Tata UPI APP: ఐపీఎల్ టైమ్‌లో టాటా దిమ్మతిరిగే ప్లాన్! వచ్చే నెల్లోనే 'UPI Payments' యాప్ లాంచింగ్!
Tata UPI Pay: గూగుల్ పే (Google Pay), ఫోన్ పే (Phone pe), అమెజాన్ పే (Amazon Pay), పేటీఎం (Paytm) వంటి డిజిటల్ పేమెంట్స్ యాపులకు పోటీగా టాటా యూపీఐ పేమెంట్ యాప్ రాబోతోంది.
Tata UPI Payments App: గూగుల్ పే (Google Pay), ఫోన్ పే (Phone pe), అమెజాన్ పే (Amazon Pay), పేటీఎం (Paytm) వంటి డిజిటల్ పేమెంట్స్ యాపులకు ఇప్పుడు మరింత పోటీ ఎదురవ్వనుంది. దేశంలోనే అత్యంత నమ్మకమైన టాటా గ్రూప్ (Tata Group) సరికొత్త యూపీఐ పేమెంట్స్ యాప్‌ను (UPI payments app) తీసుకొస్తోందని తెలిసింది. థర్డ్ పార్టీ పేమెంట్స్ సర్వీస్ ప్రొవైడర్ కేటగిరీ కింద జాతీయ చెల్లింపుల కార్పొరేషన్ (National Payments Corporation of India - NPCI) క్లియరెన్స్ ఇచ్చిందని సమాచారం.
టాటా డిజిటల్ కామర్స్ యూనిట్ అయిన 'టాటా డిజిటల్' (Tata Digital) తమ యూపీఐ చెల్లింపుల కోసం ఐసీఐసీఐ బ్యాంకును (ICICI Bank) సంప్రదించింది. మరో ప్రైవేటు బ్యాంకును అదనపు బ్యాంకింగ్ భాగస్వామిగా తీసుకొనేందుకు చర్చలు జరుపుతోంది. థర్డ్‌పార్టీ యాప్స్‌లు యూపీఐ పేమెంట్స్ సేవలు అందించాలంటే బ్యాంకులతో ఒప్పందాలు అవసరం. ఫోన్‌పే, గూగుల్ పే వంటివి ఇప్పటికే చాలా బ్యాంకులతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ప్రస్తుతం భారత్‌లో ఫోన్‌పే, గూగుల్‌పేకు యూపీఐ మార్కెట్లో ఎక్కువ వాటా ఉంది. అమెజాన్ పే, పేటీఎం, వాట్సాప్ పేకు కూడా ఆదరణ లభిస్తోంది.
టాటా యూపీఐ పే యాప్ వచ్చే నెలలో మార్కెట్లో విడుదల అవుతుందని తెలుస్తోంది. ఐపీఎల్ సమయంలోనే దీనికి విస్తృత ప్రచారం కల్పించాలనీ అనుకుంటున్నట్టు తెలిసింది. అంతేకాకుండా ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న టాటా న్యూ సూపర్ యాప్ (Tata Neu super app)ను మార్కెట్లోకి తీసుకురానుంది. దాంతో యూపీఐ పేమెంట్స్ (UPI payments) మరింతగా పెరుగుతాయని భావిస్తోంది. వీటితో పాటు 'టాటా ఫిన్‌టెక్'ను కూడా మొదలు పెట్టి ఫైనాన్షియల్ ప్రొడక్టులను అమ్మాలని వ్యూహం పెట్టుకున్నట్టు తెలిసింది.
Also Read: పెళ్లి ఖర్చులకు పీఎఫ్ డబ్బు కావాలా? సింపుల్‌గా ఆన్‌లైన్‌లో ఇలా అప్లై చేయండి!
Also Read: ఉద్యోగులకు గుడ్‌న్యూస్! 3 శాతం DA పెంచనున్న మోదీ సర్కార్!
Also Read: ఈ డేంజర్ వైరస్ మీ ఆండ్రాయిడ్ ఫోన్లో చొరబడిందంటే! డబ్బంతా మాయం!