అన్వేషించండి

Share Market Today: ఫెడ్ భేటీకి ముందు స్టాక్‌ మార్కెట్లలో నత్తనడక - ఫ్లాట్‌ స్టార్టింగ్‌

Share Market Open Today: ఐటీ షేర్లలో టీసీఎస్, ఆటో షేర్లలో మారుతీ పడిపోవడంతో నేటి ఓపెనింగ్‌లో స్టాక్ మార్కెట్ పూర్తిగా ఫ్లాట్‌గా కనిపిస్తోంది.

Stock Market News Updates Today in Telugu: ఐటీ, ఆటో సెక్టార్‌ షేర్లు డీలా పడడంతో ఈ రోజు (మంగళవారం, 17 సెప్టెంబర్‌ 2024) ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్లు పూర్తిగా ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. ప్రారంభమైన తర్వాత కూడా నత్తనడకన నడుస్తున్నాయి. NSE నిఫ్టీ నిన్నటి క్లోజింగ్‌ మార్క్‌కు పైకి, కిందకు కదులుతూ కాసేపు రెడ్‌గా, మరికాసేపు గ్రీన్‌గా మారుతోంది. ప్రపంచ మార్కెట్ల గమనాన్ని నిర్దేశించే యూఎస్‌ ఫెడ్‌ సమావేశం ఈ రోజు (అమెరికా కాలమానం ప్రకారం) ప్రారంభమవుతుంది, నిర్ణయాలు రేపు వెలువడతాయి. 

ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది..

గత సెషన్‌లో (సోమవారం) 82,989 దగ్గర క్లోజ్‌ అయిన BSE సెన్సెక్స్‌, ఈ రోజు 95 పాయింట్ల పెరుగుదలతో 83,084.63 దగ్గర (BSE Sensex Opening Today) ఓపెన్‌ అయింది. సోమవారం 25,384 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 33 పాయింట్ల పెరుగుదలతో 25,416.90 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది. 

టాటా మోటార్స్‌ షేర్లలో బ్లాక్ డీల్
టాటా మోటార్స్‌లో బ్లాక్ డీల్ జరిగింది, మార్కెట్ ప్రారంభమైన వెంటనే 85 లక్షల షేర్లు చేతులు మారాయి. భారీ డీల్ కారణంగా ఇన్వెస్టర్లు, ట్రేడర్లు టాటా మోటార్స్‌ షేర్ల మీద ఒక కన్ను వేసి ఉంచాలి. 

బజాజ్ హౌసింగ్‌ ఫైనాన్స్‌లో ఈ రోజు కూడా బూమ్
బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్‌ షేర్లు ర్యాలీని కంటిన్యూచేస్తున్నాయి, మార్కెట్‌ ప్రారంభంలోనే 3.84 కోట్ల షేర్ల కోసం ఒప్పందాలు జరిగాయి. మార్కెట్ ప్రారంభ సమయానికి ట్రేడ్ విలువ భారీగా రూ.6.91 కోట్లుగా కనిపిస్తోంది. 10 శాతం పెరిగిన ఈ స్టాక్‌ అప్పర్ సర్క్యూట్‌లో లాక్‌ అయింది.

సెన్సెక్స్ షేర్ల పరిస్థితి
సెన్సెక్స్‌లో బుల్స్‌-బేర్స్‌కు సమాన పోటీ నెలకొంది. 30 స్టాక్స్‌లో 15 పెరిగితే మిగిలిన 15 స్టాక్స్‌ తగ్గాయి. ఈ రోజు 83,084.63 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్‌, దాని లైఫ్‌టైమ్‌ హై అయిన 83,128.78కి దగ్గరలో కదులుతోంది.

నిఫ్టీ షేర్ల పరిస్థితి
నిఫ్టీ 50 ప్యాక్‌లోని 28 స్టాక్స్‌ క్షీణించగా, 22 స్టాక్స్ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఈ రోజు 25,416.90 వద్ద ప్రారంభమైన నిఫ్టీ, దాని జీవితకాల గరిష్ట స్థాయి అయిన 25,445.70కు అతి చేరువలో ట్రేడవుతోంది.

అదానీ షేర్లు
గౌతమ్ అదానీకి చెందిన కంపెనీల షేర్లు ఈ రోజు మిక్స్‌డ్‌ బిజినెస్‌ను చూస్తున్నాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో కొంత సందడి కనిపిస్తున్నప్పటికీ, నిన్నటి బుల్లిష్‌నెస్‌ తర్వాత ఈ రోజు అలసిపోయినట్లుంది. మిగిలిన షేర్లు కూడా పెద్దగా ఉత్సాహంగా లేవు.

సెక్టార్ల వారీగా చూస్తే, ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్స్‌ సెక్టార్‌లో కొంత వృద్ధి కనిపిస్తోంది.

ఈ రోజు ఉదయం 10.15 గంటలకు, BSE సెన్సెక్స్ 56.50 పాయింట్లు లేదా 0.06% తగ్గి 82,932.28 వద్ద ట్రేడవుతోంది. అదే సమయానికి NSE నిఫ్టీ కూడా 12.05 పాయింట్లు లేదా 0.04% పడిపోయి 25,371.70 దగ్గర ట్రేడవుతోంది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: హరికేన్‌ ప్రభావంతో పెరిగిన చమురు రేట్లు - మీ ప్రాంతంలో ఈ రోజు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇవి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News: 'ఆ వదంతులు నమ్మొద్దు' - ఫ్యామిలీ డిజిటల్ కార్డుల దరఖాస్తులపై ప్రభుత్వం కీలక ప్రకటన
'ఆ వదంతులు నమ్మొద్దు' - ఫ్యామిలీ డిజిటల్ కార్డుల దరఖాస్తులపై ప్రభుత్వం కీలక ప్రకటన
AP Liquor Shops : ఏపీలో మద్యం దుకాణాల కోసం లేని స్పందన - రింగ్ అయిపోయారా ? రిస్క్ అనుకుంటున్నారా ?
ఏపీలో మద్యం దుకాణాల కోసం లేని స్పందన - రింగ్ అయిపోయారా ? రిస్క్ అనుకుంటున్నారా ?
Chandrababu Delhi Tour : ప్రధాని మోదీతో గంట పాటు చంద్రబాబు భేటీ -  కీలక అంశాలపై చర్చలు
ప్రధాని మోదీతో గంట పాటు చంద్రబాబు భేటీ - కీలక అంశాలపై చర్చలు
RRB JE 2024 Exam Date: జూనియర్ ఇంజినీర్ సహా పలు పోస్టులకు ఎగ్జామ్ తేదీలు ప్రకటించిన రైల్వే బోర్డు
జూనియర్ ఇంజినీర్ సహా పలు పోస్టులకు ఎగ్జామ్ తేదీలు ప్రకటించిన రైల్వే బోర్డు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

PM Modi Yogi Pawan Kalyan Hindutva Speech | హిందూత్వ నినాదంతో మోదీ,యోగి బాటలో పవన్ కళ్యాణ్ | ABPIndia vs Bangladesh T20 Match Result | టీ 20 మ్యాచ్‌లో బంగ్లాపై భారత్ విజయం | ABP DesamHardik Pandya No Look Shot Wins Internet | అదిరిపోయే షాట్ కొట్టిన పాండ్యా | ABP DesamExplosion Near Karachi Airport | కరాచీ ఎయిర్‌పోర్ట్ సమీపంలో ఆత్మాహుతి దాడి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: 'ఆ వదంతులు నమ్మొద్దు' - ఫ్యామిలీ డిజిటల్ కార్డుల దరఖాస్తులపై ప్రభుత్వం కీలక ప్రకటన
'ఆ వదంతులు నమ్మొద్దు' - ఫ్యామిలీ డిజిటల్ కార్డుల దరఖాస్తులపై ప్రభుత్వం కీలక ప్రకటన
AP Liquor Shops : ఏపీలో మద్యం దుకాణాల కోసం లేని స్పందన - రింగ్ అయిపోయారా ? రిస్క్ అనుకుంటున్నారా ?
ఏపీలో మద్యం దుకాణాల కోసం లేని స్పందన - రింగ్ అయిపోయారా ? రిస్క్ అనుకుంటున్నారా ?
Chandrababu Delhi Tour : ప్రధాని మోదీతో గంట పాటు చంద్రబాబు భేటీ -  కీలక అంశాలపై చర్చలు
ప్రధాని మోదీతో గంట పాటు చంద్రబాబు భేటీ - కీలక అంశాలపై చర్చలు
RRB JE 2024 Exam Date: జూనియర్ ఇంజినీర్ సహా పలు పోస్టులకు ఎగ్జామ్ తేదీలు ప్రకటించిన రైల్వే బోర్డు
జూనియర్ ఇంజినీర్ సహా పలు పోస్టులకు ఎగ్జామ్ తేదీలు ప్రకటించిన రైల్వే బోర్డు
Telangana ప్రభుత్వం కీలక నిర్ణయం - HMDA పరిధిలో చెరువుల విస్తీర్ణం గుర్తించేందుకు సర్వే
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం - HMDAలో చెరువుల FTL, బఫర్ జోన్ గుర్తించేందుకు సర్వే
Best Android Games in India: ఇండియాలో టాప్-5 ఆండ్రాయిడ్ గేమ్స్ ఇవే - గేమర్స్ కచ్చితంగా ఆడాల్సిందే!
ఇండియాలో టాప్-5 ఆండ్రాయిడ్ గేమ్స్ ఇవే - గేమర్స్ కచ్చితంగా ఆడాల్సిందే!
Nobel Prize 2024: వైద్యశాస్త్రంలో ఇద్దరికి నోబెల్ బహుమతి-మైక్రో ఆర్‌ఎన్‌ఏను కనుగొన్నందుకు అత్యన్నత పురస్కారం
వైద్యశాస్త్రంలో ఇద్దరికి నోబెల్ బహుమతి-మైక్రో ఆర్‌ఎన్‌ఏను కనుగొన్నందుకు అత్యన్నత పురస్కారం
Nanidgam Suresh: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ మళ్లీ అరెస్ట్‌, 2 వారాలు రిమాండ్
వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ మళ్లీ అరెస్ట్‌, 2 వారాలు రిమాండ్
Embed widget