![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
UPI Services: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లకు అలెర్ట్ - UPI సేవలు క్లోజ్!
UPI Services Halt: దేశంలోని కొన్ని బ్యాంకులు కొంత సమయం పాటు/తాత్కాలికంగా UPI సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. ఇప్పుడు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వంతు వచ్చింది.
![UPI Services: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లకు అలెర్ట్ - UPI సేవలు క్లోజ్! Upi services will be halted for these two days in november hdfc bank told to its customers UPI Services: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లకు అలెర్ట్ - UPI సేవలు క్లోజ్!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/05/386cf991b4490cd1fc8092ac9a761ebc1730780614016545_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
HDFC Bank UPI Services Will Be Halted: దేశంలో అతి పెద్ద ప్రైవేట్ లెండర్ అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఈ నెల (నవంబర్ 2024)లో 2 రోజుల పాటు UPI సేవలకు హాల్ట్ ప్రకటించింది. యుపీఐ సేవలను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు గతంలోనే ప్రకటించిన ప్రైవేట్ బ్యాంక్, ఏ రోజున ఏ సమయంలో UPI (Unified Payment Services) సర్వీస్ పని చేయదన్న విషయాన్ని కూడా అవి వెల్లడించింది. బ్యాంక్ చెప్పిన తేదీల్లో మొదటి రోజు మంగళవారం, 05 నవంబర్ 2024. బ్యాంక్ ప్రకారం, UPI సేవలు అర్ధరాత్రి 12 నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు, మొత్తంగా 2 గంటల పాటు నిలిచిపోయాయి. అయితే, బ్యాంక్ వెల్లడించిన ప్రకారం మరొకరోజు మిగిలుంది.
UPI సేవల సస్పెన్షన్‌లో రెండో రోజు
నవంబర్ 05న కాకుండా, HDFC బ్యాంక్ UPI సేవలు 23 నవంబర్ 2024న 3 గంటల పాటు పని చేయవు. ఆ రోజున, అర్ధరాత్రి 12 గంటల నుండి తెల్లవారుజామున 3 గంటల వరకు, మొత్తంగా 3 గంటలు హాల్ట్ ఇస్తారు. రెండో షెడ్యూల్ డౌన్‌టైమ్‌కు 1౭ రోజులు మిగిలి ఉంది.
HDFC బ్యాంక్ కస్టమర్లు ఈ విషయాలను కచ్చితంగా గుర్తుంచుకోవాలి:
-- UPI సర్వీస్‌కు హాల్ట్ ప్రకించిన సమయంలో ఆర్థిక లేదా ఆర్థికేతర UPI లావాదేవీలు సాధ్యం కాదు.
-- హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సేవింగ్స్ & కరెంట్ ఖాతాలు రెండింటికీ ఇది వర్తిస్తుంది.
-- ఈ పరిస్థితి HDFC బ్యాంక్ రూపే కార్డ్‌లకు కూడా వర్తిస్తుంది, వాటి ద్వారా కూడా UPI సేవలను ఉపయోగించలేరు.
-- హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ యుపీఐ సేవల ద్వారా చెల్లింపులు చేసే దుకాణదార్లు కూడా చెల్లింపులు చేయలేరు.
-- దీనికి సంబంధించిన మొత్తం సమాచారం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వెబ్‌సైట్‌లో ఉంది.
HDFC బ్యాంక్ UPI సేవలను ఎందుకు నిలిపివేస్తోంది?
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ యుపీఐ సేవలను హాల్ట్ చేయడం వెనుక సాంకేతిక కారణం ఉంది. UPI హాల్ట్ ప్రకటించిన సమయంలో, బ్యాంక్ సర్వర్‌లో అవసరమైన సిస్టమ్ మేనేజ్‌మెంట్ నిర్వహిస్తారు. అర్ధరాత్రి సమయంలో యూపీని ఉపయోగించుకునే వాళ్లు, బ్యాంకింగ్ చేసే వాళ్లు చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు కాబట్టి ఆ సమయాన్ని ఎంచుకుంది.
HDFC బ్యాంక్‌కు లింక్ చేసిన UPI ఖాతాల పరిస్థితి ఏంటి?
HDFC బ్యాంక్‌కు లింక్ చేసిన UPI ఖాతాలు కూడా నవంబర్ 05న షెడ్యూల్డ్ టైమ్‌లో పని చేయలేదు, నవంబర్ 23న కూడా పని చేయవు. మీ పేటీఎం (Paytm), ఫోన్‌పే (PhonePe), గూగుల్ పే (Google Pay), మొబిక్విక్ (MobiKwik) లేదా ఏదైనా ఇతర UPI అకౌట్ ద్వారా HDFC బ్యాంక్‌కు లింక్ అయితే, మీరు డబ్బును బదిలీ చేయడానికి లేదా స్వీకరించడానికి షెడ్యూల్ టైమ్‌లో వీలవదు. దీనికి బదులుగా, నెఫ్ట్ (NEFT) లేదా IMPS ద్వారా డబ్బును బదిలీ చేయవచ్చు లేదా ఆర్డర్ చేయవచ్చు.
మీరు HDFC బ్యాంక్ కస్టమర్ అయితే, ఈ నెల 23వ తేదీ కోసం సిద్ధంగా ఉండాలి. సాంకేతిక నిర్వహణల కారణంగా, దేశంలోని మరికొన్ని ప్రధాన ప్రైవేట్ బ్యాంకులు కూడా అప్పుడప్పుడు UPI సర్వీస్‌లను తాత్కాలికంగా నిలిపేస్తున్నాయి. ఏ రోజున, ఏ సమయంలో హాల్ట్ ఉంటుందన్న విషయంపై తమ ఖాతాదార్లకు ముందుగానే సమాచారం పంపుతున్నాయి.
మరో ఆసక్తికర కథనం: ఫ్లిప్‌కార్ట్ రేట్లు ఆండ్రాయిడ్ ఫోన్లలో ఒకలా, ఐఫోన్లలో మరోలా - ఎందుకిలా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)