By: ABP Desam | Updated at : 27 Apr 2022 12:42 PM (IST)
Edited By: Ramakrishna Paladi
స్టాక్ మార్కెట్ అప్డేట్,
Stock Market @12 PM: భారత స్టాక్ మార్కెట్లు (Indian equity markets) బుధవారం భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఆసియా మార్కెట్లు నష్టాల్లో ట్రేడవ్వడం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం భయాలు ఇంకా వెంటాడుతున్నాయి. కంపెనీ ఆదాయాలు ఆశించన రీతిలో లేకపోవడం మదుపర్ల సెంటిమెంటును దెబ్బతీసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 17,035 వద్ద ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 496కి పైగా నష్టాల్లో ఉంది.
BSE Sensex
క్రితం సెషన్లో 57,356 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 56,983 వద్ద నష్టాల్లో మొదలైంది. ఉదయం నుంచే ఫ్లాట్‌గా కొనసాగింది. 57,079 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. 56,795 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. ప్రస్తుతం 496 పాయింట్ల నష్టంతో 56,860 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty
మంగళవారం 17,200 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 17,073 వద్ద ఓపెనైంది. కొనుగోళ్ల మద్దతు లభించకపోవడంతో ఉదయం నుంచి సూచీ నష్టాల్లోనే కదలాడింది. 17,110 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని చేరుకుంది. 17,016 వద్ద ఇంట్రాడే కనిష్ఠానికి తాకింది. ప్రస్తుతం 165 పాయింట్ల నష్టంతో 17,035 వద్ద ట్రేడ్ అవుతోంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ నష్టాల్లో ట్రేడ్ అవుతోంది. ఉదయం 36,967 వద్ద మొదలైంది. 36,901 ఇద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 36,175 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 453 పాయింట్ల లాభంతో 35,951 వద్ద ముగిసింది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 6 కంపెనీలు లాభపడగా 44 నష్టాల్లో కొనసాగుతున్నాయి. హీరోమోటోకార్ప్, రిలయన్స్, ఏసియన్ పెయింట్స్, కొటక్ బ్యాంక్, బజాజ్ ఆటో లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, హిందాల్కో, ఎస్‌బీఐ లైఫ్, యాక్సిస్ బ్యాంక్ నష్టాల్లో ఉన్నాయి. ఐటీ, మెటల్, ఫార్మా, ఆయిల్ అండ్ గ్యాస్, బ్యాంక్, రియాల్టీ, ఎఫ్‌ఎంసీజీ ఒక శాతం వరకు నష్టపోయాయి.
Top Gainer May 22, 2022 : స్టాక్ మార్కెట్లో సెన్సెక్స్, నిఫ్టీ టాప్ గెయినర్స్
Top Loser Today May 22, 2022 స్టాక్ మార్కెట్ సెన్సెక్స్, నిఫ్టీ టాప్ లాసర్స్ జాబితా
Petrol-Diesel Price, 25 May: వాహనదారులకు శుభవార్త! నేడు దిగివచ్చిన పెట్రోల్ ధరలు, ఈ సిటీలో మాత్రం స్థిరం
Gold-Silver Price: నేడు మళ్లీ పసిడి ధర షాక్! ఊహించనట్లుగా పెరిగిన బంగారం, వెండి మాత్రం కిందికి
Delhivery Listing Price: డెల్హీవరీ లిస్టింగ్ ప్రీమియం తక్కువే! ముగింపులో రూ.49 లాభం
Hyderabad: రేపు Hydకి ప్రధాని మోదీ, ఈ రూట్లో ట్రాఫిక్ అనుమతించరు! ప్రత్యామ్నాయ మార్గాలు ఇవీ
Amalapuram: ఇది ఆంధ్రానా? పాకిస్థానా? అంబేడ్కర్‌పై అంత ప్రేమ ఉంటే నవరత్నాలకు పెట్టుకోండి: జీవీఎల్
Mahesh Babu Trivikram Movie Update: మహేష్ బాబు సినిమాకూ త్రివిక్రమ్ 'అ' సెంటిమెంట్‌తో వెళతారా?
Karimnagar: టెన్త్ ఎగ్జామ్స్‌కి ఫుల్లుగా తాగొచ్చిన టీచర్, తూలుతూనే ఇన్విజిలేషన్ - బ్రీత్ అనలైజర్ టెస్ట్‌లో రీడింగ్ చూసి అంతా షాక్!