అన్వేషించండి

Share Market Opening 20 Sept 2024: సెన్సెక్స్‌ 500pts జంప్‌, 25500 పైన నిఫ్టీ - మెటల్‌ స్టాక్స్‌లో మెరుపులు

Share Market Open Today: యుఎస్ స్టాక్ మార్కెట్లలో లాభాలు ఈ రోజు భారతదేశంలోని మార్కెట్లను నడిపించాయి. శుక్రవారం మన మార్కెట్లు హైయ్యర్‌ లెవల్స్‌లో ప్రారంభమయ్యాయి.

Stock Market News Updates Today in Telugu: గ్లోబల్ మార్కెట్ నుంచి లభిస్తున్న మద్దతుతో భారతీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు (శుక్రవారం, 20 సెప్టెంబర్‌ 2024) బుల్లిష్‌గా ప్రారంభమయ్యాయి. కన్జ్యూమర్‌ డ్యూరబుల్స్‌ తప్ప అన్ని సెక్టార్లు ఈ రోజు పచ్చగా కళకళలాడుతున్నాయి.

ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది..

గత సెషన్‌లో (గురువారం) 83,185 దగ్గర క్లోజ్‌ అయిన BSE సెన్సెక్స్‌, ఈ రోజు 421 పాయింట్లు లేదా 0.51 శాతం పెరిగి 83,603.04 దగ్గర (BSE Sensex Opening Today) ఓపెన్‌ అయింది. గురువారం 25,416 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 112 పాయింట్లు లేదా 0.44 శాతం పెరిగి 25,525.95 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది.

నేటి ట్రేడ్‌లోనూ (ఉదయం 10.10 గంటల సమయానికి) BSE సెన్కెక్స్‌ కదం తొక్కింది, 83,805.26 వద్ద లైఫ్‌ టైమ్‌ హైని ‍(Sensex at fresh all-time high) రికార్డ్‌ చేసింది. NSE నిఫ్టీ, 25,611.95 వద్దవున్న జీవితకాల గరిష్టాన్ని (Nifty at fresh all-time high) బ్రేక్‌ చేయడానికి కేవలం 1 పాయింట్‌ దూరంలో, 25,610.10 వద్ద ఉంది. 

ఉదయం 9:20 గంటలకు, సెన్సెక్స్ లాభం 175 పాయింట్లకు తగ్గింది, 83,370 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 50 సూచీ దాదాపు 80 పాయింట్ల లాభంతో 25,500 పాయింట్లకు చేరువలో ఉంది.

ప్రారంభ ట్రేడింగ్‌లో మెటల్‌ స్టాక్స్‌ మెరిశాయి. JSW స్టీల్ షేర్లు దాదాపు 4 శాతం జంప్‌తో సెన్సెక్స్‌లో ముందంజలో ఉన్నాయి. టాటా స్టీల్, మహీంద్రా & మహీంద్రా వంటి షేర్లు కూడా తలో 1% పైగా పెరిగాయి. మరోవైపు... యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్, టైటాన్ వంటి షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

ఉదయం 10.15 గంటలకు, BSE సెన్సెక్స్ 412.73 పాయింట్లు లేదా 0.50% పెరిగి 83,597.53 వద్ద ట్రేడవుతోంది. అదే సమయానికి NSE నిఫ్టీ కూడా 134.80 పాయింట్లు లేదా 0.53% లాభంతో 25,550.60 దగ్గర ట్రేడవుతోంది.

ప్రి మార్కెట్‌
దేశీయ మార్కెట్‌లో ట్రేడింగ్ ప్రారంభానికి ముందే బుల్లిష్‌నెస్ కొనసాగే సూచనలు కనిపించాయి. ప్రి-ఓపెన్ సెషన్‌లో, సెన్సెక్స్ సుమారు 420 పాయింట్ల లాభంతో 83,600 పాయింట్ల పైన ట్రేడయింది. నిఫ్టీ 110 పాయింట్ల లాభంతో 25,525 పాయింట్లకు మించి ట్రేడయింది. ఉదయం మార్కెట్ ప్రారంభానికి ముందు, GIFT సిటీలో నిఫ్టీ ఫ్యూచర్స్ సుమారు 35 పాయింట్ల ప్రీమియంతో 25,525 పాయింట్ల వద్ద కొనసాగింది.

వడ్డీరేట్ల తగ్గింపుతో మెరుపులు
గురువారం US మార్కెట్ గట్టిగా పెరిగింది, ప్రధాన సూచీలు కొత్త గరిష్టాలను చేరుకున్నాయి. వాల్ స్ట్రీట్‌లో.. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 1.26 శాతం లాభంతో 42,025.19 పాయింట్ల వద్ద ముగిసింది. డౌజోన్స్ చరిత్రలో తొలిసారిగా 42 వేల పాయింట్లపైన క్లోజయింది. S&P 500 ఇండెక్స్‌లో 1.7 శాతం, టెక్-ఫోకస్డ్ ఇండెక్స్ నాస్‌డాక్‌లో 2.51 శాతం అద్భుతమైన పెరుగుదల ఉంది. S&P500 ఇండెక్స్ నిన్న తొలిసారిగా 5,700 పాయింట్లను దాటింది.

యూఎస్‌ మార్కెట్లు ఇచ్చిన సపోర్ట్‌తో ఈ రోజు ఆసియా మార్కెట్లు కూడా చెలరేగాయి. జపాన్ నికాయ్‌ 1.9 శాతం భారీ లాభంతో, టోపిక్స్ ఇండెక్స్ 1.63 శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. దక్షిణ కొరియా కోస్పి 1.45 శాతం, కోస్‌డాక్ 1.51 శాతం చొప్పున పెరిగాయి. 

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ustad Zakir Hussain Passed Away: తబలా వాద్యకారుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత, అమెరికాలో దిగ్గజం అస్తమయం
తబలా వాద్యకారుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత, అమెరికాలో దిగ్గజం అస్తమయం
Bigg Boss 8 Telugu Winner: బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్ ఫిక్స్ - ఇంతకీ గెలిచింది ఎవరు?
బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్ ఫిక్స్ - ఇంతకీ గెలిచింది ఎవరు?
Allu Arjun: శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
Best Chess Apps: ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!చంద్రబాబును ఫోటో అడిగిన బాలిక, వచ్చేయమన్న సీఎం-అంతా షాక్వీడియో: మహిళపై చిరుతపులి దాడి, ముఖమంతా రక్తం!నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ustad Zakir Hussain Passed Away: తబలా వాద్యకారుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత, అమెరికాలో దిగ్గజం అస్తమయం
తబలా వాద్యకారుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత, అమెరికాలో దిగ్గజం అస్తమయం
Bigg Boss 8 Telugu Winner: బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్ ఫిక్స్ - ఇంతకీ గెలిచింది ఎవరు?
బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్ ఫిక్స్ - ఇంతకీ గెలిచింది ఎవరు?
Allu Arjun: శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
Best Chess Apps: ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
TSPSC Group 2 Exam: సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తూ దొరికిన అభ్యర్థి, ఇన్విజిలేటర్ షాక్!
సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తూ దొరికిన అభ్యర్థి, ఇన్విజిలేటర్ షాక్!
Manchu Manoj Vs Manchu Vishnu: మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
YSRCP On One Nation One Election: 2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
Telangana Latest News : తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
Embed widget