అన్వేషించండి

Chemical Sector Stocks: జాతి రత్నాల్లాంటి 4 కెమికల్స్‌ స్టాక్స్‌, 60% వరకు ర్యాలీకి ఛాన్స్‌!

Refinitiv స్టాక్ రిపోర్ట్ ప్లస్ డేటా ఆధారంగా ఈ కెమికల్స్‌ స్టాక్స్‌ను ఎక్స్‌పర్ట్‌లు స్క్రీనింగ్ చేశారు.

Chemical Sector Stocks: రసాయన రంగం గత 5 సంవత్సరాలకు పైగా మార్కెట్‌ ఫోకస్‌లో ఉంది. కరోనా కాలానికి ముందు,  కరోనా కాలంలో, కరోనా పరిస్థితులు సద్దు మణిగిన తర్వాత ఈ రంగంలో విభిన్నమైన ట్రెండ్స్‌ కనిపించాయి. అయితే రెండు రకాల కంపెనీలు ఎక్కువగా ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షించాయి. మొదటి రకం కంపెనీలు... ఏకీకరణలో వెనుకబాటు మీద దృష్టి పెట్టి, తమ సామర్థ్యాన్ని విస్తరించాయి. రెండో రకం కంపెనీలు... దిగుమతి ప్రత్యామ్నాయ మార్గాల మీద దృష్టి పెట్టి, తమ ప్రొడక్ట్స్‌ పోర్ట్‌ఫోలియోను విస్తరించాయి. ఎందుకంటే.. అతిగా విదేశాల మీద, ముఖ్యంగా చైనా మీద ఆధారపడితే, కరోనా లాంటి పరిస్థితుల్లో తీవ్రంగా దెబ్బతింటామని అనుభవపూర్వకంగా ఇవి తెలుసుకున్నాయి. పైగా.. దిగుమతి చేసుకునే ఎలిమెంట్స్‌ మీద ఆధారపడడం తగ్గిస్తే, మార్జిన్‌లలో మెరుగుదలను, స్థిరత్వాన్ని సాధించవచ్చు.

NSEలో లిస్ట్‌ అయిన స్మాల్‌ క్యాప్ స్టాక్స్‌ను మాత్రమే ఈ కథనం కోసం పరిగణనలోకి తీసుకోవడం జరిగింది. Refinitiv స్టాక్ రిపోర్ట్ ప్లస్ డేటా ఆధారంగా ఈ కెమికల్స్‌ స్టాక్స్‌ను ఎక్స్‌పర్ట్‌లు స్క్రీనింగ్ చేశారు. 

బీఏఎస్‌ఎఫ్‌ (BASF)
స్టాక్‌ స్కోర్‌: 10
ఎనలిస్ట్‌ రికమెండేషన్‌ :  స్ట్రాంగ్‌ బయ్‌ (Strong Buy)
ప్రస్తుత స్థాయి నుంచి వృద్ధి అంచనా: 60.80%
ఈ స్టాక్‌లో సంస్థాగత మదపుదార్ల వాటా: 8%
మార్కెట్‌ విలువ: 11,864 కోట్ల రూపాయలు

నోసిల్‌ (Nocil)
స్టాక్‌ స్కోర్‌: 9
ఎనలిస్ట్‌ రికమెండేషన్‌ : బయ్‌ (Buy)
ప్రస్తుత స్థాయి నుంచి వృద్ధి అంచనా: 20.20%
ఈ స్టాక్‌లో సంస్థాగత మదపుదార్ల వాటా: 6.50%
మార్కెట్‌ విలువ: 3,851 కోట్ల రూపాయలు

బేయర్‌ క్రాప్‌ సైన్స్‌ (Bayer Cropscience)
స్టాక్‌ స్కోర్‌: 7
ఎనలిస్ట్‌ రికమెండేషన్‌ : బయ్‌ (Buy)
ప్రస్తుత స్థాయి నుంచి వృద్ధి అంచనా: 17.50%
ఈ స్టాక్‌లో సంస్థాగత మదపుదార్ల వాటా: 12.50%
మార్కెట్‌ విలువ: 21,297 కోట్ల రూపాయలు

సుమిటోమో కెమికల్‌ ఇండియా (Sumitomo Chemical India)
స్టాక్‌ స్కోర్‌: 9
ఎనలిస్ట్‌ రికమెండేషన్‌ : బయ్‌ (Buy)
ప్రస్తుత స్థాయి నుంచి వృద్ధి అంచనా: 10.60%
ఈ స్టాక్‌లో సంస్థాగత మదపుదార్ల వాటా: 7.10%
మార్కెట్‌ విలువ: 24,605 కోట్ల రూపాయలు

స్ట్రాంగ్‌ బయ్‌, బయ్‌ రికమెండేషన్స్‌; కనీసం 10% ర్యాలీ చేయగల అవకాశం; న్యూట్రల్‌ - పాజిటివ్‌ ఔట్‌లుక్; రూ. 1000 కోట్లకు పైగా మార్కెట్‌ విలువ ఉన్న కంపెనీలను ప్రాతిపదికగా చేసుకుని ఈ 4 కెమికల్స్‌ స్టాక్స్‌ను సూచించడం జరిగింది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Farm Fund Scheme: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అకౌంట్లలోకి రూ.75 వేలు, పథకానికి దరఖాస్తు చేసుకోండిలా!
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అకౌంట్లలోకి రూ.75 వేలు, పథకానికి దరఖాస్తు చేసుకోండిలా!
PM Modi AP Tour: ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
Tata Sierra EV: టాటా సియెర్రా ఈవీ లాంచ్ త్వరలోనే - ఎలక్ట్రిక్ కారు మార్కెట్లో మాస్టర్ స్ట్రోక్ - ధర ఎంత ఉండవచ్చు?
టాటా సియెర్రా ఈవీ లాంచ్ త్వరలోనే - ఎలక్ట్రిక్ కారు మార్కెట్లో మాస్టర్ స్ట్రోక్ - ధర ఎంత ఉండవచ్చు?
Chevireddy vs. Balineni :  చెవిరెడ్డి వర్సెస్ బాలినేని - వీళ్ల పరస్పర ఆరోపణల్లో ఎన్ని కొత్త విషయాలు బయటకు వస్తున్నాయంటే ?
చెవిరెడ్డి వర్సెస్ బాలినేని - వీళ్ల పరస్పర ఆరోపణల్లో ఎన్ని కొత్త విషయాలు బయటకు వస్తున్నాయంటే ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధంపుష్ప 2 మూవీలోని కిస్సిక్ సాంగ్‌పై విపరీతమైన ట్రోల్స్యూపీలోని షాహీ మసీద్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తతవిజయ్‌తో రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిన రష్మిక

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Farm Fund Scheme: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అకౌంట్లలోకి రూ.75 వేలు, పథకానికి దరఖాస్తు చేసుకోండిలా!
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అకౌంట్లలోకి రూ.75 వేలు, పథకానికి దరఖాస్తు చేసుకోండిలా!
PM Modi AP Tour: ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
Tata Sierra EV: టాటా సియెర్రా ఈవీ లాంచ్ త్వరలోనే - ఎలక్ట్రిక్ కారు మార్కెట్లో మాస్టర్ స్ట్రోక్ - ధర ఎంత ఉండవచ్చు?
టాటా సియెర్రా ఈవీ లాంచ్ త్వరలోనే - ఎలక్ట్రిక్ కారు మార్కెట్లో మాస్టర్ స్ట్రోక్ - ధర ఎంత ఉండవచ్చు?
Chevireddy vs. Balineni :  చెవిరెడ్డి వర్సెస్ బాలినేని - వీళ్ల పరస్పర ఆరోపణల్లో ఎన్ని కొత్త విషయాలు బయటకు వస్తున్నాయంటే ?
చెవిరెడ్డి వర్సెస్ బాలినేని - వీళ్ల పరస్పర ఆరోపణల్లో ఎన్ని కొత్త విషయాలు బయటకు వస్తున్నాయంటే ?
Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
iPhone 15 Pro Max Offer: ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ధర అంత తక్కువా - భారీ డిస్కౌంట్ ఇచ్చిన యాపిల్!
ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ధర అంత తక్కువా - భారీ డిస్కౌంట్ ఇచ్చిన యాపిల్!
Bengalore: సినిమా బిచ్చగాడు కాదు రియల్ - బెంగళూరు రోడ్లపై కనిపించే ఈ బెగ్గర్ లైఫ్ స్టోరీ వింటే కన్నీళ్లాగవు !
సినిమా బిచ్చగాడు కాదు రియల్ - బెంగళూరు రోడ్లపై కనిపించే ఈ బెగ్గర్ లైఫ్ స్టోరీ వింటే కన్నీళ్లాగవు !
Pawan Kalyan to Delhi : హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
Embed widget