By: ABP Desam | Updated at : 17 Mar 2023 12:14 PM (IST)
Edited By: Arunmali
గోపీనాథన్ హయాంలో మల్టీబ్యాగర్ రిటర్న్స్
TCS shares: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) CEO పదవికి రాజేష్ గోపీనాథన్ రాజీనామా చేసినట్లు గురువారం (16 మార్చి 2023) సాయంత్రం ఆ కంపెనీ ప్రకటించి, మార్కెట్‌ను ఆశ్చర్యపరిచింది. గోపీనాథన్ స్థానంలో కె.కృతివాసన్‌ను తదుపరి సీఈవోగా తక్షణం నియమించింది. CEO పదవికి రాజేష్ గోపీనాథన్ రాజీనామా చేసినా, ఈ ఏడాది సెప్టెంబరు 15 వరకు అదే హోదాలో కొనసాగుతారు. CEO పీఠంపై కృతివాసన్ నిలదొక్కుకునేలా సూచనలు చేస్తారు. నాయకత్వ మార్పు సాఫీగా జరిగేలా చూస్తారు.
ప్రతికూలంగా స్పందించిన మార్కెట్
రాజేష్ గోపీనాథన్ హఠాత్ రాజీనామాతో మార్కెట్ ప్రతికూలంగా ఆశ్చర్యపడింది. ఇవాళ (శుక్రవారం, 17 మార్చి 2023), సహచర IT స్టాక్స్ లాభాల్లో ఉంటే TCS షేర్ మాత్రం డీలా పడింది. 1% పైగా నష్టపోయి రూ. 3,144 వద్ద ఇంట్రాడే కనిష్టానికి చేరుకుంది. ఉదయం 11.25 గంటల సమయానికి 0.41% లేదా రూ. 12.95 నష్టంతో రూ. 3,172 వద్ద కదులుతోంది.
నాయకత్వ మార్పు జరిగినప్పటికీ, కంపెనీ వృద్ధి అవకాశాలను దృష్టిలో ఉంచుకుని ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని, సమీప కాలంలో షేర్ ధర తగ్గితే పోర్టిఫోలియోలకు యాడ్ చేసుకోమని బ్రోకరేజీలు సూచిస్తున్నాయి.
"1968లో ప్రారంభమైనప్పటి నుంచి, 55 సంవత్సరాల TCS చరిత్రలో కృతివాసన్ కేవలం ఐదో CEO మాత్రమే. కంపెనీ నిర్వహణలో స్థిరత్వం, నాణ్యతకు ఇది నిదర్శనం. నాయకత్వ మార్పు వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు" - నువామా ఎనలిస్ట్ విభోర్ సింఘాల్
గోపీనాథన్ నాయకత్వంలో, FY18–23 కాలంలో 13%/11% CAGR వద్ద ఆదాయాలు/లాభాలను TCS అందించింది. గత ఆరేళ్ల అతని పదవీకాలంలో TCS స్టాక్ 18% CAGR వద్ద పెరిగింది లేదా 160% ర్యాలీ చేసింది.
TCS CEO రాజేష్ గోపీనాథన్ రాజీనామా తర్వాత, అగ్ర బ్రోకరేజీలు ఇచ్చిన రేటింగ్స్ ఇవి:
కోటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ | యాడ్ | టార్గెట్ ధర: రూ. 2,500
మోతీలాల్ ఓస్వాల్ | బయ్ | టార్గెట్ ధర: రూ. 3,810
JP మోర్గాన్ | అండర్‌వెయిట్ | టార్గెట్ ధర: రూ. 3,000
సిటీ బ్యాంక్ | సెల్ | టార్గెట్ ధర: రూ. 2,990
CLSA | ఓవర్‌వెయిట్ | టార్గెట్ ధర: రూ. 3,550
మోర్గాన్ స్టాన్లీ | ఈక్వల్ వెయిట్ | టార్గెట్ ధర: రూ. 3,350
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Fraud alert: పేమెంట్ యాప్‌లో డబ్బు పంపి స్క్రీన్ షాట్ షేర్ చేస్తున్నారా - హ్యాకింగ్‌కు ఛాన్స్!
Cryptocurrency Prices: రూ.24 లక్షల వద్ద బిట్‌కాయిన్‌కు స్ట్రాంగ్ రెసిస్టెన్స్!
Laxman Narasimhan: స్టార్ బక్స్ కొత్త సీఈవోగా భారతీయుడు - ఆయన స్పెషాలిటీ ఇదే!
Stock Market News: ఫైనాన్స్ షేర్లు కుమ్మేశాయ్ - సెన్సెక్స్ 445, నిఫ్టీ 119 పెరిగేశాయ్!
Small Cap Favourites: బీమా కంపెనీల ఇష్టసఖులు ఈ స్మాల్ క్యాప్ స్టాక్స్, తెగ కొంటున్నాయ్!
Roja Fires on TDP Party: శవాల నోట్లో తులసి తీర్థం పోసినట్లు - టీడీపీ సంబరాలపై మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు
Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా
AP BJP Vs Janasena : అడిగినా పవన్ సపోర్ట్ ఇవ్వలేదు - సొంతంగా ఎదుగుతామని ఏపీ బీజేపీ ప్రకటన !
TSPSC : పేపర్ లీకేజీ కేసు సీబీఐ కి వెళ్తుందా ? ఎవరేం వాదించారంటే ?