Stock Market News: రెండ్రోజుల ప్రాఫిట్స్‌కు తెర! 284 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్
Stock Market Opening 22 June 2023: రెండు రోజుల వరుస ర్యాలీకి తెరపడింది. స్టాక్ మార్కెట్లు గురువారం నష్టపోయాయి.
Stock Market Opening 22 June 2023:
రెండు రోజుల వరుస ర్యాలీకి తెరపడింది. స్టాక్ మార్కెట్లు గురువారం నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 85 పాయింట్లు తగ్గి 18,771 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 284 పాయింట్లు తగ్గి 63,238 వద్ద ముగిశాయి. ఉదయం ఫ్లాట్‌గా మొదలైన సూచీలు హాకిష్ ఫెడ్ కామెంట్స్‌తో ఒక్కసారిగా పడిపోయాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 9 పైసలు పెరిగి 81.95 వద్ద స్థిరపడింది.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 63,523 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 63,601 వద్ద మొదలైంది. 63,200 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 63,601 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 284 పాయింట్ల నష్టంతో 63,238 వద్ద ముగిసింది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
బుధవారం 18,856 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 18,853 వద్ద ఓపెనైంది. 18,759 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,886 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 85 పాయింట్ల నష్టంతో 18,771 వద్ద క్లోజైంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ నష్టపోయింది. ఉదయం 43,874 వద్ద మొదలైంది. 43,663 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 44,042 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. సాయంత్రం 134 పాయింట్లు తగ్గి 43,724 వద్ద క్లోజైంది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 13 కంపెనీలు లాభాల్లో 37 నష్టాల్లో ఉన్నాయి. దివిస్ ల్యాబ్, ఎల్‌టీ, టాటా స్టీల్, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు పెరిగాయి. బజాజ్ ఫైనాన్స్, టాటా కన్జూమర్స్, ఏసియన్ పెయింట్స్, టాటా మోటార్స్, పవర్ గ్రిడ్ షేర్లు నష్టపోయాయి. మీడియా, మెటల్ మినహా అన్ని రంగాల సూచీలు ఎరుపెక్కాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, పీఎస్‌యూ బ్యాంక్, రియాల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఎక్కువ పతనం అయ్యాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.220 తగ్గి రూ.59,450గా ఉంది. కిలో వెండి రూ.1000 తగ్గి రూ.72,000 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.390 తగ్గి రూ.24,900 వద్ద ఉంది.
Also Read: AIS - 26AS మధ్య తేడా తెలుసుకోండి, ఫైలింగ్ పని ఈజీ అవుతుంది
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Mr. Anup Vikal, CEO, Maple Highways shares his experience of listing on BSEhttps://t.co/R8wXwpN8yL#listing #listingceremony #capitalmarkets #stockmarketindia #stockexchange #BSE #BSEIndia #bombaystockexchange
— BSE India (@BSEIndia) June 22, 2023
Highlights of the Listing Ceremony of Indian Highway Concessions Limited on 21st June, 2023https://t.co/g4BCu05OOg
— BSE India (@BSEIndia) June 22, 2023