News
News
X

UBS - Credit Suisse: క్రెడిట్‌ సూయిస్‌ టేకోవర్‌ కోసం UBS ప్రయత్నాలు

క్రెడిట్‌ సూయిస్‌ మొత్తాన్ని లేదా కొంత భాగాన్ని UBS స్వాధీనం చేసుకోవడానికి ఈ చర్చలు జరుగుతున్నాయి.

FOLLOW US: 
Share:

UBS Group - Credit Suisse: సిలికాన్ వ్యాలీ బ్యాంక్ పతనం నుంచి పుట్టుకొచ్చిన ప్రకంపనలు అమెరికా నుంచి గ్లోబల్‌ బ్యాంకింగ్‌ రంగం మొత్తానికి వ్యాపించాయి. ఏ బ్యాంక్‌కు సంబంధించి ఒక వార్త బయటకు వచ్చినా.. ఇటు స్టాక్‌ మార్కెట్‌ పెట్టుబడిదార్లు, అటు బ్యాంకు ఖాతాదార్లు వణికిపోతున్నారు. ఈ ఎపిసోడ్‌లో తాజాగా నలుగుతున్న ఉదాహరణ క్రెడిట్ సూయిస్ బ్యాంక్‌. 

క్రెడిట్ సూయిస్ భారీ సమస్యల్లో ఉందంటూ వస్తున్న వార్తలు పెట్టుబడిదార్లను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తమ అంతర్గత వ్యవస్థల్లో లోపాలు ఉన్నట్లు తాము గుర్తించినట్లు, ఇటీవలే ఈ బ్యాంక్‌ స్వయంగా ప్రకటించింది కూడా. ఈ దిగ్గజ బ్యాంక్‌ దగ్గర $54 బిలియన్‌ డాలర్ల నగదు నిల్వలు ఉన్నప్పటికీ, దీని షేర్‌ ధర పతనం కొనసాగింది. దీంతో, క్రెడిట్‌ సూయిస్‌కు కొత్త ఊపిరులు ఊదడం ద్వారా మొత్తం బ్యాంకింగ్‌ వ్యవస్థలో ఉత్తేజాన్ని నింపడానికి ప్రయత్నం జరుగుతోంది. స్విస్ నేషనల్ బ్యాంక్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది.

క్రెడిట్ సూయిస్ - UBS చర్చలు           
భారీ సమస్యలను ఎదుర్కొంటున్న క్రెడిట్ సూయిస్ బ్యాంక్ బోర్డు, స్విస్ బ్యాంకింగ్ దిగ్గజం UBS బోర్డు మధ్య ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. క్రెడిట్‌ సూయిస్‌ మొత్తాన్ని లేదా కొంత భాగాన్ని UBS స్వాధీనం చేసుకోవడానికి ఈ చర్చలు జరుగుతున్నాయి. దీంతోపాటు, స్విస్ నేషనల్ బ్యాంక్, బ్యాంకింగ్‌ రెగ్యులేటర్ స్విస్ ఫిన్మా (FINMA) ప్రారంభించిన చర్చల్లోనూ ఈ రెండు బ్యాంకుల బోర్డులు విడివిడిగా పాల్గొంటాయి, ఈ వారాంతంలో సమావేశాలు జరుగుతాయి.

వెల్త్ మేనేజ్‌మెంట్ క్లయింట్లు క్రెడిట్‌ సూయిస్‌ బ్యాంకు నుంచి బయటకు వెళ్లిపోతున్నారని ఆ బ్యాంక్‌ ఎగ్జిక్యూటివ్ చెప్పిన నేపథ్యంలో ఈ చర్చలు ప్రారంభమయ్యాయి. UBS విలువ $56 బిలియన్‌ డాలర్లు కాగా, క్రెడిట్ సూయిస్‌ విలువ $7 బిలియన్‌ డాలర్లు. వీటి మధ్య విలీన చర్చల వల్ల ఇన్వెస్టర్లలో విశ్వాస పతనానికి అడ్డుకట్ట పడుతుందని భావిస్తున్నారు. ఈ చర్చలకు "ప్లాన్ A" అని పేరు పెట్టనట్లు తెలుస్తోంది.

అయితే, UBS గానీ, Credit Suisse గానీ ఈ విషయంపై స్పందించడానికి నిరాకరించాయి.

సొసైటీ జనరల్‌, డ్యూయిష్‌ బ్యాంక్‌ సహా కనీసం నాలుగు ప్రధాన బ్యాంకులు క్రెడిట్ సూయిస్‌తో కొత్త లావాదేవీలపై పరిమితులను విధించాయని, ఇది ఈ బ్యాంక్ సమస్యలను పెంచిందని రాయిటర్స్ నివేదించింది. క్రెడిట్ సూయిస్ సెక్యూరిటీలతో లింక్ అయిన రుణాలను HSBC పరిశీలిస్తోందని కూడా రాయిటర్స్‌ రిపోర్ట్‌ చేసింది.

క్రెడిట్ సూయిస్ షేర్లు భారీగా పతనం
ఈ వారం ప్రారంభంలో, స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంక్ నుంచి క్రెడిట్‌ సూయిస్‌ 5400 మిలియన్‌ డాలర్ల (54 బిలియన్ డాలర్లు) రుణం తీసుకుంటుందని వార్తలు వచ్చాయి. ఈ రూపంలో స్విస్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ నుంచి జీవదానం దొరికినా, క్రెడిట్ సూయిస్ ఆర్థిక పరిస్థితి బాగా క్షీణించడంతో సంస్థ షేర్లు ఆ భారాన్ని భరించవలసి వచ్చింది. శుక్రవారం కూడా క్రెడిట్ సూయిస్ షేర్లు 7 శాతం పడిపోయాయి. మొత్తంగా చూస్తే, ఈ వారంలో ఈ స్టాక్ 24 శాతం క్షీణతను నమోదు చేసింది.

Published at : 18 Mar 2023 11:24 AM (IST) Tags: Credit Suisse Signature Bank Swiss bank UBS Group AG

సంబంధిత కథనాలు

SEBI: మ్యూచువల్ ఫండ్స్‌ నామినేషన్‌ గడువు పొడిగింపు, మరో 6 నెలలు ఊరట

SEBI: మ్యూచువల్ ఫండ్స్‌ నామినేషన్‌ గడువు పొడిగింపు, మరో 6 నెలలు ఊరట

Stocks to watch 29 March 2023: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి - అదానీ స్టాక్స్‌తో జాగ్రత్త

Stocks to watch 29 March 2023: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి - అదానీ స్టాక్స్‌తో జాగ్రత్త

Gold-Silver Price 29 March 2023: ఇవాళ కూడా తగ్గిన బంగారం ధర, ఇప్పటికీ హై రేంజ్‌లోనే రేటు

Gold-Silver Price 29 March 2023: ఇవాళ కూడా తగ్గిన బంగారం ధర, ఇప్పటికీ హై రేంజ్‌లోనే రేటు

Petrol-Diesel Price 29 March 2023: చెమటలు పట్టిస్తున్న చమురు బిల్లు, చుక్క కూడా ముఖ్యమే

Petrol-Diesel Price 29 March 2023: చెమటలు పట్టిస్తున్న చమురు బిల్లు, చుక్క కూడా ముఖ్యమే

UPI Payments Via PPI: యూపీఐ యూజర్లకు అలర్ట్‌! ఇకపై ఆ లావాదేవీలపై ఏప్రిల్‌ 1 నుంచి ఫీజు!

UPI Payments Via PPI: యూపీఐ యూజర్లకు అలర్ట్‌! ఇకపై ఆ లావాదేవీలపై ఏప్రిల్‌ 1 నుంచి ఫీజు!

టాప్ స్టోరీస్

KCR Decisions: పోడు భూములకు పట్టాలు రెడీ, పంపిణీపై త్వరలో తేదీ ప్రకటిస్తాం: సీఎం కేసీఆర్

KCR Decisions: పోడు భూములకు పట్టాలు రెడీ, పంపిణీపై త్వరలో తేదీ ప్రకటిస్తాం: సీఎం కేసీఆర్

AP 10th Exams: 'పది'లో ఆరుపేపర్లు, బిట్ పేపర్ లేకుండానే ప్రశ్నపత్రం! విద్యార్థులకు 'సిలబస్' కష్టాలు!

AP 10th Exams: 'పది'లో ఆరుపేపర్లు, బిట్ పేపర్ లేకుండానే ప్రశ్నపత్రం! విద్యార్థులకు 'సిలబస్' కష్టాలు!

పది రోజుల్లో 50 వేల బుకింగ్స్, TSRTC కొత్త ప్లాన్‌కు అపూర్వ స్పందన, ఇకపై ఎనీటైమ్!

పది రోజుల్లో 50 వేల బుకింగ్స్, TSRTC కొత్త ప్లాన్‌కు అపూర్వ స్పందన, ఇకపై ఎనీటైమ్!

నా ఇంటికి రా రాహుల్ భయ్యా- రేవంత్ ఎమోషనల్ ట్విట్

నా ఇంటికి రా రాహుల్ భయ్యా-  రేవంత్ ఎమోషనల్ ట్విట్