TCS Q2 Results: ఫలితాలు ప్రకటిస్తూనే డెడ్లీ వార్నింగ్ ఇచ్చిన టీసీఎస్, ఐటీ సెక్టార్‌తో జాగ్రత్త!
TCS Q2 Results: 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం తర్వాత కంపెనీ నెట్ హెడ్‌కౌంట్‌లో అతి తక్కువ నంబర్ ఇది.
TCS Q2FY24 Results: భారతదేశ $250 బిలియన్ల ఔట్ సోర్సింగ్ ఇండస్ట్రీ ఆదాయాల సీజన్‌ను ప్రారంభించిన TCS, Q2FY24 నికర లాభంలో దాదాపు 9% వృద్ధిని నివేదించింది. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం తర్వాత కంపెనీ నెట్ హెడ్‌కౌంట్‌లో అతి తక్కువ నంబర్ ఇది.
చారిత్రకంగా, జులై-సెప్టెంబర్ మూడు నెలల కాలం టెక్ మేజర్లకు బలమైన త్రైమాసికం. ఈ క్వార్టర్‌లో సాఫ్ట్‌వేర్ సేవల ఎగుమతి కంపెనీ (TCS) నికర లాభం రూ. 11,342 కోట్లకు చేరుకుంది. మార్కెట్ అంచనా వేసిన రూ. 11,378 కోట్లకు ఇది అనుగుణంగా ఉంది. 2022-23 సెప్టెంబర్ త్రైమాసిక లాభం రూ.10,431 కోట్లతో ఇప్పుడు 8.7% వృద్ధి కనబరిచింది. సీక్వెన్షియల్‌గా (QoQ), నికర లాభం 2.4% పెరిగింది.
Q2లో TCS ఆదాయం రూ. 59,692 కోట్లు, ఇది YoYలో 7.9% పెరిగింది. మార్కెట్ అంచనా వేసిన 9% వృద్ధి కంటే తక్కువ. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ & ఇన్సూరెన్స్ (BFSI) సెక్టార్‌లో మందగమనం కారణంగా టీసీఎస్ రాబడి వృద్ధి తగ్గింది. QoQగా చూస్తే ఆదాయం 0.5 శాతం పెరిగింది. మార్కెట్ ఎనలిస్ట్‌లు రూ. 60,300 కోట్ల ఆదాయాన్ని అంచనా వేశారు. మొత్తం ఇండస్ట్రీ పనితీరుకు ఈ నంబర్లను ఉదాహరణగా చూడవచ్చు.
డాలర్ల లెక్కలో ఆదాయం 7,210 మిలియన్ డాలర్లుగా నమోదైంది.
ఎబిట్ మార్జిన్ QoQలో 110 బేసిస్ పాయింట్లు పెరిగి, 23.2% నుంచి 24.3%కు చేరింది.
సెకండ్ క్వార్టర్‌లో 11.2 బిలియన్ డాలర్ల ఆర్డర్లను టీసీఎస్ దక్కించుకుంది. కంపెనీ అంచనా అయిన 7-9 బిలియన్ డాలర్ల కంటే ఇది ఎక్కువ. వరుసగా మూడో త్రైమాసికంలోనూ 10 బిలియన్ డాలర్ల మార్కును దాటింది.
టీసీఎస్ హెచ్చరిక
యాక్సెంచర్ తర్వాత ప్రపంచంలోని రెండో అత్యంత విలువైన టెక్నాలజీ సర్వీసెస్ కంపెనీ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఆర్థిక ఫలితాల సందర్భంగా కీలక కామెంట్స్ చేసింది. నిర్ణయాల్లో జాప్యాలు & క్లయింట్లు తమ వ్యయాల్ని తగ్గించుకోవడంతో డిమాండ్ & ఐటీ ఇండస్ట్రీ వృద్ధి అవకాశాలు తగ్గాయని హెచ్చరించింది.
ఇజ్రాయెల్‌లోని ప్రాజెక్టుల్లో 250 మంది వర్క్‌ఫోర్స్ పని చేస్తున్నారని, యుద్ధం వల్ల ప్రస్తుతానికి పెద్ద ప్రభావం లేదని టీసీఎస్ మేనేజ్‌మెంట్ ప్రకటించింది. సిబ్బందిలో ఎక్కువ మంది స్థానికులేనని వెల్లడించింది. వర్క్ ఫ్రం హోమ్‌కు (WFH) స్వస్తి పలికినట్లు చెప్పింది. 6 లక్షల మందికి పైగా ఉద్యోగులు పూర్తిగా ఆఫీసులకే వచ్చి పని చేయాలని చెప్పామని మేనేజ్‌మెంట్ తెలిపింది. ఆఫీసుల్లో కలిసి పని చేయడం వల్ల ప్రొడక్టివిటీ పెరుగుతుందని వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 40,000 మంది ఫ్రెషర్ల రిక్రూట్‌మెంట్ లక్ష్యాన్ని పూర్తి చేస్తామని టీసీఎస్ ప్రకటించింది. కాస్త ఆలస్యమైనా, ఆఫర్ లెటర్ అందుకున్న అందరికీ తప్పనిసరిగా అవకాశం ఇస్తామంది.
డివిడెండ్ & షేర్స్ బైబ్యాక్
రూ.1 ఫేస్ వాల్యూ గల ఒక్కో షేరుకు రూ.9 చొప్పున డివిడెండ్‌ను టీసీఎస్ ప్రకటించింది, ఈ నెల 19ని రికార్డు తేదీగా ఖరారు చేసింది. రూ.17,000 కోట్ల షేర్స్ బైబ్యాక్‌ను కూడా ఈ టెక్ కంపెనీ ప్రకటించింది. ఒక్కో షేరును రూ.4,150 ధరతో మొత్తం 4.09 కోట్ల షేర్లు (కంపెనీలో 1.12% వాటాకు సమానం) బైబ్యాక్ చేయాలని నిర్ణయించింది. బుధవారం BSEలో షేర్ ముగింపు ధర రూ.3,610.20తో పోలిస్తే, బైబ్యాక్ ప్రైస్ 15 శాతం పైగా అధికం. టీసీఎస్‌కు గత ఆరేళ్లలో ఇది అయిదో బైబ్యాక్.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial