అన్వేషించండి

RBI News: లండన్ నుంచి భారత్ కు లక్ష కిలోల బంగారం, ఆర్బీఐ హిస్టరీలో ఫస్ట్ టైం

RBI Gold News: 1991లో తాకట్టు పెట్టిన 100టన్నుల బంగారాన్ని ఆర్బీఐ లండన్ నుంచి భారత్ కు తరలించింది. మరికొన్ని రోజుల్లో మరింత బంగారాన్ని భారత్‌కు తిరిగి తీసుకువచ్చేందుకు రిజర్వ్ బ్యాంక్ ప్రయత్నిస్తోంది.

RBI 100 tonnes of gold:  రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) యునైటెడ్ కింగ్‌డమ్(UK) నుండి సుమారు 100 టన్నులు లేదా లక్ష కిలోల బంగారాన్ని వెనక్కి తీసుకువచ్చి తన నిల్వలకు బదిలీ చేసింది. రాబోయే నెలల్లో మరింత బంగారాన్ని భారత్‌కు తిరిగి తీసుకువచ్చేందుకు ఆర్బీఐ  ప్రయత్నిస్తుంది. 1991లో తాకట్టు పెట్టిన ఈ బంగారాన్ని తొలిసారిగా ఆర్‌బీఐ స్టాక్‌లో చేర్చారు.  1991 తర్వాత మొదటిసారిగా ఇంత పెద్ద మొత్తంలో బంగారాన్ని  ఆర్బీఐ తిరిగి తీసుకువచ్చింది. దేశంలో విదేశీ మారకద్రవ్య సంక్షోభం కారణంగా 1991లో ఆర్‌బీఐ తన బంగారం నిల్వల్లో కొంత భాగాన్ని తాకట్టు పెట్టాల్సి వచ్చింది. ఆ సమయంలో దేశం తీవ్ర విమర్శలను ఎదుర్కోవలసి వచ్చింది. ఆర్‌బిఐకి చెందిన సగానికి పైగా బంగారం నిల్వలు విదేశాలలో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్,  బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్‌మెంట్‌ల వద్ద సురక్షితంగా ఉన్నాయి.

1991లో బంగారం తాకట్టు  
ఆర్‌బిఐ విడుదల చేసిన వార్షిక గణాంకాల ప్రకారం.. మార్చి 31, 2024 నాటికి విదేశీ మారక నిల్వల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం వద్ద 822.10 టన్నుల బంగారం ఉంది. గత ఏడాది ఇదే కాలంలో 794.63 టన్నులు ఉంది. 1991లో చంద్రశేఖర్ ప్రభుత్వం బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి బంగారాన్ని తనఖా పెట్టింది. జూలై 4 - 18, 1991 మధ్య, ఆర్బీఐ 46.91 టన్నుల బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఆఫ్ జపాన్‌తో  400 మిలియన్ డాలర్లను సమీకరించడానికి తాకట్టు పెట్టింది.

భారత్ చాలా బంగారం కొనుగోలు చేసింది 
సెంట్రల్ బ్యాంక్ 15 సంవత్సరాల క్రితం అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) నుండి 200 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. 2009లో యూపీఏ ప్రభుత్వ హయాంలో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, భారతదేశం తన ఆస్తులను విస్తరించడానికి 6.7 బిలియన్ డాలర్ల విలువైన 200 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. ఇది మాత్రమే కాదు, గత కొన్నేళ్లుగా రిజర్వ్ బ్యాంక్ కొనుగోలు చేసిన బంగారం స్టాక్‌లో నిరంతర పెరుగుదల ఉంటూనే ఉంది.

ఆర్బీఐ బంగారాన్ని ఎందుకు కొంటుంది ?  
సెంట్రల్ బ్యాంక్ ద్వారా బంగారాన్ని స్టాక్‌లలో ఉంచడం ఉద్దేశ్యం ప్రధానంగా ద్రవ్యోల్బణం,  విదేశీ మారకపు నష్టాలకు వ్యతిరేకంగా దాని విదేశీ కరెన్సీ ఆస్తులను పెంచడం. ఆ కారణంగా ఆర్‌బీఐ డిసెంబర్ 2017 నుంచి క్రమం తప్పకుండా మార్కెట్ నుంచి బంగారాన్ని సేకరిస్తుంది. డిసెంబర్ 2023 చివరి నాటికి దేశంలోని మొత్తం విదేశీ మారకద్రవ్య నిల్వల్లో బంగారం వాటాను 7.75 శాతం నుంచి 2024 ఏప్రిల్ చివరి నాటికి 8.7 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఆర్బీఐ బంగారాన్ని ఎక్కడ ఉంచుతుంది?
దేశంలో ముంబై, నాగ్‌పూర్‌లోని మింట్ రోడ్‌లోని ఆర్‌బిఐ బిల్డింగ్‌లో ఉన్న సేఫ్‌లలో బంగారాన్ని ఉంచుతారు. గ్లోబల్ సెంట్రల్ బ్యాంకులు ఇప్పటివరకు తవ్విన మొత్తం బంగారంలో 17 శాతం కలిగి ఉన్నాయి. 2023 చివరి నాటికి నిల్వలు 36,699 మెట్రిక్ టన్నుల (MT) కంటే ఎక్కువగా ఉంటాయి.

భారతదేశం తన బంగారాన్ని ఎప్పుడు తాకట్టు పెట్టింది?
1991 సంవత్సరంలో దేశంలో దిగుమతి చేసుకోవడానికి విదేశీ కరెన్సీ లేదు. అప్పుడు భారతదేశం తన 67 టన్నుల బంగారాన్ని తనఖా పెట్టి 2.2 బిలియన్ డాలర్ల రుణం తీసుకుంది. బంగారాన్ని తనఖా పెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముంబై విమానాశ్రయంలో చార్టర్ విమానం  బంగారంతో ఇంగ్లండ్‌కు వెళ్లింది. అప్పుడు భారతదేశం ఇంగ్లండ్ నుంచి రుణం పొందింది. ఆ తర్వాత భారతదేశం తనఖా పెట్టిన బంగారాన్ని రీడీమ్ చేసింది. ఆ తర్వాత క్రమంగా దేశంలోని విదేశీ మారకద్రవ్య నిల్వలు కూడా పెరిగాయి.

మార్చి చివరి నాటికి ఆర్బీఐ వద్ద ఎంత బంగారం ఉంది?
 స్వాతంత్ర్యానికి ముందు నుండి మన దేశానికి చెందిన కొంత బంగారాన్ని  లండన్‌లో  నిల్వ చేశారు. మార్చి చివరి నాటికి ఆర్‌బీఐ వద్ద 822.1 టన్నుల బంగారాన్ని నిల్వ ఉంచగా, అందులో 413.8 టన్నులు విదేశాల్లో నిల్వ ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో 27.5 టన్నుల బంగారాన్ని ఆర్బీఐ కొనుగోలు చేసింది. ఇటీవలి సంవత్సరాలలో బంగారం కొనుగోలు చేసిన సెంట్రల్ బ్యాంకులలో రిజర్వ్ బ్యాంక్ ఒకటి. భారత్‌లో ఇటీవల బంగారంపై ఆర్‌బీఐకి ఆసక్తి పెరిగింది. మొత్తం 2023 కంటే 2024 జనవరి-ఏప్రిల్‌లో సెంట్రల్ బ్యాంక్ 1.5 రెట్లు ఎక్కువ బంగారాన్ని కొనుగోలు చేసింది. భారతదేశంలో వార్షిక బంగారం వినియోగం 700 నుంచి 800 టన్నులు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
Group 2 Exams: తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం - పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం - పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Atul Subhash Case: బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
Special Trains: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటాప్రభుత్వం చేసిన పెద్ద కుట్ర, అల్లు అర్జున్ అరెస్ట్చంపుతరా.. చంపండి.. బన్నీ కోసం జైల్లోకి దూకిన ఫ్యాన్చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
Group 2 Exams: తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం - పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం - పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Atul Subhash Case: బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
Special Trains: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
Hyderabad News: 14 ఏళ్ల పోరాటం - ఆ కుటుంబానికి రూ.1.99 కోట్ల పరిహారం
14 ఏళ్ల పోరాటం - ఆ కుటుంబానికి రూ.1.99 కోట్ల పరిహారం
CM Chandrababu: 'సార్.. ఒక్క ఫోటో ప్లీజ్' - సీఎం చంద్రబాబుకు బాలిక రిక్వెస్ట్, ఆయన ఏం చేశారంటే?
'సార్.. ఒక్క ఫోటో ప్లీజ్' - సీఎం చంద్రబాబుకు బాలిక రిక్వెస్ట్, ఆయన ఏం చేశారంటే?
Vajedu SI Suicide Case: వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
Bigg Boss 8 Telugu Finale LIVE: బిగ్ బాస్ 8 గ్రాండ్ ఫినాలే... చీఫ్ గెస్ట్ ఫిక్స్, విన్నర్ అతడే - ఇంకేం జరుగుతుంది? లైవ్ అప్డేట్స్ దేఖో
బిగ్ బాస్ 8 గ్రాండ్ ఫినాలే... చీఫ్ గెస్ట్ ఫిక్స్, విన్నర్ అతడే - ఇంకేం జరుగుతుంది? లైవ్ అప్డేట్స్ దేఖో
Embed widget