Multibagger Tata Stock: లక్షకు ₹12 లక్షలు - ఇన్వెస్టర్లను మూడేళ్లలో మిలియనీర్లుగా మార్చిన టాటా స్టాక్
ఈ సుపరిచిత గ్రూప్‌లోనూ కొన్ని అపరిచిత లిస్టెడ్ కంపెనీలు ఉన్నాయి.
Multibagger Tata Stock: టాటా గ్రూప్ భారతదేశంలోని అతి పెద్ద, ప్రాచీన బిజినెస్ గ్రూప్స్‌లో ఒకటి. 100 సంవత్సరాలకు పైబడిన చరిత్ర దీని సొంతం. భారతదేశం పారిశ్రామికంగా వేగంగా అడుగులు వేయడంలో టాటా గ్రూప్‌ది కీ రోల్. స్టాక్ మార్కెట్‌లో సూచీలను ముందుకు తీసుకెళ్లడంలోనూ టాటా స్టాక్స్ నుంచి కీలకంగా పని చేశాయి. ఇండియన్ మార్కెట్‌లో బిగ్ బుల్‌గా పేరుగాంచిన దివంగత పెట్టుబడిదారు రాకేష్ ఝున్‌ఝున్‌వాలా మార్కెట్‌లో పేరు, ప్రఖ్యాతులు పొందడంలో కూడా టాటా గ్రూప్ షేర్లు కూడా సాయం చేశాయి.
ప్రస్తుతం, స్టాక్ మార్కెట్‌ను దున్నేస్తున్న టాటా గ్రూప్ కంపెనీల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, ఈ సుపరిచిత గ్రూప్‌లోనూ కొన్ని అనామక లిస్టెడ్ కంపెనీలు ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి తేజస్ నెట్‌వర్క్స్ లిమిటెడ్ (Tejas Networks Ltd). ఇది ఒక సైలెంట్ కిల్లర్. రాబడి పరంగా మార్కెట్లోని బెస్ట్ మల్టీబ్యాగర్ స్టాక్స్ (best Multibagger stocks) ఇదొకటి.
గత ఏడాది మరింత స్టేక్ కొన్న టాటా సన్స్
తేజస్ నెట్‌వర్క్స్ లిమిటెడ్, హై-స్పీడ్ ఇంటర్నెట్ సర్వీస్‌లను అందిస్తుంది. అంతే కాకుండా, 4G/5G మొబైల్ బ్యాక్‌హాల్, హోల్‌సేల్ బ్యాండ్‌విడ్త్ సర్వీసులు కూడా అందిస్తుంది. దీని హెడ్ ఆఫీస్ గురుగావ్‌లో ఉంది. చాలా కాలంగా టాటా గ్రూప్‌లో భాగంగా కొనసాగుతోంది. టాటా గ్రూప్‌లోని హోల్డింగ్ కంపెనీ అయిన టాటా సన్స్, గత ఏడాది ఏప్రిల్‌లో పనాటోన్ ఫిన్‌వెస్ట్ లిమిటెడ్ ద్వారా కంపెనీలో తన వాటాను 50 శాతానికి పైగా పెంచుకుంది. ఈ విధంగా, టాటా సన్స్ ఇప్పుడు తేజస్ నెట్‌వర్క్స్‌లో మెజారిటీ స్టేక్‌హోల్డర్‌గా, 52.45% షేర్లతో ఓనర్‌షిప్ మెయిన్‌టెయిన్ చేస్తోంది.
తేజస్ నెట్‌వర్క్స్ షేర్ ప్రైస్ నిన్న (మంగళవారం, 29 ఆగస్టు 2023) రూ. 828.70 వద్ద క్లోజ్ అయింది, ఇవాళ రూ. 832.10 దగ్గర ఓపెన్ అయింది. గత 5 రోజుల్లో దీని ధర దాదాపు ఇదే స్థాయిలో ఉంది. ఇది ఒక దశలో రూ. 893.30కు కూడా చేరుకుంది, ఇది 52 వారాల గరిష్టం. తేజస్ నెట్‌వర్క్స్ స్టాక్ 52 వారాల కనిష్ట స్థాయి రూ.510.
గత నెల రోజుల్లో తేజస్ నెట్‌వర్క్స్ షేర్ కేవలం 1% పైగా లాభపడింది. ఈ స్టాక్ గత 6 నెలల్లో 48% పైగా పెరిగింది. ఈ సంవత్సరం జనవరి నుంచి ఇప్పటి వరకు దాదాపు 37% రిటర్న్స్ ఇచ్చింది.
లక్ష రూపాయలకు ₹12 లక్షలు లాభం
తేజస్ నెట్‌వర్క్స్ షేర్ ప్రైస్, సుమారు 3 సంవత్సరాల క్రితం, 2020 ఆగస్టు 28న రూ. 63.90 వద్ద ఉంది. నిన్న రూ. 828.70 వద్ద క్లోజ్ అయింది. అంటే గత 3 సంవత్సరాల్లో ఈ టాటా కంపెనీ షేర్లు 13 రెట్లు (సుమారు 1200%) పెరిగాయి. ఈ లెక్క ప్రకారం, 3 సంవత్సరాల క్రితం ఒక ఇన్వెస్టర్ ఈ కౌంటర్‌లో లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇప్పుడు అతను 12 లక్షల రూపాయలు సంపాదించి ఉండేవాడు, మిలియనీర్ అయి ఉండేవాడు.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఇవాళ్టి రేట్లివి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial