అన్వేషించండి

UPI Subsidy: MDR అమలు చేసినా UPIకి సబ్సిడీ.. కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రణాళిక

UPI Subsidy: యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ అమల్లోకి వస్తున్నప్పటికీ.. సబ్సిడీలు కొనసాగిస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇందుకోసం బ్యాంకులతో కలిసి ఉమ్మడి ప్రణాళిక సిద్ధం చేస్తుంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • యూపీఐ వ్యవస్థ నిర్వహణకు ఏటా రూ.20,000 కోట్లు వ్యయం అవుతుంది.

UPI Subsidy: యూపీఐ (UPI) డిజిటల్ పేమెంట్స్ దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయి. చిన్న వ్యాపారుల నుంచి పెద్ద షాపింగ్ మాల్స్ వరకు ప్రతి ఒక్కరూ ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్‌పైనే ఆధారపడుతున్నారు. అయితే, యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) అమలులోకి రానుండడంతో వినియోగదారుల్లో పలు సందేహాలు తలెత్తుతున్నాయి. యూపీఐ ఫ్రీ ట్రాన్‌జాక్షన్స్ నిలిచిపోతాయా? సబ్సిడీలు ఏమవుతాయి? వంటి ప్రశ్నలకు ప్రభుత్వం తాజాగా స్పష్టతనిచ్చింది. ఎండీఆర్ అమల్లోకి వచ్చినప్పటికీ యూపీఐ సబ్సిడీని పూర్తిగా తొలగించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని, దీనికోసం ఒక కొత్త ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించింది.

అక్టోబర్ 15 నుంచి కొత్త రూల్స్  

అక్టోబర్ 15, 2026 నుంచి రూ. 2,000 పైబడిన వ్యాపార లావాదేవీలపై 0.4% MDR వర్తించే అవకాశం ఉంది. అయితే, ఈ భారాన్ని సామాన్య ప్రజలపై మోపబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. పర్సన్ టు పర్సన్ యూపీఐ లావాదేవీలకు ఎప్పటిలాగే పూర్తిగా ఉచితమని తెలిపింది. సామాన్యులు లేదా రోజువారీ వినియోగదారులు ఎలాంటి అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది.

సబ్సిడీలపై ప్రణాళికేంటి?

MDR అమలులోకి వచ్చినప్పటికీ, డిజిటల్ పేమెంట్స్ మౌలిక వసతుల కల్పన, నిర్వహణ,  పర్యవేక్షణ ఖర్చులను ఆ ఆదాయంతో మాత్రమే పూర్తిగా భరించడం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో, ప్రభుత్వం, బ్యాంకులు జాయింట్  సబ్సిడీ విధానాన్ని అమలు చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ తగిన నిధులను కేటాయించడం ద్వారా వ్యవస్థను బలోపేతం చేయాలని భావిస్తోంది. డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ దీర్ఘకాలిక మనుగడ కోసం ఎండీఆర్, ప్రభుత్వ సబ్సిడీ రెండింటినీ సమన్వయం చేస్తూ ఒక కొత్త వ్యవస్థను తీసుకురానున్నారు.
Also Read: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ తేదీలు ఖరారు.. అక్టోబర్ 8 నుంచి సేల్ స్టార్ట్

రూ. 2,000 వరకు లావాదేవీలు 

వ్యాపారులకు చేసే రూ. 2,000 లోపు చెల్లింపులపై ఎలాంటి MDR వర్తించదు. నిత్యావసరాలు, కూరగాయలు, కిరాణా సామాగ్రి, క్యాబ్ ఛార్జీలు వంటి చిన్న కొనుగోళ్లపై ఎలాంటి కొత్త ఛార్జీలు ఉండవు. షాపుల కస్టమర్ల నుంచి ఎండీఆర్ పేరుతో ఎటువంటి అదనపు వసూళ్లు చేయడానికి వీలులేదు. ప్రభుత్వ నిబంధనల మేరకు వినియోగదారుల నుంచి నేరుగా ఈ ఫీజు వసూలు చేయరు.

Also Read: పర్సనల్ లోన్ అర్హత, వడ్డీ రేట్లు, ఈఎంఐ, డాక్యుమెంట్స్, రీపేమెంట్ పూర్తి వివరాలు

యూపీఐ వ్యయం ఎంత?

దేశంలో యూపీఐ నిర్వహణలో బ్యాంకింగ్ మౌలిక సదుపాయాలు, సెక్యూరిటీ, టెక్నాలజీ అప్‌గ్రేడేషన్ వంటి వాటిపై భారీ ఖర్చు అవుతోంది. ప్రభుత్వ అంచనాల మేరకు ప్రస్తుత యూపీఐ వ్యవస్థను సజావుగా నడపడానికి ఏడాదికి సుమారు రూ.20,000 కోట్లు ఖర్చు అవుతుంది. అందుకే, డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ నిరంతరం కొనసాగేందుకు, బ్యాంకులు ఫిన్‌టెక్ సంస్థలకు తగిన మద్దతు ఇస్తూ సబ్సిడీలను కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Also Read: వ్యాపారులు యూపీఐ పేమెంట్స్ నిరాకరించవచ్చా?.. కొత్త MDR రూల్స్ ఏం చెబుతున్నాయి?

Frequently Asked Questions

కొత్త ఎండీఆర్ నిబంధనలు ఎప్పటి నుండి వర్తిస్తాయి, ఏ లావాదేవీలపై?

అక్టోబర్ 15, 2026 నుండి రూ. 2,000 పైబడిన వ్యాపార లావాదేవీలపై 0.4% ఎండీఆర్ వర్తించే అవకాశం ఉంది. సాధారణ వ్యక్తుల మధ్య లావాదేవీలకు ఇది వర్తించదు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

జియో జాక్‌పాట్..మార్కెట్‌లోకి వచ్చిన మొదటిరోజే దేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా అవతరణ.. షేర్ ఎంత పెరిగిందంటే..
జియో జాక్‌పాట్..మార్కెట్‌లోకి వచ్చిన మొదటిరోజే దేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా అవతరణ.. షేర్ ఎంత పెరిగిందంటే..
DA Hike For Govt Employees: దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
 Jio Maraket Listing: జియో జంబో లిస్టింగ్ రేపే.. రూ.10.3 లక్షల కోట్ల విలువతో స్టాక్ మార్కెట్‌లోకి ఎంట్రీ.. మార్కెట్ లో హుషారు
 జియో జంబో లిస్టింగ్ రేపే.. రూ.10.3 లక్షల కోట్ల విలువతో స్టాక్ మార్కెట్‌లోకి ఎంట్రీ.. మార్కెట్ లో హుషారు
నవంబర్‌లో బంగారం, స్టాక్ మార్కెట్: జ్యోతిష్య అంచనాలతో పెట్టుబడి వ్యూహం!
నవంబర్‌లో బంగారం, స్టాక్ మార్కెట్: జ్యోతిష్య అంచనాలతో పెట్టుబడి వ్యూహం!
Advertisement

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Formula E Car Race Case: ఫార్ములా ఈ రేసు కేసు.. విచారణకు హాజరు కాని కేటీఆర్- డిసెంబర్ 4కు వాయిదా
ఫార్ములా ఈ రేసు కేసు.. విచారణకు హాజరు కాని కేటీఆర్- డిసెంబర్ 4కు వాయిదా
Hyderabad Water Crisis: హైదరాబాద్‌లో 9 నియోజకవర్గాలకు తాగునీటి ముప్పు.. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్‌లో 9 నియోజకవర్గాలకు తాగునీటి ముప్పు.. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం
FASTag Pass: ఫాస్టాగ్‌ యాన్యువల్‌ పాస్‌ vs లోకల్‌ పాస్‌ vs రెగ్యులర్‌ రీఛార్జ్‌.. మీకు ఏది బెస్ట్?
హైవేపై మీ ప్రయాణానికి ఏ FASTag పాస్ ప్రయోజనం? మీ ఖర్చు తగ్గించే ఆప్షన్ ఇదే!
AP Cabinet Decisions : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
Ram Charan : రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' స్టోరీ అది కాదు - అసలు స్టోరీ ఏంటో చెప్పిన కార్తీక్ సుబ్బరాజు
రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' స్టోరీ అది కాదు - అసలు స్టోరీ ఏంటో చెప్పిన కార్తీక్ సుబ్బరాజు
Harish Rao On Mallanna Sagar: మల్లన్న సాగర్ కట్ట దగ్గరలో అక్రమ బ్లాస్టింగ్‌లు.. కూల్చి వేసేందుకు కుట్ర జరుగుతోందా? - హరీష్ రావు
మల్లన్న సాగర్ కట్ట దగ్గరలో అక్రమ బ్లాస్టింగ్‌లు.. కూల్చి వేసేందుకు కుట్ర జరుగుతోందా? - హరీష్ రావు
Traffic E-Challans: ఈ-చలాన్లతో ఇబ్బంది పడుతున్నారా? నేషనల్‌ లోక్‌ అదాలత్‌లో పరిష్కరించుకోవచ్చు.. ఇలా చేయండి
ట్రాఫిక్ చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయా? లోక్‌ అదాలత్‌ ద్వారా జరిమానా తగ్గించుకునే ఛాన్స్‌!
AP El Nino Drought Ground Reality: ఎల్‌నినో పొలిటికల్ గేమ్ - ఆంధ్రాలో కరువు లేదంటున్న కేటీఆర్ - రేవంత్‌ను ఇరికించడానికేనా?
ఎల్‌నినో పొలిటికల్ గేమ్ - ఆంధ్రాలో కరువు లేదంటున్న కేటీఆర్ - రేవంత్‌ను ఇరికించడానికేనా?
Embed widget