అన్వేషించండి

Stocks To Watch 14 August 2023: ఇవాళ మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్‌' ONGC, ITC, Adani Ports

మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.

Stock Market Today, 14 August 2023: ఇవాళ (సోమవారం) ఉదయం 8.15 గంటల సమయానికి, గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 52 పాయింట్లు లేదా 0.27 శాతం రెడ్‌ కలర్‌లో 19,427 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.

ఇవాళ Q1 రిజల్ట్స్‌ ప్రకటించే కీలక కంపెనీలు: సైస్‌జెట్‌, ITC, దివీస్ ల్యాబ్స్, వొడాఫోన్ ఐడియా. ఈ స్టాక్స్‌ ఇవాళ మార్కెట్‌ ఫోకస్‌లో ఉంటాయి.

ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి: 

ONGC: 2023 జూన్‌ త్రైమాసికంలో ONGCకి ఏకీకృత నికర లాభం రూపంలో రూ. 14,134 కోట్లు మిగిలింది. కార్యకలాపాల ద్వారా వచ్చి ఆదాయం 10% తగ్గి రూ. 1.63 లక్షల కోట్లకు పరిమితమైంది.

పతంజలి ఫుడ్స్: ఈ ఏడాది ఏప్రిల్‌-జూన్‌ కాలంలో ఈ ఎఫ్‌ఎంజీసీ కంపెనీ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 64% తగ్గి రూ. 878 కోట్లకు పరిమితమైంది. అయితే, కంపెనీ ఆదాయం దాదాపు 8% పెరిగి రూ. 7,767 కోట్లకు చేరుకుంది.

పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్: దేశంలోని విద్యుత్‌ ప్రాజెక్టులకు ఫైనాన్స్‌ చేసే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌ (PFC), 1:4 నిష్పత్తిలో ఈక్విటీ షేర్ల బోనస్ జారీని ఆమోదించింది. అంటే, ఈ కంపెనీలో ప్రతి 4 షేర్లకు బదులు ఒక షేర్‌ను బోనస్‌గా జారీ చేస్తుంది. షేర్‌ ధర అదే నిష్పత్తిలో తగ్గుతుంది.

లుపిన్: మండిదీప్‌లోని లుపిన్ యూనిట్-2 తయారీ కేంద్రంలో USFDA GMP తనిఖీ విజయవంతంగా పూర్తయింది. USFDA ఒక్క అభ్యంతరం కూడా వ్యక్తం చేయలేదు.

అదానీ పోర్ట్స్: డెలాయిట్ హాస్కిన్స్ & సెల్స్ కంపెనీ అదానీ పోర్ట్స్ ఆడిటర్ పదవికి రాజీనామా చేసింది. ఆ కంపెనీ స్థానంలో MSKA & అసోసియేట్స్‌ను చట్టబద్ధమైన ఆడిటర్‌గా నియమించడానికి అదానీ పోర్ట్స్ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది.

క్రాంప్టన్: 2023-24 మొదటి త్రైమాసికంలో క్రాంప్టన్‌ రూ. 118 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. కార్యకలాపాల ద్వారా ఈ కంపెనీకి వచ్చిన ఆదాయం రూ. 1,877 కోట్లు.

PTC ఇండియా: జూన్ త్రైమాసికంలో PTC ఇండియా రూ. 130 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. కార్యకలాపాల ద్వారా రూ. 4,848 కోట్ల ఆదాయం వచ్చింది.

RVNL: Q1 FY24లో RVNL నికర లాభం రూ. 343 కోట్లుగా ఉంది. అదే కాలంలో కార్యకలాపాల ద్వారా రూ. 5,572 కోట్ల ఆదాయాన్ని సంపాదించింది.

JK సిమెంట్: ఏప్రిల్-జూన్ కాలానికి 115 కోట్ల రూపాయల నికర లాభాన్ని JK సిమెంట్ ప్రకటించింది. కార్యకలాపాల ద్వారా వచ్చిన రూ. 2,763 కోట్ల ఆదాయంపై ఈ లాభాన్ని మిగుల్చుకుంది.

టిమ్‌కెన్‌ ఇండియా: జంషెడ్‌పూర్ ప్లాంట్‌ను ఈ నెల 25 నుంచి వచ్చే నెల 3 వరకు టిమ్‌కెన్ ఇండియా మూసివేస్తుంది. డిమాండ్ తక్కువగా ఉండడంతో, డిమాండ్‌ను, ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకునే ప్లాన్‌లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది.

ఇది కూడా చదవండి: లక్ష రూపాయలను ఏడాదిలోనే రెండు లక్షలుగా మార్చిన మ్యాజిక్‌ స్టాక్‌ ఇది

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Mechanic Rocky Review - 'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
IND vs AUS 1st Test: ఆస్ట్రేలియాతో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌- ప్లేయింగ్ 11లో నితీశ్‌కు చోటు 
ఆస్ట్రేలియాతో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌- ప్లేయింగ్ 11లో నితీశ్‌కు చోటు 
Sabarimala Temple 18 Steps: శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Embed widget