Stocks to watch 13 February 2023: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి - అదానీ స్టాక్స్‌కు గేట్లెత్తేసిన NSE
మన స్టాక్ మార్కెట్ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
Stocks to watch today, 13 February 2023: ఇవాళ (సోమవారం) ఉదయం 7.45 గంటల సమయానికి, సింగపూర్ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్ (SGX Nifty Futures) 29 పాయింట్లు లేదా 0.17 శాతం రెడ్ కలర్‌లో 17,847 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్ మార్కెట్ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
డెలివెరీ: 2022 డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో, లాజిస్టిక్స్ కంపెనీ డెలివేరీ నికర నష్టం రూ.196 కోట్లకు పెరిగింది, గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ. 126 కోట్లుగా ఉంది. సమీక్ష కాల త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం 9% తగ్గి రూ. 1,823 కోట్లకు చేరుకుంది.
PB ఫిన్‌టెక్: 2022 అక్టోబర్- డిసెంబర్ కాలంలో నష్టాలు గణనీయంగా తగ్గింది, రూ. 87 కోట్లకు చేరింది. నాలుగో త్రైమాసికం (జనవరి- మార్చి) నాటికి EBITDA సానుకూలంగా మారుతుందని భావిస్తున్నట్లు PB ఫిన్‌టెక్ గైడెన్స్ ఇచ్చింది.
ఇన్ఫో ఎడ్జ్: డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో ఇన్ఫో ఎడ్జ్ రూ. 116 కోట్ల నికర నష్టాన్ని చవి చూసింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ. 4,601 కోట్ల లాభాన్ని ప్రకటించింది.
BHEL: పన్ను తర్వాతి లాభం సెప్టెంబర్ త్రైమాసికంలో నివేదించిన కేవలం రూ. 12 కోట్ల నుంచి డిసెంబర్ త్రైమాసికానికి 250% పెరిగింది. కార్యకలాపాల ద్వారా ఆదాయం గత ఏడాది ఇదే కాలంలో రూ. 5,136 కోట్లుగా ఉంటే, ఇప్పుడు స్వల్పంగా 2% పెరిగి రూ. 5,263 కోట్లకు చేరుకుంది.
అదానీ స్టాక్స్: అదనపు నిఘా చర్యల నుంచి అదానీ పోర్ట్స్ & స్పెషల్ ఎకనామిక్ జోన్, అంబుజా సిమెంట్స్‌ను NSE తొలగించింది. ఈ నెల ప్రారంభంలో, ఎక్స్ఛేంజ్ మూడు అదానీ గ్రూప్ స్టాక్స్‌ను ఫ్రేమ్‌వర్క్‌లో ఉంచింది, అవి – అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్, అంబుజా సిమెంట్స్. అధిక అస్థిరతను అరికట్టడానికి అదనపు నిఘా విధానం (ASM) కిందకు వాటిని స్టాక్స్‌ను NSE తీసుకొస్తుంది.
పేటీఎం: చైనాకు చెందిన అలీబాబా గ్రూప్, పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్‌లో 3.3% వాటాను శుక్రవారం ఓపెన్ మార్కెట్ ద్వారా విక్రయించింది, రూ. 1,378 కోట్లు వసూలు చేసింది. 2,14,31,822 షేర్లను ఒక్కొక్కటి రూ. 642.74 చొప్పున విక్రయించింది.
గ్లెన్‌మార్క్ ఫార్మా: 2022 డిసెంబర్ త్రైమాసికంలో రూ. 291 కోట్ల నికర లాభాన్ని గ్లెన్‌మార్క్ ఫార్మా ఆర్జించింది, గత ఏడాది ఇదే కాలంలో ఇది రూ. 240 కోట్లుగా ఉంది. ఈ త్రైమాసికంలో ఆదాయం రూ. 3,464 కోట్లుగా ఉంది.
బాలకృష్ణ ఇండస్ట్రీస్: డిసెంబర్ త్రైమాసికంలో రూ. 108 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది, గత ఏడాది ఇదే కాలంలో ఇది రూ. 339 కోట్లుగా ఉంది. ఈ త్రైమాసికంలో ఆదాయం రూ. 2,166 కోట్లుగా ఉంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.