వ్యక్తిగత ఋణం మీ పొదుపులను ఉపయోగించకుండా ప్రణాళిక చేయబడిన కొనుగోళ్లు మరియు ఊహించని ఖర్చులను నిర్వహించడంలో సహాయపడుతుంది. వైద్యం, విద్య, పెళ్లి, ప్రయాణం లేదా ఇంటి పునరుద్ధరణ వంటి వాటికి దీనిని ఉపయోగించవచ్చు.
Personal Loan: ప్లాన్ చేసిన, అత్యవసర ఖర్చుల నిర్వహణలో మీకు పర్సనల్ లోన్ ఎలా సహాయపడుతుంది
Why Personal Loan | మీరు ప్లాన్ చేసుకున్న ఖర్చులను, అత్యవసర ఆర్ధిక అవసరాలను తీర్చుకోవటంలో పర్సనల్ లోన్ మీకు ఎలా సహాయం చేస్తుందో అర్థం చేసుకోండి. మీ బడ్జెట్ ఆధారంగా ఈఎంఐలను ప్లాన్ చేసుకోవాలి.

- వ్యక్తిగత రుణం ప్రణాళికాబద్ధ ఖర్చులకు, అత్యవసరాలకు కొల్లటరల్ లేకుండా సహాయపడుతుంది.
- వైద్యం, విద్య, పెళ్లి, ఇంటి మరమ్మతులకు రుణం ఉపయోగపడుతుంది.
- EMI కాలిక్యులేటర్‌తో ప్రణాళిక చేయండి, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.
మీరు ప్రణాళిక చేయబడిన ఖర్చులను, అత్యవసర ఆర్ధిక అవసరాలను నెరవేర్చుకొనుటలో ఒక పర్సనల్ లోన్ మీకు ఎలా సహాయం చేస్తుందనేది అర్థం చేసుకోండి, దాని ప్రయోజనాలు ఏమిటి అని తెలుసుకోండి మరియు మీ బడ్జెట్ ఆధారంగా ఈఎంఐలను ప్రణాళిక చేసుకోండి.
మీ పొదుపు మొత్తాలను ఒకేసారి ఉపయోగించకుండా ప్రణాళిక చేయబడిన కొనుగోళ్ళు మరియు ఊహించని ఖర్చులను నిర్వహించడములో ఒక పర్సనల్ లోన్ మీకు సహాయపడగలదు. వైద్య చికిత్స, విద్య, ప్రయాణము, పెళ్ళి ఖర్చులు, ఋణ ఏకీకరణ లేదా ఇంటి పునరుద్ధరణ వంటి అర్హమైన అవసరాల కొరకు మీరు బజాజ్ ఫైనాన్స్ పర్సనల్ లోన్ ను ఉపయోగించవచ్చు. మీరు ఋణము తీసుకునే ముందు, మీ ఆర్ధిక అవసరాలను అంచనా వేయండి, తిరిగిచెల్లింపు ఎంపికలను పోల్చి చూడండి మరియు నెలవారి వాయిదా మీ బడ్జెట్ కు సరిపోతుందా అని పరీక్షించండి.
పర్సనల్ లోన్ తో మీరు ఏయే ఖర్చులను నిర్వహించుకోవచ్చు?
ఒక పర్సనల్ లోన్ మీరు అంగీకరించిన కాలవ్యవధిలో నెలవారి వాయిదాల ద్వారా తిరిగిచెల్లించే నిధులను అందిస్తుంది. ఇది అసురక్షితమైనది కాబట్టి, కొల్లాటరల్ గా మీరు ఆస్తిని లేదా ఇతర ఆస్తులను తాకట్టు పెట్టవలసిన పనిలేదు. ఋణదాతల నియమాలకు లోబడి దీనిని మీరు ప్రణాళిక చేయబడిన ఖర్చులు లేదా అత్యవసర ఆర్ధిక అవసరాల కొరకు పరిగణించవచ్చు.
1. వైద్య అత్యవసర పరిస్థితులు
అనుకోని వైద్య బిల్లులు మీ పొదుపు మొత్తాలపై ఒత్తిడి తీసుకొనిరావచ్చు. ఒక పర్సనల్ లోన్ మీకు అదనపు నిధులు అవసరమైనప్పుడు, ఆసుపత్రి బిల్లులు, రోగనిర్ధారణ పరీక్షలు లేదా ఇతర చికిత్స వ్యయాల వంటి అర్హమైన ఖర్చులను నెరవేర్చుకొనుటలో సహాయపడుతుంది.
ప్రో టిప్: ఋణము తీసుకునేముందు మీ ఆరోగ్య బీమా కవరేజ్ మరియు అందుబాటులో ఉన్న పొదుపు మొత్తాన్ని సమీక్షించండి. బీమా చెల్లింపులను లెక్కలోకి తీసుకున్న తరువాత మీకు కావలసిన మొత్తాన్ని లెక్కించండి.
2. విద్యా సంబంధ ఖర్చులు
వృత్తిపరమైన కోర్సులు, నైపుణ్యాభివృద్ధి, పరీక్ష రుసుము లేదా ఇతర విద్యా-సంబంధ ఖర్చుల కోసం మీకు నిధులు అవసరం కావచ్చు. మీ పొదుపు మొత్తం సరిపోకపోతే, ఒక పర్సనల్ లోన్ అర్హమైన ఖర్చులను కవర్ చేయుటకు సహాయపడుతుంది.
ప్రో టిప్: కోర్స్ ఫీజు, స్టడీ మెటీరియల్స్ మరియు ప్రయాణాన్ని కవర్ చేస్తూ ఒక బడ్జెట్ ను తయారు చేయండి. తక్కువపడిన మొత్తాన్ని మాత్రమే ఋణముగా తీసుకోండి.
3. ప్రయాణము, పెళ్ళి ఖర్చులు
కుటుంబ విహార యాత్ర లేదా పెళ్ళి వంటి ప్రణాళిక చేయబడిన ఖర్చులలో అనేక చెల్లింపులు ఉండవచ్చు. వసతి, రవాణా, వెన్యూ బుకింగ్స్ మరియు ఇతర ఏర్పాట్ల సహా అర్హమైన ఖర్చులన్నిటిని నిర్వహించుటలో ఒక పర్సనల్ లోన్ మీకు సహాయపడగలదు.
ప్రో టిప్: బుకింగ్స్ చేసే ముందు ఖర్చు పరిమితిని ఏర్పాటు చేసుకోండి. మీ తిరిగిచెల్లింపు భారాన్ని పెంచే ఐచ్ఛిక కొనుగోళ్ళ కొరకు ఋణము తీసుకోకండి.
4. ఇంటి పునరుద్ధరణ
మరమ్మత్తులు, పెయింటింగ్, ప్లంబింగ్ మరియు ఫర్నీచర్ ఆధునీకరణలకు ఖర్చు గణనీయంగా ఉంటుంది. ఒక పర్సనల్ లోన్ తాత్కాలికంగా నిధుల కొరత కారణంగా అవసరమైన ఈ పనులను ఆలక్ష్యం చేయకుండా ఈ ప్రాజెక్ట్స్ కొరకు నిధులను సమకూర్చగలదు.
ప్రో టిప్: ఎంత ఋణము తీసుకోవాలి అని నిర్ణయించుకునే ముందు కూలీలు మరియు మెటీరియల్స్ కొరకు అంచనాలు తీసుకోండి. అనుకోని మరమ్మత్తు ఖర్చుల కొరకు విడిగా కొంత మొత్తాన్ని ఉంచండి.
ఒక పర్సనల్ లోన్ ఎందుకు సౌకర్యవంతమైన ఐచ్ఛికము అవుతుంది?
ఆస్తులు తాకట్టు పెట్టకుండా ఆర్ధిక అవసరాలను పూర్తి చేసుకొనుటకు ఒక పర్సనల్ లోన్ ఒక క్రమమైన విధానాన్ని అందిస్తుంది. అర్హత, అంచనా మరియు వర్తించే నియమాలకు లోబడి, బజాజ్ ఫైనాన్స్ పర్సనల్ లోన్ ఈ క్రింది ఫీచర్స్ ను అందిస్తుంది:
ఋణ మొత్తము: రూ. 40,000 నుండి రూ. 55 లక్షల వరకు.
తిరిగి చెల్లింపు కాలవ్యవధి: 12 నెలల నుండి108 నెలల వరకు.
వడ్డీ రేటు: ఏడాదికి 10% నుండి 30.5% వరకు.
తాకట్టు అవసరం లేదు: మీరు ఏదైనా ఆస్తిని తాకట్టు పెట్టవలసిన పనిలేదు.
ఆన్లైన్ దరఖాస్తు: ఒక పర్సనల్ లోన్ కోసం మీరు ఆన్లైన్ లో దరఖాస్తు చేయవచ్చు.
డాక్యుమెంటేషన్: ధృవీకరణకు లోబడి, దరఖాస్తు ప్రక్రియ కొరకు కనీస డాక్యుమెంటేషన్ అవసరం ఉంటుంది.
పంపిణీ: వర్తించే నియమాలు మరియు అవసరమైన ప్రక్రియ పూర్తి కావడానికి లోబడి, నిధులు ఆమోదము తరువాత 24 గంటలలో పంపిణీ చేయబడతాయి.
అవసరాలకు తగిన విధంగా ఋణము తీసుకోవడాన్ని ప్రణాళిక చేసుకొనుటకు ఈ ఫీచర్స్ మీకు సహాయపడతాయి. అయితే, ఆమోదము, ఋణ మొత్తము, వడ్డీ రేటు మరియు పంపిణీ సమయము అన్నీ ఋణదాత అంచనా మరియు వర్తించే నిబంధనలపై ఆధారపడి ఉంటాయి.
మీ పర్సనల్ లోన్ ఈఎంఐని మీరు ఎలా ప్రణాళిక చేసుకోవచ్చు?
మీ ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ (ఈఎంఐ) అనేది మీ ఋణము కొరకు మీరు ప్రతి నెల తిరిగిచెల్లించే మొత్తము. ఇందులో అసలు, వడ్డీ ఉంటాయి. ఈఎంఐ అనేది ఋణ మొత్తము, వడ్డీ రేటు మరియు తిరిగిచెల్లింపు కాలవ్యవధులపై ఆధారపడి ఉంటుంది.
మీరు దరఖాస్తు చేసే ముందే మీ నెలవారి వాయిదాను అంచనా వేయుటకు పర్సనల్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ సహాయపడుతుంది. అంచనా తెలుసుకొనుటకు ప్రతిపాదిత ఋణ మొత్తము, వడ్డీ రేటు మరియు కాలవ్యవధిని ఎంటర్ చేయండి. వివిధ తిరిగిచెల్లింపు ఎంపికలు మీ బడ్జెట్ ను ఏ విధంగా ప్రభావితం చేస్తాయి అనేది అర్థం చేసుకొనుటకు మీరు ఈ విలువలను సవరించవచ్చు.
స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక కాలవ్యవధులను పోల్చి చూడటానికి పర్సనల్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ ను ఉపయోగించండి. స్వల్పకాలిక కాలవ్యవధి అంటే నెలవారి వాయిదా అధికంగా ఉంటుంది కాని పూర్తి వడ్డీని తగ్గిస్తుంది, అలాగే దీర్ఘకాలిక కాలవ్యవధి నెలవారి వాయిదాను తగ్గిస్తాయి కాని చెల్లించబడే మొత్తం వడ్డీని పెంచుతుంది.
ప్రో టిప్: ఇంటి అద్దె, కుటుంబ ఖర్చులు, ప్రస్తుత ఋణ చెల్లింపులు మరియు పొదుపుల కొరకు తగినంత డబ్బును మిగిల్చే ఒక ఈఎంఐని ఎంచుకోండి. మీ నిర్ణయం తీసుకునే ముందు అత్యంత తక్కువగా అందుబాటులో ఉన్న అతి తక్కువ వాయిదా పై మాత్రమే ఆధారపడకండి .
బజాజ్ ఫైనాన్స్ పర్సనల్ లోన్ కోసం ఎవరు దరఖాస్తు చేయవచ్చు?
ఋణదాత అర్హత ప్రమాణాలను మీరు నెరవేరిస్తే, మీరు బజాజ్ ఫైనాన్స్ పర్సనల్ లోన్ కోసం మీరు దరఖాస్తు చేయవచ్చు. ఈ ప్రమాణాలలో జాతీయత, వయసు, ఉపాధి స్థితి మరియు CIBIL స్కోర్ వంటి ఉంటాయి. మీ అంతిమ అర్హత మరియు ఋణ ఆఫర్ ఋణదాత అంచనాపై ఆధారపడి ఉంటాయి.
పర్సనల్ లోన్ అర్హత ప్రమాణము
జాతీయత - భారతీయులు
వయసు- 21 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వరకు.
వినియోగదారుడి ప్రొఫైల్ - స్వయం ఉపాధి పొందినవారు లేదా ఉద్యోగి
ఉద్యోగ యజమాని (వేతన దరఖాస్తుదారుల కొరకు) - ప్రభుత్వ, ప్రైవేట్ లేదా ఎంఎన్‌సి.
CIBIL స్కోర్ - 650 లేదా ఆపైన
*ఋణ కాలవ్యవధి ముగిసే సమయానికి మీ వయసు 80 సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువగా ఉండాలి.
పర్సనల్ లోన్ కొరకు అవసరమయ్యే దస్తావేజులు
మీ ప్రొఫైల్ మరియు ఋణదాత ధృవీకరణ ఆవశ్యకతలను అనుసరించి ఈ క్రింది దస్తావేజులను సిద్ధంగా ఉంచుకోండి:
కేవైసి దస్తావేజులు:
ఆధార్ / పాస్పోర్ట్ / వోటర్ ఐడి / డ్రైవింగ్ లైసెన్స్ / నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ లేఖ / ఎన్ఆర్ఈజిఏ జాబ్ కార్డ్
పాన్ కార్డ్
ఉద్యోగి ఐడి కార్డ్
గత 3 నెలల వేతన చీటీలు
గత 3 నెలల బ్యాంక్ ఖాతా స్టేట్మెంట్లు
పైప్డ్ గ్యాస్ బిల్
పెన్షన్ ఆర్డర్
ఉద్యోగ యజమాని ద్వారా జారీ చేయబడిన వసతి కేటాయింపు లేఖ
ఆస్తి / మునిసిపల్ పన్ను రసీదు
యుటిలిటి బిల్లు
ఫోన్ బిల్లు
వాస్తవ-సమయ చిత్రము / ఫోటో
గమనిక: పైన పేర్కొనబడిన ప్రతి దస్తావేజును మీరు సబ్మిట్ చేయవలసిన అవసరం ఉండకపోవచ్చు. మీ ప్రొఫైల్ మరియు ధృవీకరణ ఆవశ్యకతలపై ఆధారంగా దస్తావేజులు అభ్యర్ధించబడతాయి.
ఆన్లైన్ లో పర్సనల్ లోన్ కోసం మీరు ఎలా దరఖాస్తు చేయగలరు?
బజాజ్ ఫైనాన్స్ వెబ్సైట్ ద్వారా ఒక పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేయటానికి మీరు ఈ క్రింది సాధారణ దశలను అనుసరించవచ్చు:
ఋణ అర్హతను పరీక్షించండి – బజాజ్ ఫైనాన్స్ వెబ్సైట్ పై పర్సనల్ లోన్ పేజీని సందర్శించవచ్చు, అవసరమైన ఋణ మొత్తాన్ని ఎంటర్ చేయండి, తిరిగిచెల్లింపు కాలవ్యవధిని ఎంపిక చేయండి మరియు ఋణ అర్హతను పరీక్షించుటకు “చెక్ లోన్ ఆఫర్” పై క్లిక్ చేయండి.
వ్యక్తిగత వివరాలను ఎంటర్ చేయండి – వ్యక్తిగతీకరించబడిన ఋణ ఆఫర్ ను అందుకొనుటకు మీరు వ్యక్తిగత, ఆర్ధిక, మరియు ఉపాధి వివరాలను అందించాలి.
ఋణ ఆఫర్ ను సమీక్షించండి – మీరు ఆఫర్ వివరాలను పరీక్షించి, అవసరమైతే ఋణ మొత్తాన్ని లేదా తిరిగిచెల్లింపు కాలవ్యవధిని సరిచేయవచ్చు.
కేవైసి ధృవీకరణను పూర్తి చేయండి – దరఖాస్తుదారులు వారి దరఖాస్తును కొనసాగించుటకు ఋణ దరఖాస్తుదారుడు తమ గుర్తింపును మరియు బ్యాంక్ వివరాలను ధృవీకరించవచ్చు.
ఋణ నిపుణుడితో మాట్లాడండి – ఋణ దరఖాస్తును సబ్మిట్ చేసిన తరువాత, తదుపరి దశల గురించి తెలియజేయుటకు ఒక ఎక్సిక్యూటివ్ మిమ్మల్ని సంప్రదిస్తారు.
అర్హత ప్రమాణాలు, ధృవీకరణ మరియు ఋణదాత నిర్ణయముపై ఆమోదము మరియు పంపిణీ ఆధారపడి ఉంటాయి.
*షరతులు వర్తిస్తాయి
Disclaimer: This is a sponsored article. ABP Network Pvt. Ltd. and/or ABP Live does not in any manner whatsoever endorse/subscribe to the contents of this article and/or views expressed herein. Reader discretion is advised.
Frequently Asked Questions
పర్సనల్ లోన్ దేనికి ఉపయోగపడుతుంది?
పర్సనల్ లోన్ కు తాకట్టు అవసరమా?
లేదు, వ్యక్తిగత ఋణం అసురక్షితమైనది. కాబట్టి, మీరు ఎలాంటి ఆస్తిని లేదా ఇతర ఆస్తులను తాకట్టు పెట్టవలసిన పనిలేదు.
బజాజ్ ఫైనాన్స్ పర్సనల్ లోన్ తిరిగిచెల్లింపు కాలవ్యవధి ఎంత?
తిరిగిచెల్లింపు కాలవ్యవధి 12 నెలల నుండి 108 నెలల వరకు ఉంటుంది. మీ నెలవారీ వాయిదాలను (EMI) ప్లాన్ చేసుకోవడానికి EMI కాలిక్యులేటర్‌ను ఉపయోగించవచ్చు.
పర్సనల్ లోన్ కోసం అర్హత ప్రమాణాలు ఏమిటి?
దరఖాస్తుదారులు భారతీయ జాతీయత కలిగిన 21 నుండి 80 సంవత్సరాల వయస్సు గల ఉద్యోగులు లేదా స్వయం ఉపాధి పొందినవారు అయి ఉండాలి. CIBIL స్కోర్ 650 లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి.
ట్రెండింగ్ వార్తలు























