నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) యూపీఐ మర్చంట్ లావాదేవీలపై MDR అమలును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయం వారి అధికారిక సోషల్ మీడియా ద్వారా ధృవీకరించబడింది.
UPI Charges: దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
UPI Charges: దీపావళి వరకు ఎండీఆర్ ఛార్జీల విధింపును వాయిదా వేస్తున్నట్లు ఎన్పీసీఐ ప్రకటించింది. పండుగ సీజన్ లో వ్యాపారులకు బిగ్ రిలీఫ్ దక్కింది.

- అమలు తేదీ, ఛార్జీల రద్దుపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
UPI Charges: డిజిటల్ చెల్లింపులు సామాన్యులు, ముఖ్యంగా వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. యూపీఐ పేమెంట్స్ పై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) రిలీఫ్ ఇచ్చింది. యూపీఐ మర్చంట్ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) అమలును దీపావళి వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. వాస్తవానికి ఈ రూల్ అక్టోబర్ 15న అమల్లోకి రావాల్సి ఉంది.
పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని
వ్యాపారుల నుంచి వస్తున్న విజ్ఞప్తులు, పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్‌పీసీఐ తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' ద్వారా ఈ విషయాన్ని ధృవీకరించింది. దీపావళి వరకు ఈ ఛార్జీల అమలు ఉండదని స్పష్టం చేయడంతో వ్యాపార వర్గాలకు భారీ ఊరట లభించింది.
రూ. 2,000 పైబడిన లావాదేవీలపైనే
రూ.2,000 కంటే ఎక్కువ విలువైన వ్యాపార లావాదేవీలపై 0.4 శాతం మేర MDR ఛార్జ్ విధించే అవకాశం ఉంది. కస్టమర్ షాపులో రూ.2,000 కంటే ఎక్కువ విలువైన వస్తువులు కొనుగోలు చేసి యూపీఐ ద్వారా చెల్లింపు చేస్తే, ఆ ఛార్జీని కస్టమర్ భరించాల్సిన అవసరం లేదు. ఈ ఛార్జీలను పూర్తిగా వ్యాపారులు భరించాల్సి ఉంటుంది. ఉదాహరణకు రూ.4,000 కొనుగోలు చేసిన కస్టమర్ కేవలం రూ. 4,000 మాత్రమే చెల్లిస్తారు.
కొన్ని రంగాలపై ప్రత్యేక రుసుము
టెలికాం, ఇన్సూరెన్స్, రైల్వేలు, పెట్రోల్, డీజిల్ వంటి కొన్ని ప్రత్యేక కేటగిరీలలో రూ. 2,000 దాటిన యూపీఐ చెల్లింపులపై రూ. 5 ఫ్లాట్ ఎండీఆర్ విధించాలనే ప్రతిపాదన కూడా ఉంది. అయితే ఈ నిబంధన అమలైనప్పటికీ, ఈ రుసుమును కూడా కస్టమర్ల నుంచి వసూలు చేయడానికి వీలుండదు. వ్యాపార వర్గాలే దీనిని భరించాల్సి ఉంటుంది.
Also Read: పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా? టాప్ బ్యాంకుల వడ్డీ రేట్లు, కీ ఫ్యాక్టర్స్ మీ కోసం!
విధివిధానాలు
ప్రస్తుతానికి అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రావాల్సిన MDR అమలును వాయిదా వేసినప్పటికీ, దీనికి సంబంధించిన కొత్త తేదీని ప్రభుత్వం లేదా ఎన్‌పీసీఐ త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. ఈ ఛార్జీలను పూర్తిగా రద్దు చేస్తారా లేక జనవరి 2027 నుంచి అమలు చేస్తారా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతానికి మాత్రం పండుగ సీజన్ ముగిసే వరకు వ్యాపారులకు ఎటువంటి అదనపు భారం లేదు.
Also Read: గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా ఏపీ - న్యూఢిల్లీ సీఐఐ సదస్సులో సీఎం చంద్రబాబు ప్రకటన!
Frequently Asked Questions
యూపీఐ ఛార్జీల వాయిదా నిర్ణయాన్ని ఏ సంస్థ ప్రకటించింది?
ట్రెండింగ్ వార్తలు






















