పొరపాటు లావాదేవీ జరిగిన 24-48 గంటలలోపు మీ బ్యాంకుకు తెలియజేయాలి. బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి లావాదేవీ స్క్రీన్‌షాట్‌తో దరఖాస్తును మేనేజర్‌కు సమర్పించాలి.
UPI Wrong Transfer: యూపీఐ యాప్‌లో పొరపాటున వేరే వాళ్లకు డబ్బులు పంపిస్తే?.. ఈ సింపుల్ చిట్కాలతో మీ డబ్బు వెనక్కి!
UPI Wrong Transfer: యూపీఐ యాప్‌లో పొరపాటున వేరొక నెంబర్‌కు అమౌంట్ ట్రాన్స్‌ఫర్ చేస్తే సులభంగా తిరిగి పొందవచ్చు. అందుకు ఏం చేయాలో తెలుసుకుందాం.

- బ్యాంకు స్పందించకుంటే, RBI అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేయండి.
UPI Wrong Transfer: ఈ రోజుల్లో టీ స్టాల్‌లో పది రూపాయలైనా లేదా షాపింగ్ మాల్‌లో వేల రూపాయలైనా, చాలా మంది నగదుకు బదులుగా యూపీఐతోనే స్కాన్ చేసి పే చేస్తున్నారు. ఇది కేవలం కొన్ని సెకన్లలోనే మనీ వాళ్ల అకౌంట్ కు వెళ్తుంది. కానీ కొన్నిసార్లు తొందరపాటులో నెంబర్ టైప్ చేయడంలో పొరపాటున, వేరొకరి ఖాతాలోకి డబ్బులు కొట్టేస్తుంటాం. డబ్బు వేరొకరికి వెళ్తే వెంటనే చాలా మంది ఆందోళన చెందుతారు. అయితే, కంగారుపడకుండా సరైన చర్యలు తీసుకుంటే మీ డబ్బును పూర్తిగా తిరిగి పొందవచ్చు. దీనికోసం రిజర్వ్ బ్యాంక్, NPCI ఒక ఈజీ ప్రక్రియను ఏర్పాటు చేశాయి.
ముందుగా చేయవలసిన పనులు
మోసపూరిత లేదా పొరపాటు లావాదేవీ జరిగిన వెంటనే లావాదేవీ స్క్రీన్‌షాట్‌ను తీసుకోవాలి. అందులో యూటీఆర్ నెంబర్, తేదీ, టైం స్పష్టంగా కనిపించాలి. డబ్బు పంపిన నెంబర్‌కు కాల్ చేసి జరిగిన పొరపాటును ప్రశాంతంగా వివరించాలి. చాలా సందర్భాలలో అవతలి వ్యక్తి లావాదేవీలను చెక్ చేసి మీ డబ్బును వెంటనే తిరిగి పంపిస్తారు. డబ్బు తిరిగి పొందే సమయంలో అవతలి వ్యక్తి పంపించే ఏ తెలియని లింక్‌పైనా క్లిక్ చేయకూడదు. మీ UPI పిన్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంటర్ చేయకూడదు.
పేమెంట్ యాప్‌లో ఫిర్యాదు
ఒకవేళ ఆ వ్యక్తి ఫోన్ ఎత్తకపోయినా లేదా డబ్బు తిరిగి ఇవ్వడానికి నిరాకరించినా, ఆలస్యం చేయకుండా గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం యాప్‌లలోని హెల్ప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. అక్కడ తప్పుగా జరిగిన లావాదేవీని ఎంచుకుని, "ఈ చెల్లింపుతో సమస్య ఉంది" అనే దానిపై క్లిక్ చేసి, తప్పు ఖాతా బదిలీ గురించి ఫిర్యాదు చేయాలి. ఇది యాప్ వాళ్లు చర్యలు తీసుకోవడానికి సహాయపడుతుంది.
NPCI పోర్టల్, టోల్-ఫ్రీ నెంబర్లో ఫిర్యాదు
పేమెంట్ యాప్‌లో సమస్యను రిపోర్ట్ చేసిన తర్వాత, వెంటనే NPCIకి ఫిర్యాదు చేయాలి.
మీ ఫోన్ లేదా ల్యాప్‌టాప్ బ్రౌజర్‌లో npci.org.in వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి. అందులో యూపీఐ పార్టులో వివాద పరిష్కార యంత్రాంగం కోసం ట్యాబ్ ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే ఫిర్యాదు ఫామ్ ఓపెన్ అవుతుంది. 'ట్రాన్సాక్షన్' విభాగంలో లావాదేవీని ఎంచుకుని, 'ఇష్యూ' కింద 'తప్పుగా మరొక ఖాతాకు బదిలీ చేశాం' అనేదాన్ని ఎంచుకోవాలి. లావాదేవీ ID, బ్యాంకు పేరు, అమౌంట్, తేదీ, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేసి, బ్యాంక్ స్టేట్‌మెంట్ స్క్రీన్‌షాట్‌ను అప్‌లోడ్ చేసి ఫామ్‌ను సమర్పించాలి. ప్రత్యామ్నాయంగా 1800-120-1740 అనే టోల్-ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి కూడా వెంటనే ఫిర్యాదు చేయవచ్చు. ఎంత త్వరగా ఫిర్యాదు చేస్తే డబ్బు ఫ్రీజ్ అయ్యే అవకాశం అంత ఎక్కువగా ఉంటుంది.
48 గంటలలోపు బ్యాంకులో ఫిర్యాదు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్గదర్శకాల ప్రకారం, డిజిటల్ చెల్లింపులో పొరపాటు జరిగితే 24 నుండి 48 గంటలలోపు తమ బ్యాంకుకు తెలియజేయాలి. ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసిన తర్వాత, మీ హోమ్ బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి లావాదేవీ స్క్రీన్‌షాట్‌తో పాటు ఒక లిఖితపూర్వక దరఖాస్తును మేనేజర్‌కు సబ్మిట్ చేయాలి. బ్యాంకు వెంటనే డబ్బు బదిలీ అయిన బ్యాంకును సంప్రదించి, ఖాతాదారునితో మాట్లాడి అమౌంట్ ను తాత్కాలికంగా నిలిపివేసి మీ ఖాతాలోకి జమ చేస్తుంది. అవసరమైతే చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవచ్చు.
Also Read: ప్లాన్ చేసిన, అత్యవసర ఖర్చుల నిర్వహణలో మీకు పర్సనల్ లోన్ ఎలా సహాయపడుతుంది
ఆర్‌బీఐ అంబుడ్స్‌మన్ సహాయం
ఫిర్యాదు చేసిన 30 రోజులలోపు కూడా మీ బ్యాంకు ఈ విషయంలో ఎటువంటి చర్య తీసుకోకపోతే, అప్పుడు మీరు ఆర్‌బీఐ బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ పోర్టల్ cms.rbi.org.in లో నేరుగా బ్యాంకుపై మీ ఫిర్యాదును నమోదు చేసుకోవచ్చు.
Also Read: 1.39 కోట్ల బిడ్లు, ఏకంగా రూ. 7.4 లక్షల కోట్ల డిమాండ్‌తో Jio Platforms IPO సరికొత్త రికార్డ్
Frequently Asked Questions
పొరపాటు జరిగినప్పుడు బ్యాంకుకు ఎప్పుడు, ఎలా ఫిర్యాదు చేయాలి?
ట్రెండింగ్ వార్తలు






















