అన్వేషించండి

Bitcoin Mining: అగ్నిపర్వతం నుంచి వందలకొద్దీ బిట్‌కాయిన్‌లు - చిన్న దేశం, పెద్ద ఘనత

Bitcoins From Volcano: బిట్‌కాయిన్‌ మైనింగ్‌ కోసం ఎల్ సాల్వడార్‌లో బిట్‌కాయిన్ ఆఫీస్ అనే ప్రత్యేక ప్రభుత్వ విభాగాన్ని ఏర్పాటు చేశారు.

What is Bitcoin Mining: ఈ ఏడాది ప్రారంభం నుంచి బిట్‌కాయిన్ వార్తల్లో నిలుస్తోంది. అమెరికాలో బిట్‌కాయిన్ ఈటీఎఫ్‌లకు ఆమోదం, ఆపై కొత్త రికార్డు స్థాయికి చేరిన ధరలు బిట్‌కాయిన్‌ను నిరంతరం న్యూస్‌ హెడ్‌లైన్స్‌లో నిలబెట్టాయి. ఇప్పుడు, బిట్‌కాయిన్ మరోమారు వార్తల్లోకి వచ్చింది. ఈసారి కారణం కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది.

సెంట్రల్ అమెరికాలోని అతి చిన్న దేశం ఎల్ సాల్వడార్ ‍‌(El Salvador) గత కొన్నేళ్లుగా బిలియన్ల విలువైన బిట్‌కాయిన్‌లను మైన్‌ చేస్తోంది. అయితే, బిట్‌కాయిన్‌ మైనింగ్‌ కోసం ఈ దేశం అగ్నిపర్వతం (Volcano) సాయం తీసుకుంది. వల్కనో నుంచి బిట్‌కాయిన్‌ను రూపొందిస్తున్న విధానం ఈ మొత్తం ఎపిసోడ్‌ను అత్యంత ఆసక్తికరంగా మార్చింది. దీనివల్ల ఎల్ సాల్వడార్ ప్రభుత్వ ఖజానా కూడా నిండింది.

ఎల్ సాల్వడార్‌లో అధికారిక గుర్తింపు
ఎల్ సాల్వడార్, ప్రపంచంలోనే బిట్‌కాయిన్‌ను అధికారికంగా గుర్తించిన తొలి దేశం. ఎల్ సాల్వడార్ అధ్యక్షుడు నయీబ్ బుకెలేకు బిట్‌కాయిన్ అంటే ఇష్టం. అతను తన మొదటి టర్మ్‌లోనే బిట్‌కాయిన్‌కు అధికారిక గుర్తింపు ఇచ్చాడు. ఈ ఏడాది నుంచి ఆయన రెండో టర్మ్‌ ప్రారంభమైంది. ఎల్‌ సాల్వడార్‌లో బిట్‌కాయిన్ మైనింగ్‌ను ప్రోత్సహించే చర్యలను కూడా బుకెల్ ప్రభుత్వం ప్రోత్సహించింది. 

బిట్‌కాయిన్‌ మైనింగ్‌ కోసం ఎల్ సాల్వడార్‌లో బిట్‌కాయిన్ ఆఫీస్ అనే ప్రత్యేక ప్రభుత్వ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ దేశ ఖజానాలో 5,750 బిట్‌కాయిన్లు జమ అయ్యాయని బిట్‌కాయిన్ ఆఫీస్ తెలిపింది. 2021లో మైనింగ్‌లో కొత్త తరహా విధానం ప్రారంభమైన తర్వాత నుంచి ఇప్పటి వరకు 474 కొత్త బిట్‌కాయిన్‌లు ట్రెజరీలో చేరాయని వెల్లడించింది. ఈ విధంగా, ఆ దేశ ట్రెజరీలో బిట్‌కాయిన్ మొత్తం విలువ సుమారు 354 మిలియన్ డాలర్లకు చేరింది.

బిట్‌కాయిన్ మైనింగ్ అంటే ఏంటి?
నిజానికి, బిట్‌కాయిన్‌ మైనింగ్‌ అంటే ఖనిజాల తరహాలో భూమి నుంచి తవ్వి తీయడం కాదు. ఇది బ్లాక్‌చెయిన్ టెక్నాలజీపై ‍‌(Blockchain technology) ఆధారపడిన క్రిప్టో కరెన్సీ (Crypto Currency). బ్లాక్‌చెయిన్ టెక్నాలజీలో, కొత్త బ్లాక్‌లను యూనిట్‌లుగా సృష్టిస్తారు. ఇవి, అంతులేని గొలుసుకు అనుసంధానమవుతాయి. ఈ గొలుసు పెరిగే కొద్దీ కొత్త బిట్‌కాయిన్ యూనిట్ల సృష్టి జరుగుతుంది. ఈ మొత్తం ప్రక్రియను బిట్‌కాయిన్ మైనింగ్ అంటారు. ఈ పనికి భారీ కంప్యూటింగ్/ప్రాసెసింగ్ సామర్థ్యం, నిపుణులు అవసరం. పైగా, దీనికోసం అతి భారీ మొత్తంలో విద్యుత్‌ కావాలి.

అగ్నిపర్వతం నుంచి బిట్‌కాయిన్‌ మైనింగ్‌ ఎలా?
ఎల్ సాల్వడార్ ప్రభుత్వం, బిట్‌కాయిన్‌ల మైనింగ్ కోసం తమ దేశంలో 300 భారీ ప్రాసెసర్‌లను ఏర్పాటు చేసింది. ఈ ప్రాసెసర్‌లను నడపడానికి ఉపయోగించే విద్యుత్‌ను టెపాకా అగ్నిపర్వతం (Volcano De Tecapa) శక్తి నుంచి తీసుకుంటోంది. అగ్నిపర్వతాల నుంచి ఉత్పత్తయ్యే జియోథర్మల్ ఎనర్జీని విద్యుత్‌గా మారుస్తోంది. ఆ విద్యుత్‌తో బిట్ కాయిన్లను మైనింగ్‌ చేస్తోంది. ఫలితంగా, ఒకవైపు.. కాలుష్యం లేకుండా గ్రీన్ ఎనర్జీని ఉపయోగించుకుంటూనే, మరోవైపు.. అత్యంత విలువైన కొత్త బిట్‌కాయిన్లను ఖజానాలో జమ చేస్తోంది.

మరో ఆసక్తికర కథనం: ఎన్నికల తర్వాత లాభపడే స్టాక్‌ ఇది, విన్నింగ్‌ డీల్‌ అంటున్న బ్రోకరేజ్‌లు! 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana VS Andhra Pradesh: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, బనకచర్ల ప్రాజెక్టులపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్న తెలంగాణ ప్రభుత్వం
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, బనకచర్ల ప్రాజెక్టులపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్న తెలంగాణ ప్రభుత్వం
APPSC Group -2 Results : ఏపీ గ్రూప్‌-2 మెయిన్స్ ఫలితాలు విడుదల- 1:2 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక
ఏపీ గ్రూప్‌-2 మెయిన్స్ ఫలితాలు విడుదల- 1:2 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక
TTD  News Guidelines: తెలంగాణలో తిరుమలేశుడి భక్తులకు బిగ్ అలర్ట్- సిఫార్సు లేఖలపై ప్రత్యేక మార్గదర్శకాలు
తెలంగాణలో తిరుమలేశుడి భక్తులకు బిగ్ అలర్ట్- సిఫార్సు లేఖలపై ప్రత్యేక మార్గదర్శకాలు
HCU Land Dispute: ఆ వీడియోనే రేవంత్ సర్కార్ కొంపముంచిందా? HCU భూవివాదంలో ఊహించని ట్విస్ట్!
ఆ వీడియోనే రేవంత్ సర్కార్ కొంపముంచిందా? HCU భూవివాదంలో ఊహించని ట్విస్ట్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

LSG vs MI Match Highlights IPL 2025 | ముంబై పై 12పరుగుల తేడాతో లక్నో ఘన విజయం | ABP DesamAngkrish Raghuvanshi 50 vs SRH | ఐపీఎల్ చరిత్రలో ఓ అరుదైన రికార్డు క్రియేట్ చేసిన రఘువంశీKamindu Mendis Ambidextrous Bowling vs KKR | IPL 2025 లో చరిత్ర సృష్టించిన సన్ రైజర్స్ ప్లేయర్Sunrisers Flat Pitches Fantasy | IPL 2025 లో టర్నింగ్ పిచ్ లపై సన్ రైజర్స్ బోర్లా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana VS Andhra Pradesh: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, బనకచర్ల ప్రాజెక్టులపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్న తెలంగాణ ప్రభుత్వం
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, బనకచర్ల ప్రాజెక్టులపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్న తెలంగాణ ప్రభుత్వం
APPSC Group -2 Results : ఏపీ గ్రూప్‌-2 మెయిన్స్ ఫలితాలు విడుదల- 1:2 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక
ఏపీ గ్రూప్‌-2 మెయిన్స్ ఫలితాలు విడుదల- 1:2 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక
TTD  News Guidelines: తెలంగాణలో తిరుమలేశుడి భక్తులకు బిగ్ అలర్ట్- సిఫార్సు లేఖలపై ప్రత్యేక మార్గదర్శకాలు
తెలంగాణలో తిరుమలేశుడి భక్తులకు బిగ్ అలర్ట్- సిఫార్సు లేఖలపై ప్రత్యేక మార్గదర్శకాలు
HCU Land Dispute: ఆ వీడియోనే రేవంత్ సర్కార్ కొంపముంచిందా? HCU భూవివాదంలో ఊహించని ట్విస్ట్!
ఆ వీడియోనే రేవంత్ సర్కార్ కొంపముంచిందా? HCU భూవివాదంలో ఊహించని ట్విస్ట్!
AP Nominated posts: కూటమి నేతలకు మరోసారి పదవుల ప్రకటన - ఈ సారి అదృష్టం ఎవరెవరికి అంటే
కూటమి నేతలకు మరోసారి పదవుల ప్రకటన - ఈ సారి అదృష్టం ఎవరెవరికి అంటే
CSK Captain MS Dhoni:  చెన్నై కెప్టెన్ గా ధోనీ..! మ‌ళ్లీ ప‌గ్గాలు చేప‌ట్ట‌నున్న వెట‌ర‌న్ ప్లేయ‌ర్..!! శ‌నివారం చెపాక్ లో ఢిల్లీతో మ్యాచ్
చెన్నై కెప్టెన్ గా ధోనీ..! మ‌ళ్లీ ప‌గ్గాలు చేప‌ట్ట‌నున్న వెట‌ర‌న్ ప్లేయ‌ర్..!! శ‌నివారం చెపాక్ లో ఢిల్లీతో మ్యాచ్
Nagababu : పిఠాపురం ప్రజల అతి పెద్ద సమస్యకు పవన్ పరిష్కారం - స్వయంగా వెళ్లి భరోసా ఇచ్చిన నాగబాబు
పిఠాపురం ప్రజల అతి పెద్ద సమస్యకు పవన్ పరిష్కారం - స్వయంగా వెళ్లి భరోసా ఇచ్చిన నాగబాబు
YS Sharmila : అసలు విషయం వదిలేస్తున్నారు, నచ్చినట్టు వాడుకుంటున్నారు- మీడియాపై షర్మిల ఆగ్రహం
అసలు విషయం వదిలేస్తున్నారు, నచ్చినట్టు వాడుకుంటున్నారు- మీడియాపై షర్మిల ఆగ్రహం
Embed widget