Union Budget 2022: కేంద్ర బడ్జెట్ 2022-23 పూర్తి స్వరూపం... రూపాయి రాక, పోక ఎలా ఉన్నాయంటే...!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2022-23 బడ్జెట్ ను లోక్ సభలో ప్రవేశపెట్టారు. మొత్తం రూ.39 లక్షల 44 వేల 909 కోట్ల బడ్జెట్ నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు.
కేంద్ర ప్రభుత్వం 2022-23 సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో కేంద్ర పద్దును ప్రవేశపెట్టారు. సుమారు గంటన్నరపాటు నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం కొనసాగింది. 2022-23 మొత్తం బడ్జెట్ విలువ రూ. 39 లక్షల 44 వేల 909 కోట్లు. ఈ ఏడాది మొత్తం వనరుల సమీకరణ రూ. 22.84 లక్షల కోట్లు కాగా, ద్రవ్యలోటు 6.9 శాతం అని ఆర్థిక మంత్రి ప్రకటించారు. రూ.17 లక్షల కోట్ల లోటు బడ్జెట్ ఉందని తెలిపారు. గతేడాది కంటే ఈసారి బడ్జెట్ రూ.4,61,673 కోట్లు పెరిగింది. 2021-22లో రూ.34,83,236 కోట్ల బడ్జెట్ ను కేంద్రం ప్రతిపాదించింది. అయితే బడ్జెట్ లో రూపాయి రాక, పోక వివరాలు ఇలా...
కేంద్ర బడ్జెట్ 2022-23 స్వరూపం (రూ. కోట్లలో)
- మొత్తం బడ్జెట్ - 39,44,909
- రెవెన్యూ వసూళ్లు - 22,04,422
- మూలధన వసూళ్లు - 17,40,487
- మొత్తం వసూళ్లు - 39,44,909
- రెవెన్యూ లోటు - 9,90,241
- ద్రవ్య లోటు - 16,61,196
కేంద్ర బడ్జెట్ 2022-23 లో ముఖ్య రంగాలు/శాఖలు కేటాయింపులు (రూ. కోట్లలో)
- వ్యవసాయ, అనుబంధ రంగాలు - 1,51,521
- గ్రామీణాభివృద్ధి - 2,06,293
- ఆరోగ్య రంగం - 86,606
- విద్యా రంగం - 1,04,278
- రక్షణ రంగం - 3,85,370
- రోడ్లు, ఉపరితల రవాణా శాఖ - 3,51,851
- నైపుణ్యాభివృద్ధి శాఖ - 2,688
- సామాజిక సంక్షేమ శాఖ - 51,780
- పట్టణాభివృద్ధి - 76,549
- ఐటీ & టెలికాం - 79,887
కేంద్ర బడ్జెట్ 2022-23 రూపాయి రాక ఇలా (రూ. కోట్లలో)
- రుణేతర రెవెన్యూ వసూళ్లు - 22,04,422
- పన్నేతర ఆదాయం - 2,69,651
- మూలధన వసూళ్లు - 17,40,487
- రుణాల రికవరీ - 14,291
- ఇతర వసూళ్లు - 65,000
- మొత్తం ఆదాయం - 39,44,90
కేంద్ర బడ్జెట్ లో రూపాయి పోక ఇలా(రూ.కోట్లలో)
- కేంద్ర ప్రాయోజిత పథకాలు - 3,17,643
- రుణేతర రెవెన్యూ వ్యయం - 31,94,663
- మూలధన వ్యయం - 7,50,246
- వడ్డీ చెల్లింపులు - 9,40,651
- మొత్తం వ్యయం - 39,44,909
Also Read: ఆదాయ పన్ను! మనం ఏం అడిగాం? నిర్మలమ్మ ఏం వడ్డించింది...?