Multibaggers: ఈ షేర్లకు డబ్బులు కాశాయి, మూడున్నర నెలల్లోనే మల్టీబ్యాగర్ రిటర్న్స్
2023లో ఇప్పటి వరకు (YTD), 18 కౌంటర్లు కనీసం 50% లాభాలను తెచ్చిచ్చాయి, వాటిలో నాలుగు మల్టీబ్యాగర్‌లుగా మారాయి.
Stock Market Tips: గ్లోబల్‌గా స్థూల ఆర్థిక నష్టాల ప్రభావంతో సతమతం అవుతున్న దలాల్ స్ట్రీట్, 2023 సంవత్సరంలో చేదు జ్ఞాపకాలతో ప్రారంభమైంది. అదానీ గ్రూప్ స్టాక్స్‌లో భారీ అమ్మకాలు ఇన్వెస్టర్ల వేదనను మరింత పెంచాయి. ఎన్ని కష్టాలు ఎదురైనా.. కొన్ని మొండి కంపెనీలు మాత్రం బెంచ్‌మార్క్ ఇండెక్స్‌ను అతి భారీ తేడాతో అధిగమించాయి. వాటిలోనే కొన్ని ఈ సంవత్సరంలో (మూడున్నర నెలల్లో) మల్టీబ్యాగర్‌లుగా (multibagger stocks) మారాయి.
డేటా ప్రకారం... 2023లో ఇప్పటి వరకు (YTD), 18 కౌంటర్లు కనీసం 50% లాభాలను తెచ్చిచ్చాయి, వాటిలో నాలుగు మల్టీబ్యాగర్‌లుగా మారాయి. ఈ లిస్ట్ నుంచి, మార్కెట్ విలువ (market capitalisation) రూ. 500 కోట్ల కంటే ఎక్కువ ఉన్న కంపెనీలను మాత్రమే షార్ట్‌లిస్ట్ చేయడం జరిగింది.
ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు చూస్తే, బెంచ్‌మార్క్ ఇండెక్స్ నిఫ్టీ50 1% పైగా నష్టపోయింది. విదేశీ సంస్థాగత పెట్టుబడిదార్ల (FIIs) నుంచి మన మార్కెట్‌లోకి వచ్చిన 1 బిలియన్ డాలర్ల వల్ల వరుసగా గత ఎనిమిది సెషన్లు లాభాల్లో ఉన్నాయి, నిఫ్టీ50 నష్టాలు బాగా తగ్గాయి.
ఈ సంవత్సరం స్టెల్లార్ రిటర్న్స్ ఇచ్చిన స్టాక్స్.. ఫినోలెక్స్ కేబుల్స్, సిగ్నిటీ టెక్నాలజీస్, జిందాల్ సా, సొనాటా సాఫ్ట్‌వేర్, స్టెర్లింగ్ టూల్స్, న్యూక్లియస్ సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పోర్ట్స్, షిల్చార్ టెక్నాలజీస్, గోయల్ అల్యూమినియమ్స్. ఇవి, YTD 50-85 శాతం వరకు పెరిగాయి. ఇవి కాక... మోల్డ్-టెక్ టెక్నాలజీస్, WPIL లిమిటెడ్, EFC (I), K&R రైల్ ఇంజనీరింగ్ షేర్లు మల్టీబ్యాగర్లుగా మారాయి, 100-500 శాతం పెరిగాయి.
ఈ ఏడాదిలో ఇప్పటి వరకు తారస్థాయి ప్రదర్శన చేసిన టాప్-10 స్టాక్స్:
కంపెనీ పేరు: కే&ఆర్ రైల్ ఇంజినీరింగ్ (K&R Rail Engineering)
YTD పనితీరు: 497%
కంపెనీ పేరు: ఈఎఫ్‌సీ (ఐ) లిమిటెడ్ (EFC (I) Ltd)
YTD పనితీరు: 152%
కంపెనీ పేరు: డబ్ల్యూపీఐఎల్ లిమిటెడ్ (WPIL Ltd)
YTD పనితీరు: 128%
కంపెనీ పేరు: మోల్డ్-టెక్ టెక్నాలజీస్ (Mold-Tek Technologies)
YTD పనితీరు: 103%
కంపెనీ పేరు: గోయల్ అల్యూమినియమ్స్ (Goyal Aluminiums)
YTD పనితీరు: 86%
కంపెనీ పేరు: వారీ రెన్యూవబుల్ టెక్ (Waaree Renewable Tech)
YTD పనితీరు: 86%
కంపెనీ పేరు: షిల్చార్ టెక్నాలజీస్ (Shilchar Technologies)
YTD పనితీరు: 80%
కంపెనీ పేరు: ప్రవేగ్ (Praveg)
YTD పనితీరు: 74%
కంపెనీ పేరు: న్యూక్లియస్ సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పోర్ట్స్ (Nucleus Software Exports)
YTD పనితీరు: 72%
కంపెనీ పేరు: మగెల్లానిక్ క్లౌడ్ (Magellanic Cloud)
YTD పనితీరు: 66%
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.