Stock Market News: హడలెత్తిస్తున్న స్టాక్ మార్కెట్లు - రూ.5 లక్షల కోట్ల నష్టం!
Stock Market Closing Bell: భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో ఉన్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 16,385 వద్ద కొనసాగుతోంది. బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 900 పాయింట్ల నష్టాల్లో ఉంది.
Stock Market @ 12PM: భారత స్టాక్ మార్కెట్లు (Indian equity markets) శుక్రవారం భారీ నష్టాల్లో ఉన్నాయి. ఉదయం నుంచి సెల్లింగ్ ప్రెజర్ ఎక్కువగా ఉంది. దేశీయ, అంతర్జాతీయ ద్రవ్యోల్బణం పెరుగుదల, డిమాండ్ స్లపై మధ్య సమతూకం లేకపోవడం వంటివి మదుపర్ల సెంటిమెంటును దెబ్బతీస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 16,385 వద్ద కొనసాగుతోంది. బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 900 పాయింట్ల నష్టాల్లో ఉంది. ఇన్వెస్టర్లు దాదాపుగా రూ.5 లక్షల కోట్ల సంపదను నష్టపోయారు.
BSE Sensex
క్రితం సెషన్లో 55,702 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 54,928 వద్ద భారీ నష్టాల్లో మొదలైంది. ఉదయం నుంచే అమ్మకాల ఒత్తిడి కనిపించింది. 55,079 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత 54,586 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. ప్రస్తుతం 905 పాయింట్ల నష్టంతో 54,797 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty
గురువారం 16,682 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 16,415 వద్ద ఓపెనైంది. ఉదయం నుంచి నష్టాల్లోనే కదలాడుతోంది. 16,482 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని చేరుకుంది. అమ్మకాల సెగతో 16,340 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. మధ్యాహ్నం 296 పాయింట్ల నష్టంతో 16,385 వద్ద కొనసాగుతోంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ నష్టాల్లో ట్రేడ్ అవుతోంది. ఉదయం 34,569 వద్ద మొదలైంది. 34,353 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 34,724 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం సెల్లింగ్ ప్రెజర్ వల్ల 671 పాయింట్ల నష్టంతో 34,561 వద్ద కదలాడుతోంది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 7 కంపెనీలు లాభపడగా 43 నష్టాల్లో ఉన్నాయి. హీరో మోటోకార్ప్, ఐటీసీ, బ్రిటానియా, బజాజ్ ఆటో, ఎన్టీపీసీ లాభాల్లో ఉన్నాయి. హిందాల్కో, యూపీఎల్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అన్ని రంగాల సూచీలు ఎరుపెక్కాయి. మెటల్ ఏకంగా 4 శాతం, ఐటీ సూచీ 2.5 శాతం పతనమయ్యాయి. స్మాల్ క్యాప్, మిడ్‌క్యాప్ పరిస్థితీ అలాగే ఉంది.
View this post on Instagram