Viral News: నాలుగేళ్ల చిన్నారిపై 11 ఏళ్ల బాలుడు అత్యాచారం, ఒంటరిగా ఉన్న సమయం చూసి చాక్లెట్ ఆశ చూపించి
Uttar Pradesh: యూపీలోని సహరన్‌పూర్‌లో ఇంట్లో ఒంటరిగా ఉన్న నాలుగేళ్ల చిన్నారిపై 11 ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు జువైనల్ హోమ్‌కి తరలించారు.
![Viral News: నాలుగేళ్ల చిన్నారిపై 11 ఏళ్ల బాలుడు అత్యాచారం, ఒంటరిగా ఉన్న సమయం చూసి చాక్లెట్ ఆశ చూపించి 11 year old boy molested 4 year old girl in up when she was alone at her house Viral News: నాలుగేళ్ల చిన్నారిపై 11 ఏళ్ల బాలుడు అత్యాచారం, ఒంటరిగా ఉన్న సమయం చూసి చాక్లెట్ ఆశ చూపించి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/17/acef398e9eb9cacb30048ea6ae563cf91723896094341517_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Girl Molested: కోల్‌కత్తా ఘటనపై దేశమంతా భగ్గుమంటుండగానే ఎక్కడో ఓ మూల అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని సహరన్‌పూర్‌లో ఓ నాలుగేళ్ల చిన్నారిపై 11 ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో లోపలికి వెళ్లి అత్యాచారం చేశాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆ బాలుడిని అరెస్ట్ చేసి జువైనల్ హోమ్‌కి తరలించారు. బాధితురాలి ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై బాలిక కుటుంబ సభ్యులు పోలీసులు ఫిర్యాదు చేశారు. వైద్య పరీక్షలు చేశాక అత్యాచారం జరిగినట్టు నిర్ధరణ అయింది. అత్యాచారం కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడుని అదుపులోకి తీసుకున్నారు. పక్కింట్లో ఉండే బాలుడే ఈ పని చేసినట్టు వెల్లడించారు. కోర్టులో ప్రవేశపెట్టి ఆ తరవాత జువైనల్ హోమ్‌కి పంపించారు.
చాక్లెట్స్ ఇస్తానని చెప్పి ఆ బాలికని మాయ మాటలతో మభ్యపెట్టాడు. ఆ తరవాత ఓ గదిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. కాసేపటికి ఆ బాలిక స్పృహ కోల్పోయింది. ఆ సమయంలో ఇంట్లో ఒక్కతే ఉంది. తల్లిదండ్రులు కూతురుని ఆ స్థితిలో చూసి భయపడిపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపడుతున్నారు. బిహార్‌లో ముజఫర్‌పూర్‌లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. పెళ్లికి ఒప్పుకోలేదన్న కారణంగా 14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రైవేట్ పార్ట్స్‌ని కట్ చేశారు. రాత్రి ఇంటికి వచ్చి దౌర్జన్యం చేసి బాలికని కిడ్నాప్ చేశారు. ఆ తరవాత ఈ దారుణానికి పాల్పడినట్ట విచారణలో తేలింది. ఫోరెన్సిక్ టీమ్ ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించింది. ఆగస్టు 6వ తేదీన ఈ ఘటన జరిగింది. ఇప్పటికే ఓ నిందితుడిని అరెస్ట్ చేశారు.
Also Read: Kolkata Doctor Case: దేశవ్యాప్తంగా వైద్య సేవలు బంద్, కోల్‌కత్తా ఘటనపై లక్షలాది మంది డాక్టర్ల నిరసన
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)