By: ABP Desam | Updated at : 25 Feb 2023 03:10 PM (IST)
Edited By: Arunmali
సెంటిమెంట్ ఎలా ఉన్నా ట్రెండ్ సెట్ చేసిన 13 స్మాల్ క్యాప్ స్టాక్స్
Stock Market News: బలహీనపడ్డ గ్లోబల్ సెంటిమెంట్ల కారణంగా దేశీయ ఈక్విటీ మార్కెట్లు నేలచూపులు చూస్తున్నాయి, అదానీ స్టాక్స్ ఘోరంగా మట్టి కరిచాయి. గత వారంలో, సెన్సెక్స్ 2% పైగా నష్టపోయి శుక్రవారం 59463.93 పాయింట్ల వద్ద స్థిరపడింది.
ఈ ప్రతికూల పరిస్థితుల్లోనూ, 13 స్మాల్ క్యాప్ స్టాక్స్ (smallcap stocks) ఆటుపోట్లకు ఎదురొడ్డి నిలిచాయి, వారం రోజుల్లోనే రెండంకెల లాభాలను ఇచ్చాయి. ఈ 13 పేర్లలో.. మూడు షేర్లు గత వారంలో కొత్త 52 వారాల గరిష్టాన్ని కూడా సృష్టించాయి.
13 స్మాల్ క్యాప్ గ్రోత్ స్టాక్స్
ఆ 13 స్టాక్స్... గ్లోబస్ స్పిరిట్స్ (Globus Spirits), కృతి ఇండస్ట్రీస్ (Kriti Industries), న్యూక్లియస్ సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పోర్ట్స్ (Nucleus Software Exports), ఐనాక్స్ విండ్ (Inox Wind), ఎవరెస్ట్ కాంటో సిలిండర్ (Everest Kanto Cylinder), జెన్ టెక్నాలజీస్ (Zen Technologies), ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ (Olectra Greentech), మహీంద్రా CIE ఆటోమోటివ్ (Mahindra CIE Automotive), ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (Equitas Small Finance Bank), డిష్‌మాన్ కార్బోజెన్ (Dishman Carbogen), సంఘీ ఇండస్ట్రీస్ (Sanghi Industries), లుమాక్స్ ఆటో టెక్నాలజీస్ (Lumax Auto Technologies), EKI ఎనర్జీ సర్వీసెస్ (EKI Energy Services). గత వారంలో ఇవి 11% నుంచి 20% వరకు లాభపడ్డాయి.
న్యూక్లియస్ సాఫ్ట్‌వేర్, జెన్ టెక్నాలజీస్, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఈ వారంలో కొత్త 52 వారాల గరిష్టాలను పరీక్షించాయి.
వారం వారీగా మాత్రమే కాదు, వీటిలో కొన్ని స్టాక్స్ గత నెల రోజుల్లోనూ బలమైన రాబడిని ఇచ్చాయి.
గత 1 నెల రోజుల్లో... డిష్‌మాన్ కార్బోజెన్ షేర్లు 39% ర్యాలీ చేశాయి, న్యూక్లియస్ సాఫ్ట్‌వేర్ స్క్రిప్ దాదాపు 50% లాభపడింది.
ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, మహీంద్రా CIE, జెన్ టెక్నాలజీస్ గత 1 నెలలో 22-36% జూమ్ అయ్యాయి.
ఈక్వి"టాప్" స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, స్మాల్ క్యాప్ సెగ్మెంట్‌లో బిగ్ ఔట్‌పెర్‌ఫార్మర్‌గా నిలిచింది. గత ఒక సంవత్సర కాలంలో, నిఫ్టీ50 ఇచ్చిన 8% రాబడితో పోలిస్తే, అదే కాలంలో ఈ కౌంటర్ నుంచి 32% రాబడి వచ్చింది. ఈ బ్యాంక్ బలమైన ఆదాయాలు, ఇచ్చే రుణాల్లో నిరంతర వృద్ధి వల్ల ఎద్దులు ఈ స్టాక్ వెంటబడుతున్నాయి. బ్రోకరేజ్ ఎంకే గ్లోబల్, ఈ బ్యాంక్ స్టాక్‌కు రూ. 72 టార్గెట్ ప్రైస్‌తో “బయ్” రేటింగ్ ప్రకటించింది.
ఆర్థిక రంగం తరహాలోనే ఆటోమొబైల్, ఆటో కాంపోనెంట్ స్పేస్‌పై కూడా ఎనలిస్ట్‌లు బుల్లిష్‌గా ఉన్నారు. ప్రయాణీకుల వాహనాలకు (ప్యాసెంజర్ వెహికల్స్) బలమైన డిమాండ్, పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాల ఆదరణ కారణంగా ఈ రంగంలో బలమైన వృద్ధి అవకాశాలను చూస్తున్నారు. హైడ్రోజన్‌తో నడిచే బస్సులను ఉత్పత్తి చేయడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో కుదుర్చుకున్న భాగస్వామ్యం కారణంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ బలంగా లాభపడింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Petrol-Diesel Price 26 March 2023: పెట్రోల్ రేట్లతో జనం పరేషాన్, తిరుపతిలో భారీగా జంప్
Gold-Silver Price 26 March 2023: బంగారం శాంతించినా వెండి పరుగు ఆగలేదు, ₹76 వేల మార్క్‌ను చేరింది
Mercedes Benz: కొత్త కారుకు షిఫ్ట్ అయిన ప్రధాని మోదీ - ఫీచర్లు ఎలా ఉన్నాయి? ధర ఎంత?
RBI: ఏప్రిల్ 3-6 తేదీల్లో MPC భేటీ, వడ్డీ రేట్లు ఇంకా పెరుగుతాయా?
Vedanta: డబ్బు కోసం వేదాంత పడుతున్న పాట్లు వర్ణనాతీతం, RBI అనుమతి కోసం విజ్ఞప్తి
రాహుల్ కంటే ముందు అనర్హత వేటు పడిన నేతలు వీరే
Nara Rohit : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్
Saweety Boora: గోల్డ్ తెచ్చిన సవీటీ బూరా - మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో స్వర్ణం!
Weather Latest Update: నేడు తెలుగు రాష్ట్రాల్లో ఎల్లో అలెర్ట్ జారీ, ఈ జిల్లాల్లో వానలు! ఈదురుగాలులు కూడా