By: ABP Desam | Updated at : 11 Feb 2022 04:09 PM (IST)
Edited By: Ramakrishna Paladi
స్టాక్ మార్కెట్
Stock Market Update Telugu: భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం విలవిల్లాడాయి. అమెరికాలో ద్రవ్యోల్బణం 40 ఏళ్ల గరిష్ఠానికి చేరుకోవడం, యూఎస్ ఫెడ్ వడ్డీరేట్ల పెంపు వార్తలతో సూచీలు వేగంగా పతనమయ్యాయి. మూడు రోజుల లాభాలను హరించాయి. ఒకానొక దశలో దాదాపుగా వెయ్యి పాయింట్ల మేర పనతమైన సెన్సెక్స్ ఆ తర్వాత కాస్త కోలుకుంది. నిఫ్టీ 17,400 దిగువన ముగిసింది.
క్రితం రోజు 58,926 వద్ద ముగిసిన సెన్సెక్స్ నేడు 58,447 వద్ద భారీ గ్యాప్‌డౌన్‌తోనే మొదలైంది. అమెరికా ద్రవ్యోల్బణం గురించి తెలియడంతో ఆందోళనకు గురైన మదుపర్లు విక్రయాలు చేపట్టారు. దాంతో సూచీ 57,914 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. ఆ తర్వాత కోలుకొని 58,447 వద్ద గరిష్ఠ స్థాయిని అందుకుంది. మొత్తంగా 773 పాయింట్లు నష్టపోయి 58,152 వద్ద ముగిసింది.
గురువారం 17,607 వద్ద ముగిసిన నిఫ్టీ శుక్రవారం 17,451 వద్ద మొదలైంది. విక్రయాల వెల్లువతో 17,303 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. ఆపై కాస్త కోలుకొని 17,454 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. దాదాపు 300 పాయింట్ల మేర పతనమైన సూచీ మళ్లీ కోలుకొని 231 పాయింట్ల నష్టంతో 17,374 వద్ద కొనసాగుతోంది.
బ్యాంకు నిఫ్టీ సైతం ఒడుదొడుకుల మధ్య సాగింది. 38,567 వద్ద ఆరంభమైన సూచీ 38,396 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. ఆ తర్వాత 38,790 వద్ద గరిష్ఠ స్థాయిని చేరుకుంది. చివరికి 494 పాయింట్ల నష్టంతో 38,517 వద్ద ముగిసింది.
నిఫ్టీలో 45 కంపెనీల షేర్లు నష్టాల్లో, 5 లాభాల్లో ముగిశాయి. ఐఓసీ, ఇండస్‌ఇండ్ బ్యాంక్, బీపీసీఎల్, టాటా స్టీల్, ఎన్‌టీపీసీ స్వల్ప లాభాల్లో ముగిశాయి. గ్రాసిమ్, ఇన్ఫీ, బ్రిటానియా, నెస్లే ఇండియా, టెక్ మహీంద్రా, యూపీఎల్, హెచ్‌సీఎల్ టెక్ నష్టాల్లో ముగిశాయి. ఐటీ, స్థిరాస్తి సూచీలు 2 శాతం వరకు, ఆటో, క్యాపిటల్ గూడ్స్, బ్యాంక్, ఎఫ్‌ఎంసీజీ సూచీలు ఒక శాతం వరకు పతనం అయ్యాయి.
Also Read: క్రిప్టో కరెన్సీపై RBI అప్‌డేట్! శక్తికాంత దాస్‌ది మళ్లీ మళ్లీ అదే మాట!
Also Read: స్టాక్ మార్కెట్లో ఎల్‌ఐసీ పెట్టుబడి విలువ రూ.10 లక్షల కోట్లు- ఒక్క రిలయన్స్‌లోనే రూ.లక్ష కోట్లు
Petrol-Diesel Price, 25 May: వాహనదారులకు శుభవార్త! నేడు దిగివచ్చిన పెట్రోల్ ధరలు, ఈ సిటీలో మాత్రం స్థిరం
Gold-Silver Price: నేడు మళ్లీ పసిడి ధర షాక్! ఊహించనట్లుగా పెరిగిన బంగారం, వెండి మాత్రం కిందికి
Delhivery Listing Price: డెల్హీవరీ లిస్టింగ్ ప్రీమియం తక్కువే! ముగింపులో రూ.49 లాభం
Stock Market News: ఆరంభ లాభాలు ఆవిరి! రేంజ్బౌండ్లో కదలాడిన సూచీలు చివరికి..!
Cryptocurrency Prices Today: భారీ నష్టాల్లో క్రిప్టోలు! బిట్కాయిన్ @ రూ.24.20 లక్షలు
Konaseema District: నిఘా నీడలో కోనసీమ జిల్లా- అమలాపురంలో కొనసాగుతున్న కర్ఫ్యూ
Weather Updates: నేడు ఈ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు, ఉష్ణోగ్రత 4 డిగ్రీలదాకా ఎక్కువ నమోదయ్యే ఛాన్స్!
Konaseema Police Intelligence Failure : మరోసారి ఏపీ పోలీస్ ఇంటలిజెన్స్ ఫెయిల్ అయిందా ! కోనసీమ ఆందోళనలను లైట్ తీసుకున్నారా ?
Horoscope Today 25th May 2022: ఈ రాశివారికి కుటుంబంతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి