News
News
X

RBI Monetary Policy: రెపో రేటు పెంపుపై కాసేపట్లో నిర్ణయం - లైవ్‌ ఎప్పుడు, ఎక్కడ చూడాలి?

శక్తికాంత దాస్ ప్రసంగం ప్రకటన RBI అధికారిక వెబ్‌సైట్ https://www.rbi.org.in/home.aspxలో అందుబాటులో ఉంటుంది. దీంతోపాటు, ప్రత్యక్ష ప్రసారం RBI యొక్క YouTube ఛానెల్‌లోనూ అందుబాటులో ఉంటుంది.

FOLLOW US: 
Share:

RBI Monetary Policy: మన దేశంలో వడ్డీ రేట్ల పెంపునకు రంగం సిద్ధమైంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (Reserve Bank of India) తన రెపో రెటును పెంచవచ్చు. సోమవారం (ఫిబ్రవరి 06, 2023) ప్రారంభమైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మూడు రోజుల ద్రవ్య విధాన కమిటీ (Monetary Policy Committee - MPC) సమావేశం కాసేపట్లో ముగియనుంది. ఆ సమావేశం ముగిసిన తర్వాత, RBI గవర్నర్ శక్తికాంత దాస్ ‍‌(Shaktikanta Das) లైవ్‌లోకి వస్తారు. ద్రవ్య విధాన కమిటీ తీసుకున్న నిర్ణయాల గురించి దేశ ప్రజలకు వివరిస్తారు.

రెపో రేటులో 25 బేసిస్ పాయింట్ల పెంపును RBI గవర్నర్ ప్రకటిస్తారని దేశం యావత్తు భావిస్తోంది. వేగంగా తగ్గుతున్న ద్రవ్యోల్బణం (Inflation) & దిగుమతి ధరల తగ్గింపు మధ్య, రెపో రేటును రిజర్వ్‌ బ్యాంక్‌ 25 బేసిస్ పాయింట్ల (bps) మేర పెంచవచ్చని తన నివేదికలో బార్ల్కేస్‌ కూడా వెల్లడించింది. ద్రవ్యోల్బణ భారం క్రమంగా దిగి వస్తుండడంతో రెపో రేటు పెంపు 25 bpsను మించకపోవచ్చని మార్కెట్‌ అంచనా వేస్తోంది. 

నేడు ముగిసే ఎంపీసీ సమావేశానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. కేంద్ర బడ్జెట్ 2023-24 ప్రకటన తర్వాత జరిగిన మొదటి ద్రవ్య విధాన సమీక్ష ఇది. 31 మార్చి 2023న ముగిసే ఈ ఆర్థిక సంవత్సరంలో సెంట్రల్ బ్యాంక్ నిర్వహించే చివరి MPC సమావేశం కూడా ఇదే.

ఈ ఆర్థిక సంవత్సరంలో (2022-23), RBI మొదటి MPC సమావేశం 2022 మే నెలలో జరిగింది. అప్పుడు పాలసీ రేటును 40 బేసిస్‌ పాయింట్లు పెంచింది. ఆ తర్వాత, జూన్ నుంచి అక్టోబరు నెలల మధ్య జరిగిన మూడు సమావేశాల్లోనూ, రేట్లను 50 బేసిస్‌ పాయింట్ల చొప్పున పెంచుతూ వెళ్లింది. ఆ తర్వాత, 2022 డిసెంబర్ నెలలో జరిగిన మానిటరీ పాలసీ సమీక్ష సమావేశంలో, రెపో రేటును 35 బేసిస్‌ పాయింట్లు (bps) పెంచింది. ఈ పెంపుల తర్వాత రెపో రేటు 6.25 శాతానికి చేరింది.

అంతా ఊహిస్తున్నట్లుగా.. తాజా సమీక్ష తర్వాత రెపో రేటును 25 bps (0.25%) పెంచాలని MPC సమావేశంలో నిర్ణయిస్తే, మొత్తం రెపో రేటు 6.50 శాతానికి (RBI Repo Rate) చేరుతుంది. దీంతో, రెపో రేటును (గత ఏడాది మే నుంచి) 225 బేసిస్‌ పాయింట్లు పెంచినట్లవుతుంది.

ద్రవ్య విధాన నిర్ణయం ప్రకటనను ఎప్పుడు, ఎక్కడ చూడాలి?
ద్రవ్యోల్బణం, రెపో రేటుపై MPC వైఖరిని ఇవాళ (బుధవారం) ఉదయం 10 గంటలకు RBI గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించనున్నారు. శక్తికాంత దాస్ ప్రసంగం ప్రకటన RBI అధికారిక వెబ్‌సైట్ https://www.rbi.org.in/home.aspxలో అందుబాటులో ఉంటుంది. దీంతోపాటు, ప్రత్యక్ష ప్రసారం RBI యొక్క YouTube ఛానెల్‌లోనూ అందుబాటులో ఉంటుంది.

దూకుడు తగ్గించిన ఫెడ్‌
2023 జనవరి 31, ఫిబ్రవరి 1 తేదీల్లో జరిగిన సమావేశంలో, అమెరికన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ US FED కూడా వడ్డీ రేట్ల పెంపులో దూకుడు ప్రదర్శించలేదు. మార్కెట్‌ ఊహించినట్లు 25 బేసిస్‌ పాయింట్ల పెంపుతో సరిపెట్టింది. ఆ తర్వాత బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్, యూరప్ సెంట్రల్‌ బ్యాంక్‌లు కూడా రేట్ల పెంపులో దూకుడు చూపలేదు. అందువల్లే RBI కూడా ఇక నుంచి దూకుడు తగ్గిస్తుందని అంతా భావిస్తున్నారు.

ద్రవ్యోల్బణం మరింత తగ్గవచ్చు
డిసెంబర్ 2022లో, భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణం ఒక సంవత్సరం కనిష్ట స్థాయికి దిగి వచ్చింది, వరుసగా రెండో నెలలోనూ 6 శాతం కంటే తక్కువగా నమోదైంది. ద్రవ్యోల్బణం మరింత తగ్గే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. 2023 చివరి నాటికి ద్రవ్యోల్బణం 5-5.5 శాతంగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. భారతదేశం సహా ప్రపంచ స్థాయిలోనూ ద్రవ్యోల్బణంలో తగ్గుదల ఉండొచ్చన్న నివేదికలు వెలువడుతున్నాయి. 

Published at : 08 Feb 2023 10:03 AM (IST) Tags: monetary policy Shaktikanta Das RBI Monetary Policy RBI MPC meet Repo Rate Hike RBI shaktikanta das Reserve Bank of India RBI Repo Rate

సంబంధిత కథనాలు

UPI Payments Via PPI: యూపీఐ యూజర్లకు అలర్ట్‌! ఇకపై ఆ లావాదేవీలపై ఏప్రిల్‌ 1 నుంచి ఫీజు!

UPI Payments Via PPI: యూపీఐ యూజర్లకు అలర్ట్‌! ఇకపై ఆ లావాదేవీలపై ఏప్రిల్‌ 1 నుంచి ఫీజు!

PAN-Aadhaar: పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు - జూన్‌ 30 వరకు ఛాన్స్‌

PAN-Aadhaar: పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు - జూన్‌ 30 వరకు ఛాన్స్‌

Stock Market: ఊగిసలాడిన సూచీలు - రూపాయి 18 పైసలు జంప్‌!

Stock Market: ఊగిసలాడిన సూచీలు - రూపాయి 18 పైసలు జంప్‌!

Avalon IPO: ఏప్రిల్‌ 3 నుంచి అవలాన్‌ ఐపీవో - షేర్‌ ధర ఎంతో తెలుసా?

Avalon IPO: ఏప్రిల్‌ 3 నుంచి అవలాన్‌ ఐపీవో - షేర్‌ ధర ఎంతో తెలుసా?

Cryptocurrency Prices: 24 గంటల్లో రూ.50వేలు తగ్గిన బిట్‌కాయిన్‌!

Cryptocurrency Prices: 24 గంటల్లో రూ.50వేలు తగ్గిన బిట్‌కాయిన్‌!

టాప్ స్టోరీస్

Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం - విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్

Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం -  విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్

TSLPRB Exam: కానిస్టేబుల్‌ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

TSLPRB Exam: కానిస్టేబుల్‌ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు

Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!