News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

TCS Salary Hike: టీసీఎస్‌ గుడ్‌న్యూస్‌! 12-15% జీతాలు పెంచిన ఐటీ దిగ్గజం!! ప్రమోషన్లూ..!

TCS Salary Hike: దేశంలోనే అతిపెద్ద సాఫ్ట్‌వేర్‌ కంపెనీ టీసీఎస్‌ (TCS) ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది! వేతనాలు పెంచుతున్నామని ప్రకటించింది.

FOLLOW US: 
Share:

TCS Salary Hike: 

దేశంలోనే అతిపెద్ద సాఫ్ట్‌వేర్‌ కంపెనీ టీసీఎస్‌ (TCS) ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది! ఆపరేటింగ్‌ మార్జిన్‌పై 200 బేసిస్‌ పాయింట్ల ప్రభావం పడుతున్నప్పటికీ వేతనాలు పెంచుతున్నామని ప్రకటించింది. ఒకవైపు ఇన్ఫోసిస్‌ జీతాల పెంపును వాయిదా వేసిందన్న వార్తలు వస్తుంటే టీసీఎస్‌ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యం కలిగించింది.

'మేం ముందుకు వెళ్లాం! ఏప్రిల్‌ 1 నుంచి వార్షిక వేతనాలు పెంచాం. మా ఆపరేటింగ్‌ మార్జిన్‌ 23.2 శాతంలో 200 బేసిస్‌ పాయింట్ల వరకు వేతనాల పెంపు ప్రభావం కనిపిస్తుంది' అని టీసీఎస్‌ సీఎఫ్‌వో సమీర్‌ సెక్‌సారియా అన్నారు. తాజా వార్షిక వేతన సమీక్షలో అత్యుత్తమంగా పనిచేస్తున్న ఉద్యోగులకు 12-15 శాతం వరకు జీతాలు పెంచారు. అలాగే ప్రమోషన్లు కల్పించారు.

కంపెనీలో అట్రిషన్‌ స్థాయి క్రమంగా తగ్గుతోందని టీసీఎస్‌ తెలిపింది. ఈ అంశంలో ఇండస్ట్రీలో తామే ముందుంటామని ధీమా వ్యక్తం చేసింది. గత 12 నెలలతో పోల్చుకుంటే తొలి త్రైమాసికంలో ఐటీ సేవల్లో అట్రిషన్‌ రేట్‌ తగ్గిందని, 17.8 శాతానికి చేరుకుందని జూన్‌లో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇక జూన్‌ 30 నాటికి కంపెనీలో 6,15,318 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. తాజా క్వార్టర్లో 523 మంది పెరిగారు. ఉద్యోగుల్లో వైవిధ్యం ఉందని, 154 దేశాల వారు పనిచేస్తున్నారని వెల్లడించింది. మొత్తం వర్క్‌ ఫోర్స్‌లో మహిళలు 35.8 శాతం ఉన్నారని పేర్కొంది.

'ఇండస్ట్రీలోని అత్యుత్తమ ప్రతిభావంతులపై మేం దృష్టి సారించాం. వారిని అభివృద్ధి చేస్తున్నాం. ఉద్యోగాల్లోకి తీసుకొని రివార్డులు అందిస్తున్నాం. తిరిగి కార్యాలయానికి వచ్చేలా ప్రయత్నిస్తున్నాం. ఉద్యోగులు ఆఫీసులకు వచ్చే ప్రక్రియ వేగవంతమైంది. ఇప్పటికే ప్రతి మూడు వారాలకు ఒకసారి 55 శాతం మంది వస్తున్నారు' అని టీసీఎస్‌ చీఫ్ హెచ్‌ఆర్‌ మిలింద్‌ లక్కడ్‌ అన్నారు.

టీసీఎస్‌ రిజల్ట్స్‌

టీసీఎస్‌ బుధవారం సాయంత్రం ఆర్థిక ఫలితాలు విడుదల చేసింది. ఈ ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో రూ.11,074 కోట్ల నికర లాభం నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంలోని రూ.9,478 కోట్లతో పోలిస్తే 17 శాతం వృద్ధి సాధించింది. ఇక ఆపరేషన్స్‌ రెవెన్యూ వార్షిక ప్రాతిపదికన 12 శాతం పెరిగి రూ.59,381 కోట్లకు చేరుకుంది. ఈ నేపథ్యంలో కంపెనీ ఇన్వెస్టర్లకు డివిడెండ్‌ ప్రకటించింది. ఒక్కో షేరుకు రూ.9 డివిడెండ్‌ ఇస్తామని తెలిపింది. ఇందుకు జులై 20ని రికార్డు తేదీగా ఫిక్స్‌ చేసింది. ఆగస్టు 7న ఇన్వెస్టర్ల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి. గతేడాది కంపెనీ ఒక్కో షేరుకు రూ.115 డివిడెండ్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే.

Published at : 12 Jul 2023 06:29 PM (IST) Tags: TCS Salary Hike TCS Results

ఇవి కూడా చూడండి

Cryptocurrency Prices: జస్ట్‌ పెరిగిన బిట్‌కాయిన్‌! మిక్స్‌డ్‌ జోన్లో క్రిప్టోలు

Cryptocurrency Prices: జస్ట్‌ పెరిగిన బిట్‌కాయిన్‌! మిక్స్‌డ్‌ జోన్లో క్రిప్టోలు

Stock Market Today: కొనసాగిన అమ్మకాలు! 19,450 కిందకు నిఫ్టీ - సెన్సెక్స్‌ 286 డౌన్‌

Stock Market Today: కొనసాగిన అమ్మకాలు! 19,450 కిందకు నిఫ్టీ - సెన్సెక్స్‌ 286 డౌన్‌

Credit Card: సిబిల్‌ స్కోర్‌లో మీరు 'పూర్‌' అయినా క్రెడిట్‌ కార్డ్‌ కచ్చితంగా వస్తుంది, బ్యాంకులు పిలిచి మరీ ఇస్తాయి

Credit Card: సిబిల్‌ స్కోర్‌లో మీరు 'పూర్‌' అయినా క్రెడిట్‌ కార్డ్‌ కచ్చితంగా వస్తుంది, బ్యాంకులు పిలిచి మరీ ఇస్తాయి

Sweep Account: స్వీప్‌-ఇన్‌ గురించి తెలుసా?, సేవింగ్స్‌ అకౌంట్‌ మీద FD వడ్డీ తీసుకోవచ్చు

Sweep Account: స్వీప్‌-ఇన్‌ గురించి తెలుసా?, సేవింగ్స్‌ అకౌంట్‌ మీద FD వడ్డీ తీసుకోవచ్చు

YES Bank FD Rates: యెస్‌ బ్యాంక్‌ వడ్డీ ఆదాయాలు మారాయి, కొత్త FD రేట్లు ఈ రోజు నుంచే అమలు

YES Bank FD Rates: యెస్‌ బ్యాంక్‌ వడ్డీ ఆదాయాలు మారాయి, కొత్త FD రేట్లు ఈ రోజు నుంచే అమలు

టాప్ స్టోరీస్

Lokesh : స్కిల్ కేసులో ముందస్తు బెయిల్ పొడిగింపు - లోకేష్‌కు మరోసారి ఊరట !

Lokesh : స్కిల్ కేసులో ముందస్తు బెయిల్ పొడిగింపు - లోకేష్‌కు మరోసారి ఊరట !

Talasani Srinivas : చంద్రబాబు అరెస్టు బాధాకరం - వైసీపీవి కక్ష సాధింపులు - మంత్రి తలసాని కీలక వ్యాఖ్యలు

Talasani Srinivas :  చంద్రబాబు అరెస్టు బాధాకరం - వైసీపీవి కక్ష సాధింపులు -  మంత్రి తలసాని కీలక వ్యాఖ్యలు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌ని అరెస్ట్ చేసిన ఈడీ

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌ని అరెస్ట్ చేసిన ఈడీ

Nobel Prize 2023 in Chemistry: రసాయన శాస్త్రంలో ముగ్గురు అమెరికా శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం

Nobel Prize 2023 in Chemistry: రసాయన శాస్త్రంలో ముగ్గురు అమెరికా శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం