అన్వేషించండి

Aadhaar Card Photo Update: ఆధార్ కార్డ్‌లో ఫోటో నచ్చలేదా? అందంగా మార్చుకోండిలా!

ఫోటో, బయోమెట్రిక్ వివరాలను నవీకరించుకోవడానికి (అప్‌డేట్ చేయడానికి) మీరు తప్పనిసరిగా ఆధార్ సేవ కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది.

Aadhaar Card Photo Updae: భారతదేశ పౌరుల గుర్తింపు పత్రాల్లో ఆధార్ కార్డు ఒకటి. ఇది అతి ముఖ్యమైన గుర్తింపు కార్డు. బ్యాంకు ఖాతాలు తెరవవానికి, లావాదేవీలు కొనసాగించడానికి, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందేందుకు, రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు, ఉద్యోగాల కోసం దరఖాస్తు చేయడానికి, కొలువుల్లో చేరడానికి ఇలా... చాలా రకాల పనుల కోసం ఆధార్‌ కార్డును తప్పని సరిగా అడుగుతున్నారు. ఆధార్‌ కార్డ్‌ లేని మనిషిని విచిత్రంగా చూస్తున్న రోజులివి. మీకు ఆధార్ కార్డ్ లేకపోయినా, రాకపోయినా ప్రభుత్వ పథకాలు అందవు. ఆధార్ కార్డ్‌లో 12 అంకెల గుర్తింపు సంఖ్య ఉంటుంది. ఇందులో, వేలిముద్రల (బయోమెట్రిక్) వివరాలు, ఫోటో, పుట్టిన తేదీ, చిరునామా వంటి వినియోగదారులకు సంబంధించిన సమాచారం ఉంటుంది.

ఆధార్ కార్డ్‌లో వ్యక్తిగత సమాచారాన్ని మార్చుకోవడానికి లేదా తప్పులు సరి చేసుకోవడానికి లేదా అప్‌డేషన్‌ కోసం ఆధార్‌ సేవ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, ఆన్‌లైన్‌లోనే వివరాలు మార్చుకునే సదుపాయాన్ని ఉడాయ్‌ (Unique Identification Authority of India - UIDAI) కొన్నేళ్ల క్రితమే తీసుకొచ్చింది. అయితే, మొత్తం సమాచారాన్ని ఆన్‌లైన్‌ ద్వారా అప్‌డేట్ చేయడం కుదరదు. ఫోటో, బయోమెట్రిక్ వివరాలను నవీకరించుకోవడానికి (అప్‌డేట్ చేయడానికి) మీరు తప్పనిసరిగా ఆధార్ సేవ కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. దీని కోసం, నేరుగా ఆధార్‌ సేవ కేంద్రానికి వెళ్లవచ్చు లేదా, ఆధార్ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి నిర్దేశిత ఆధార్‌ సేవ కేంద్రంలో మీకు వీలైన సమయం కోసం ఒక అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డ్‌లో ఉన్న మీ ఫోటో లేదా మీ కుటుంబ సభ్యుల ఫోటోలు బాగోలేకపోతే, లేదా ఆ ఫోటోలు పాతవి అయితే వాటిని మార్చుకోవచ్చు. ఈ కింద సూచించిన సులభ మార్గంలో ఆధార్‌ కార్డ్‌లోని ఫోటోను మార్చవచ్చు.

ఆధార్‌ కార్డ్‌లో ఫోటో మార్చడానికి సులభ మార్గం:
ముందుగా mAadhaar యాప్ నుంచి ఫోటో అప్‌డేషన్‌ ఫారం డౌన్‌లోడ్ చేసుకోవాలి.
మీరు ఈ ఫారాన్ని ఆధార్ సేవ కేంద్రం నుంచి కూడా పొందవచ్చు.
ఆ ఫారంలో అడిగి వివరాలను తప్పులు లేకుండా జాగ్రత్తగా పూరించండి. అక్షర దోషాలు లేకుండా ఒకటికి రెండుసార్లు సరి చూసుకోండి.
ఫారం నింపిన తర్వాత, మీరు ఆధార్ సేవ కేంద్రానికి వెళ్లి దానిని సమర్పించాలి. ఇప్పుడు, ఫొటో అప్‌డేషన్‌ పని ప్రారంభమవుతుంది.
ఆధార్‌ సేవ కేంద్రంలోని సిబ్బంది మీ నుంచి వేలిముద్రలు (బయోమెట్రిక్) తీసుకుంటారు.
అక్కడే ఉన్న కెమెరా ద్వారా మీ ఫోటో కూడా తీసుకుంటారు. ఇదే ఫొటోను ఆధార్‌ కార్డ్‌లో అప్‌డేట్‌ చేస్తారు. 
ఆధార్‌ కార్డ్‌ ఫొటోలో మీరు ఎలా కనిపించాలని కోరుకుంటారో, దానికి తగ్గట్లుగా ముందే సిద్ధమై వెళ్లండం ఉత్తమం.
ఇప్పుడు మీరు ఫోటోను అప్‌డేట్ చేయడానికి ఆధార్‌ సేవ కేంద్రంలో రుసుము చెల్లించాలి.

ఈ తతంగం ముగిసిన తర్వాత మీకు రసీదు ఇస్తారు. దాని మీద URN నంబర్ ఉంటుంది. దాని సహాయంతో, మీరు మీ ఫోటో అప్‌డేట్ ప్రక్రియను ట్రాక్ చేయవచ్చు. కొన్ని రోజుల తర్వాత, UIDAI నుంచి ఫోటో అప్‌డేట్ SMS వస్తుంది. మీ ఆధార్ కార్డుకు అనుసంధానమైన మొబైల్‌ నంబర్‌కు ఆ SMS వస్తుంది. దీని తర్వాత, మీరు ఆధార్ వెబ్‌సైట్‌ను సందర్శించి, ఆధార్ కార్డ్‌లో నవీకరించిన ఫోటోను చూసుకోవచ్చు, దానిని డౌన్‌లోడ్ చేసుకుని అవసరమైన చోట వినియోగించుకోవచ్చు.

ఆధార్‌ కార్డ్‌లో ఫోటో మార్చుకోవడానికి ఎంత ఫీజు చెల్లించాలి?
UIDAI అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, ఆధార్ కార్డ్‌లో ఫోటోను నవీకరించడానికి భారతదేశ పౌరులు రూ. 100 చెల్లించాలి. ఆధార్ కార్డ్‌లో ఫోటోను అప్‌డేట్ చేయడానికి ఇతర ఏ గుర్తింపు పత్రాన్ని చూపించాల్సిన అవసరం లేదు. ఆధార్ కార్డ్‌లో ఫోటో ఆఫ్‌లైన్‌లో మాత్రమే అప్‌డేట్ చేస్తారు. ఆన్‌లైన్‌ ద్వారా మనమే అప్‌డేట్‌ చేసుకోవడం కుదరదు.

టాప్ హెడ్ లైన్స్

Care Health Insurance: తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
Air India New CEO: ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ- ఎండీగా టేవోల్డే గెబ్రేమారియం.. ఎయిర్‌లైన్స్ దశ మారుతుందా?
ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ- ఎండీగా టేవోల్డే గెబ్రేమారియం.. ఎయిర్‌లైన్స్ దశ మారుతుందా?
EPFO Latest News: 20 రోజులైనా PF క్లెయిమ్ అమౌంట్ రాకపోతే ఏం చేయాలి ? ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్
20 రోజులైనా PF క్లెయిమ్ అమౌంట్ రాకపోతే ఏం చేయాలి ? ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
యూత్‌కు నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు
Pulsar N160 కొత్త వేరియంట్లు.. మరింత పవర్‌, మరిన్ని మోడ్స్‌ - రూ.1.34 లక్షలకే!
Embed widget