అన్వేషించండి

SBI Data Breach: ఎస్‌బీఐకి సైబర్ షాక్.. 3.75 లక్షల మంది కస్టమర్ల డేటా లీక్?.. స్టేట్ బ్యాంక్ ఏం చెబుతుందంటే?

SBI Data Breach: ఎస్బీఐ నుంచి 3.75 లక్షల కస్టమర్ల డేటా లీక్ అయిందనే ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై స్టేట్ బ్యాంక్ స్పందించింది. ఈ మేరకు ఓ ప్రకటన జారీ చేసింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • హ్యాకర్లు 3.75 లక్షల ఎస్బీఐ కస్టమర్ల డేటా లీకైనట్లు ప్రకటించారు.
  • ఎస్బీఐ 3,897 కస్టమర్ల వ్యక్తిగత వివరాలు డార్క్ వెబ్‌లో లీకైనట్లు నిర్ధారించింది.
  • లీకైన డేటాలో వ్యక్తిగత గుర్తింపు, లోన్ రికార్డులు ఉన్నాయని SBI తెలిపింది.
  • డేటా లీక్ తీవ్రతపై SBI సైబర్ ఏజెన్సీతో దర్యాప్తు ప్రారంభించింది.

SBI Data Breach: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికీ బ్యాంకు అకౌంట్ ఉంటుంది. అకౌంట్ ఓపెన్ చేయడానికైనా, లోన్ తీసుకోవడానికైనా, కస్టమర్లు తమ వ్యక్తిగత వివరాలను బ్యాంకుకు ఇస్తున్నారు. మీ వ్యక్తిగత వివరాలు తప్పుడు చేతుల్లోకి వెళితే, అది తీవ్రమైన సమస్యలకు దారితీయవచ్చు. దేశంలోని అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఇలాంటి బ్యాడ్ న్యూస్ బయటకు వచ్చింది. 3.75 లక్షల ఎస్‌బీఐ కస్టమర్లకు డేటా లీక్ అయిందనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. సైబర్‌పల్స్56 అనే సైబర్‌ సెక్యూరిటీ అకౌంట్ ప్రకారం, 3.75 లక్షల బ్యాంకు అకౌంట్ల సమాచారం తమ వద్ద ఉందని పేర్కొంటూ 'సిరియస్సిమ్' అనే హ్యాకర్ గ్రూప్ ప్రకటించింది. ఈ విషయంపై ఎస్‌బీఐ ఎలాంటి అధికారిక ప్రకటన జారీ చేయలేదు, కానీ బుధవారం ఈ సైబర్‌దాడి గురించి బ్యాంకు ఓ ప్రకటన జారీ చేసింది.  

బ్యాంకు ఏం చెబుతోంది?

3,897 మంది కస్టమర్ల డేటా డార్క్ వెబ్‌లో లీక్ అయిందని ఎస్బీఐ తెలిపింది. ఎస్‌బీఐ ప్రకారం, లీక్ అయిన డేటాలో కస్టమర్ల వ్యక్తిగత వివరాలు ఉన్నాయని ప్రాథమిక విచారణలో తెలిందని పేర్కొంది. 

ఏ డేటా లీక్ అయింది?

ఎస్‌బీఐ ప్రకారం, కస్టమర్ ఐడెంటిటీ, లోన్ రికార్డులకు సంబంధించిన వివరాలు లీక్ అయినట్లు తెలుస్తోంది.  కస్టమర్ మొబైల్ నెంబర్లు, ఈమెయిల్ ఐడీ, కస్టమర్ పేర్లు, ఇంటి అడ్రస్ వంటి సమాచారం డేటా లీక్ లో ఉన్నాయి.  


SBI Data Breach: ఎస్‌బీఐకి సైబర్ షాక్.. 3.75 లక్షల మంది కస్టమర్ల డేటా లీక్?.. స్టేట్ బ్యాంక్ ఏం చెబుతుందంటే?

ఏం చర్యలు తీసుకుంది?

డేటా లీక్ తీవ్రతను నిర్ధారించడానికి, ఎస్బీఐ ఈ విషయంపై దర్యాప్తునకు ఆదేశించింది. ఇందుకోసం ఒక సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీని నియమించింది. ఎంత మేర డేటా లీక్ అయిందో నిర్ధారించాలని కోరింది.  

కస్టమర్లపై ప్రభావం?

సైబర్‌పల్స్ ప్రకారం, లీక్ అయిన కస్టమర్ డేటాను దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. కస్టమర్ డేటాను ఉపయోగించి తప్పుడు మార్గాల్లో లోన్ అప్లై చేయవచ్చు. మరికొందరు నకిలీ మెసేజులు పంపి ప్రజలను మోసం చేయడానికి కూడా ప్రయత్నించవచ్చు. అందువల్ల, కస్టమర్లు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. కస్టమర్లు ఎవరికీ ఓటీపీని చెప్పకూడదని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. అలాగే, మీ ఏటీఎం పిన్‌ను కూడా ఎవరితోనూ పంచుకోవద్దని సూచించారు. బ్యాంకు ద్వారా జరిగే ప్రతి లావాదేవీపై నిఘా ఉంచాలని పేర్కొన్నారు. 

Also Read: రూ.30,213 కోట్ల జియో ఐపీఓ లైవ్.. సబ్‌స్క్రిప్షన్‌లో జియో ప్లాట్‌ఫామ్స్ రికార్డ్

బ్యాంకుపై ఎలాంటి ప్రభావం?

డేటా లీక్ వల్ల బ్యాంకుపై పెద్దగా ప్రభావం పడకపోవచ్చని ఎస్‌బీఐ చెబుతోంది.  

మీ అకౌంట్ నుంచి డబ్బు పోతే?

  1. మీ బ్యాంక్ అకౌంట్ లో మీకు తెలియని విధంగా లావాదేవీ జరిగితే, వెంటనే బ్యాంక్ కస్టమర్ కేర్‌కు ఫిర్యాదు చేయాలి.
  2. అనుమానాస్పద లావాదేవీలపై సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నెంబర్ 1930కు ఫిర్యాదు చేయండి.  
  3. ట్రాన్‌జాక్షన్ ఐడీ, బ్యాంక్ SMS, ఖాతాకు సంబంధించిన వివరాలు మీ వద్ద ఉంచుకోవాలి.  
  4. నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌ను మార్చుకోండి. అవసరమైతే దానిని బ్లాక్ చేయండి. 

    Also Read: IIT తిరుపతి , వన్‌ ఇండియాతో కెనడా జియో ఏఐ సంస్థ ఒప్పందాలు.. విద్యార్థులకు ఏం లాభం?

Frequently Asked Questions

ఎంత మంది ఎస్బీఐ కస్టమర్ల డేటా లీక్ అయ్యింది?

ఎస్బీఐ ప్రకారం, 3,897 మంది కస్టమర్ల డేటా డార్క్ వెబ్‌లో లీక్ అయింది. 'సిరియస్సిమ్' అనే హ్యాకర్ గ్రూప్ ఈ సమాచారం తమ వద్ద ఉందని పేర్కొంది.

ఏ రకమైన కస్టమర్ డేటా లీక్ అయ్యింది?

కస్టమర్ ఐడెంటిటీ, లోన్ రికార్డులకు సంబంధించిన వివరాలు లీక్ అయ్యాయి. మొబైల్ నంబర్లు, ఈమెయిల్ ఐడీలు, కస్టమర్ పేర్లు, ఇంటి అడ్రస్ వంటి వ్యక్తిగత వివరాలు ఇందులో ఉన్నాయి.

ఈ డేటా లీక్‌పై ఎస్బీఐ ఎలాంటి చర్యలు తీసుకుంటోంది?

డేటా లీక్ తీవ్రతను నిర్ధారించడానికి ఎస్బీఐ దర్యాప్తునకు ఆదేశించింది. ఇందుకోసం ఒక సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీని కూడా నియమించి, ఎంత డేటా లీక్ అయిందో నిర్ధారించాలని కోరింది.

డేటా లీక్ వల్ల కస్టమర్లపై ఎలాంటి ప్రభావం ఉంటుంది మరియు వారు ఎలా జాగ్రత్తగా ఉండాలి?

లీక్ అయిన డేటాను దుర్వినియోగం చేసి మోసాలు చేసే అవకాశం ఉంది. కస్టమర్లు ఎవరికీ ఓటీపీ లేదా ఏటీఎం పిన్ చెప్పకూడదు మరియు బ్యాంకు లావాదేవీలపై నిఘా ఉంచాలి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sukanya Samriddhi Yojana: సుకన్య సమృద్ధి యోజన స్కీమ్.. ముగ్గురు కుమార్తెలకు SSY అకౌంట్లు సాధ్యమేనా?.. పూర్తి వివరాలు ఇవే!
సుకన్య సమృద్ధి యోజన స్కీమ్.. ముగ్గురు కుమార్తెలకు SSY అకౌంట్లు సాధ్యమేనా?.. పూర్తి వివరాలు ఇవే!
‌‌UPI Wrong Transfer: యూపీఐ యాప్‌లో పొరపాటున వేరే వాళ్లకు డబ్బులు పంపిస్తే?.. ఈ సింపుల్ చిట్కాలతో మీ డబ్బు వెనక్కి!
యూపీఐ యాప్‌లో పొరపాటున వేరే వాళ్లకు డబ్బులు పంపిస్తే?.. ఈ సింపుల్ చిట్కాలతో మీ డబ్బు వెనక్కి!
Personal Loan: ప్లాన్ చేసిన, అత్యవసర ఖర్చుల నిర్వహణలో మీకు పర్సనల్ లోన్ ఎలా సహాయపడుతుంది
ప్లాన్ చేసిన, అత్యవసర ఖర్చుల నిర్వహణలో మీకు పర్సనల్ లోన్ ఎలా సహాయపడుతుంది
1.39 కోట్ల బిడ్లు, ఏకంగా రూ. 7.4 లక్షల కోట్ల డిమాండ్‌తో Jio Platforms IPO సరికొత్త రికార్డ్
1.39 కోట్ల బిడ్లు, ఏకంగా రూ. 7.4 లక్షల కోట్ల డిమాండ్‌తో Jio Platforms IPO సరికొత్త రికార్డ్
Advertisement

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
School Holidays: అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
Tirupati DGP IGP Conference: తిరుపతిలో డీజీపీలు, ఐజీల జాతీయ స్థాయి సదస్సు.. ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు!
తిరుపతిలో డీజీపీలు, ఐజీల జాతీయ స్థాయి సదస్సు.. ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు!
Srikakulam Crime News: విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
Vijay Deverakonda Rashmika : విజయ్, రష్మికల వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారం - సైబర్ పోలీసులకు విరోష్ టీం కంప్లైంట్
విజయ్, రష్మికల వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారం - సైబర్ పోలీసులకు విరోష్ టీం కంప్లైంట్
Congress Politics: గోదావరి జలాలపై బీఆర్ఎస్ దుష్ప్రచారం, ఆంధ్రాకు నీళ్లు పోవడం లేదు: కాంగ్రెస్ ఎంపీ చామల
గోదావరి జలాలపై బీఆర్ఎస్ దుష్ప్రచారం, ఆంధ్రాకు నీళ్లు పోవడం లేదు: ఎంపీ చామల
This Week OTT Movies : ఈ వారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 16 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి డోంట్ మిస్
ఈ వారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 16 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి డోంట్ మిస్
Mahindra XUV 3XO పెట్రోల్‌తో పోలిస్తే CNG ఎంత ఆదా చేస్తుంది? రియల్ వరల్డ్ మైలేజీ టెస్ట్ పూర్తి వివరాలు
Mahindra XUV 3XO CNG నిజమైన మైలేజీ ఎంత? రియల్ వరల్డ్ టెస్ట్‌లో బయటపడిన అసలు లెక్కలు!
Embed widget