్టి నీటి సంపులో పడేసి హత్య చేశాడు. తరువాత సెక్యూరిటీ సిబ్బందితో మాట్లాడి తనకు ఏమీ తెలియనట్లు నిందితుడు విక్రమ్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

 

Frequently Asked Questions

కౌకూర్‌లో జరిగిన ఘటన ఏమిటి?

బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలోని కౌకూర్‌లో ఐదేళ్ల బాలిక కిడ్నాప్‌కు గురై హత్య చేయబడింది. ప్రధాన నిందితుడు సెక్యూరిటీ గార్డు విక్రమ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

బాలిక హత్య కేసులో ప్రధాన నిందితుడు ఎవరు?

బిహార్‌కు చెందిన సెక్యూరిటీ గార్డు విక్రమ్‌ ఈ కేసులో ప్రధాన నిందితుడు. పోలీసులు సీసీటీవీ ఫుటేజీ, సాంకేతిక ఆధారాలతో అతడిని గుర్తించి అరెస్టు చేశారు.

నిందితుడు బాలికను ఎలా హత్య చేశాడు?

విక్రమ్‌ బాలికను కిడ్నాప్ చేసి, క్లబ్‌హౌస్‌ పక్కన ఉన్న సెల్లార్‌లోకి తీసుకెళ్లాడు. అక్కడ కాళ్లు, చేతులు కట్టి రాయి కట్టి నీటి సంపులో పడేశాడు.

బాలిక హత్యకు గల కారణం ఏమిటి?

విక్రమ్‌ను పనిలోంచి తీసివేయడంతో కక్ష పెంచుకుని ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. డబ్బుల కోసం కాకుండా కక్ష సాధింపు కోసమే చేశాడని పోలీసులు తెలిపారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CBI Investigation Saikrishna Case: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సీబీఐ దూకుడు.. ఆర్ఎంపీతో చికిత్స, లాకప్‌లో పెయింటింగ్‌పై ఆరా!
సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సీబీఐ దూకుడు.. ఆర్ఎంపీతో చికిత్స, లాకప్‌లో పెయింటింగ్‌పై ఆరా!
Alluri Blasting News: అల్లూరి జిల్లాలో జిలెటిన్ స్టిక్స్ పేలి ఐదుగురు దుర్మరణం- హోం మంత్రి అనిత దిగ్భ్రాంతి
అల్లూరి జిల్లాలో జిలెటిన్ స్టిక్స్ పేలి ఐదుగురు దుర్మరణం- హోం మంత్రి అనిత దిగ్భ్రాంతి
Hyderabad Crime News: మహిళల వాష్‌రూమ్‌లో రహస్యంగా ఫోన్, వీడియోలు రికార్డ్.. కవాడిగూడ పవర్ గ్రిడ్‌ ఆఫీసులో కలకలం
మహిళల వాష్‌రూమ్‌లో రహస్యంగా ఫోన్, వీడియోలు రికార్డ్.. కవాడిగూడ పవర్ గ్రిడ్‌ ఆఫీసులో కలకలం
ED Raids: తెలుగు రాష్ట్రాల్లో 15 చోట్ల ఈడీ మెరుపు దాడులు.. ఆన్‌లైన్ బెట్టింగ్, హవాలా గ్యాంగ్‌లపై ఫోకస్
తెలుగు రాష్ట్రాల్లో 15 చోట్ల ఈడీ మెరుపు దాడులు.. ఆన్‌లైన్ బెట్టింగ్, హవాలా గ్యాంగ్‌లపై ఫోకస్
Advertisement

వీడియోలు

Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Two Day Marwar Festival 2026 In Jodhpur Heritage Camel Contingent | రాజస్థాన్‌లో రాజపుత్రుల వారసత్వ వేడుకలు - మీసాల పోటీలు కూడా స్పెషల్
Gambhir's Secret Words to Tilak Varma | న్యూజిలాండ్‌పై భారత్ సంచలన గెలుపు
IND vs NZ 2nd T20 Match Preview | స్టార్ బ్యాటర్‌కు గాయం, తుది జట్టులో కీలక మార్పులు!
Amit Mishra about Virat | కోహ్లీ నన్ను మోసం చేశారు.. అమిత్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Holidays: బాసర ట్రిపుల్ ఐటీకి దసరా సెలవులు పొడిగింపు, విద్యార్థులు ఇంటిదారి.. కారణం ఏంటంటే
బాసర ట్రిపుల్ ఐటీకి దసరా సెలవులు పొడిగింపు, విద్యార్థులు ఇంటిదారి.. కారణం ఏంటంటే
Punganur Municipal Chairman: పెద్దిరెడ్డి కోటలో వైసీపీకి బిగ్ షాక్.. పుంగునూరు మున్సిపల్ పీఠం దక్కించుకున్న కూటమి
పెద్దిరెడ్డి కోటలో వైసీపీకి బిగ్ షాక్.. పుంగునూరు మున్సిపల్ పీఠం దక్కించుకున్న కూటమి
Hyderabad RTC Pass: హైదరాబాద్ ప్రజలకు ఆర్టీసీ శుభవార్త.. సరికొత్తగా వీక్లీ పాస్- ధర, పూర్తి వివరాలు
హైదరాబాద్ ప్రజలకు ఆర్టీసీ శుభవార్త.. సరికొత్తగా వీక్లీ పాస్- ధర, పూర్తి వివరాలు
Bigg Boss Season 10 Today October 25th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: షాలిని, దక్షి ఎలిమినేట్! ఒంటరైన రోహిత్! త్రిగుణ్‌కి జైలు శిక్ష!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: షాలిని, దక్షి ఎలిమినేట్! ఒంటరైన రోహిత్! త్రిగుణ్‌కి జైలు శిక్ష!
‌‌UPI Wrong Transfer: యూపీఐ యాప్‌లో పొరపాటున వేరే వాళ్లకు డబ్బులు పంపిస్తే?.. ఈ సింపుల్ చిట్కాలతో మీ డబ్బు వెనక్కి!
యూపీఐ యాప్‌లో పొరపాటున వేరే వాళ్లకు డబ్బులు పంపిస్తే?.. ఈ సింపుల్ చిట్కాలతో మీ డబ్బు వెనక్కి!
Jailer 2: ఇదీ రజనీకాంత్ రేంజ్... 'జైలర్ 2'లో హుకుమ్ పాటకు సింగపూర్ కస్టమ్స్ ఆఫీసర్ రీల్
ఇదీ రజనీకాంత్ రేంజ్... 'జైలర్ 2'లో హుకుమ్ పాటకు సింగపూర్ కస్టమ్స్ ఆఫీసర్ రీల్
JEE Main 2027 Registration: జేఈఈ మెయిన్ జనవరి సెషన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. ముఖ్య తేదీలు, దరఖాస్తు విధానం ఇలా!
జేఈఈ మెయిన్ జనవరి సెషన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. ముఖ్య తేదీలు, దరఖాస్తు విధానం ఇలా!
CBFC Leaks: ఓడియమ్మా... ఐదొందల సినిమా స్క్రిప్ట్స్ లీక్ - రిలీజ్ కాని సినిమాలు కూడా!
ఓడియమ్మా... ఐదొందల సినిమా స్క్రిప్ట్స్ లీక్ - రిలీజ్ కాని సినిమాలు కూడా!
Embed widget