Multibaggers: FY23లో ముంచాయి, FY24లో రెండింతలు పెంచాయి - లాంగ్ హోల్డింగ్‌తో లాభం ఇదే
FY23లో 40% పైగా నష్టాలు చూపించిన అవే కౌంటర్లు, FY24లో మల్టీబ్యాగర్స్‌గా మారాయి.
Multibagger Returns: కార్పొరేట్ కంపెనీలకు, స్టాక్ మార్కెట్‌లకు FY23 చాలా సవాళ్లు విసిరింది. FY24 మాత్రం సానుకూలంగా స్టార్టయింది, చాలా స్టాక్స్‌ను బుల్లిష్‌గా మార్చింది.
మినిమమ్ రూ.500 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న 11 స్టాక్స్ FY23లో కనీసం 40% పైగా నష్టాలు పాలై, ఇన్వెస్టర్ల డబ్బును హారతి కర్పూరం చేశాయి. ఆ నష్టాలు భరించలేక, ఇంకా పడతాయేమోనన్న భయంతో చాలా మంది వాటి నుంచి ఎగ్జిట్ తీసుకున్నారు. మరికొందరు మాత్రం, ఏ నమ్మకంతో ఆ షేర్లను కొన్నారో అదే నమ్మకానికి కట్టుబడి వాటిని హోల్డ్ చేశారు. అలా హోల్డ్ చేసిన వాళ్లంతా మార్కెట్ పరీక్షలో పాస్ అయ్యారు.
FY23లో 40% పైగా నష్టాలు చూపించిన అవే కౌంటర్లు, FY24లో మల్టీబ్యాగర్స్‌గా మారాయి, ఇన్వెస్టర్ల మీద డబ్బుల వర్షం కురిపించాయి.
FY23లో లూజర్స్ - FY24 మల్టీబ్యాగర్స్:
- FY23లో 52% పడిపోయిన నియోగిన్ ఫిన్‌టెక్ షేర్లు, ఆ గ్యాప్‌ను ఫిల్ చేయడంతో పాటు FY24లో 167% పైకి లేచాయి.
- బాంబే డైయింగ్ విషయానికి వస్తే.. FY23లో 42% పైగా క్షీణించిన ఈ గార్మెంట్స్ స్టాక్, FY24లో ఇప్పటి వరకు భారీగా 166% ర్యాలీ చేసింది.
- గ్రానైట్ తయారీ కంపెనీ పోకర్ణ FY23లో షార్ప్‌గా 67% కరెక్షన్‌కు గురైంది, తర్వాత, FY24లో 137% కంటే ఎక్కువే రికవర్ అయింది.
- రతన్ ఇండియా పవర్ 2022-23 కాలంలో 45% పడిపోయింది, 2023-24లో ఇప్పటి వరకు 125% పెరిగింది.
- కోప్రాన్ కౌంటర్ FY23లో 61% లాసెస్‌ను భరిస్తే, FY24లో 120% ప్రాఫిట్స్‌ను కళ్లజూసింది.
- గత ఫైనాన్షియల్ ఇయర్‌లో 48% పడిపోయిన కెల్టన్ టెక్ సొల్యూషన్స్, అక్కడి నుంచి పుంజుకుని ప్రస్తుత ఫైనాన్షియల్ ఇయర్‌లో 118% పైకి ఎగబాకాయి.
- హిమత్సింక సెయిడ్ స్క్రిప్ FY23లో 54% నెగెటివ్ రిటర్న్స్ ఇచ్చినా, FY24లో 116 పాజిటివ్ రిటర్న్స్‌తో మల్టీబ్యాగర్స్‌లో చోటు సంపాదించింది.
- GMR గ్రూప్‌లోని GMR పవర్ & అర్బన్ ఇన్‌ఫ్రా షేర్లు గడిచిన ఆర్థిక సంవత్సరంలో 51% నష్టపోతే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 116 లాభపడ్డాయి.
- గత ఆర్థిక సంవత్సరంలో 76% నష్టపోయిన జ్యోతి స్ట్రక్చర్స్ షేర్లు, ఈ ఆర్థిక సంవత్సరంలో రెండింతలై 104% పెరిగాయి.
- ఆర్ట్సన్ ఇంజినీరింగ్ కౌంటర్ FY23లో 43% నష్టాలను కళ్లజూస్తే, FY24లో ఇప్పటి వరకు 104% లాభాలను మూటగట్టుకుంది.
ప్రస్తుత మార్కెట్‌లో ర్యాలీ బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లను జీవితకాల గరిష్ట స్థాయులకు తీసుకెళ్లింది. మార్చి నుంచి, మిడ్‌క్యాప్ & స్మాల్‌క్యాప్ సెగ్మెంట్లు లార్జ్ క్యాప్ స్టాక్స్‌ను ఓవర్‌టేక్ చేశాయి. ఈ వారం ప్రారంభంలో, నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 ఇండెక్స్ మొదటిసారిగా కీలకమైన 40,000 మార్క్‌ను దాటింది. నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 ఇండెక్స్ కూడా దాని జీవితకాల గరిష్ట స్థాయిని టెస్ట్ చేసింది.
మిడ్‌క్యాప్ & స్మాల్‌క్యాప్ సూచీలు వరుసగా 6వ నెలలోనూ 34% & 41% లాభపడ్డాయి.
మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ కూడా గత 4-5 నెలల్లో స్మాల్‌క్యాప్ & మిడ్‌క్యాప్ ఫండ్స్‌లో బలమైన ఇన్‌ఫ్లోస్ చూసింది. లార్జ్‌క్యాప్ ఫండ్స్‌తో పోలిస్తే, ఈ రెండు విభాగాల్లో రిటైల్ ఆసక్తి బలంగా ఉంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial