RBI Interest Rates: సుంకాల ఎఫెక్ట్: వడ్డీ రేట్లు యథాతథం, జీడీపీ 6.5 శాతం- ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా
RBI Repo Rate: రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నాలుగోసారి రెపో రేటుపై ప్రకటన చేశారు. ఈ సంవత్సరం ఇప్పటికే ఆయన మూడుసార్లు వడ్డీ రేట్లు తగ్గించారు.

RBI MPC Meeting: ఈ ఏడాది పలుమార్లు వడ్డీ రేట్లు తగ్గించిన రిజర్వ్ బ్యాంక్ తాజాగా ఎలాంటి మార్పులు ప్రకటించలేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ మీద టారిఫ్ వార్ మొదలుపెట్టిన క్రమంలో ఆర్బీఐ రేపో రేట్ తగ్గించడానికి ఆసక్తి చూపలేదు. ఆగస్టు 4వ తేదీ నుంచి 6 వరకు జరిగిన RBI ద్రవ్య విధాన కమిటీ సమావేశం తర్వాత, రెపో రేటు ప్రకటించారు. వరుసగా మూడు సార్లు కోత విధించిన తర్వాత, ఈసారి వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు లేదు ఆర్బీఐ.
ఈ సంవత్సరం ప్రారంభంలో RBI గవర్నర్ అయిన తర్వాత సంజయ్ మల్హోత్రా రెపో రేటుపై ఆయన చేసిన నాల్గవ విధాన ప్రకటన. ఈ సంవత్సరం ఇప్పటివరకు మూడుసార్లు రెపో రేటును తగ్గించారు. మరోసారి వడ్డీ రేట్లు తగ్గిస్తారని భావించిన వారికి నిరాశే ఎదురైంది. గృహ కొనుగోలుదారులు, బ్యాంకుల నుండి రుణాలు తీసుకునేవారు మరోసారి ఉపశమనం కలుగుతుందని ఆశించారు.
#WATCH | RBI Governor Sanjay Malhotra says, "The real GDP growth for 2025-26 is projected at 6.5%".
— ANI (@ANI) August 6, 2025
(Video source: RBI/YouTube) pic.twitter.com/3P7SLEufYT
అంతకుముందు, ఈ ఏడాది ఫిబ్రవరిలో రిజర్వ్ బ్యాంక్ (RBI) 25 బేసిస్ పాయింట్ల కోత విధించింది. ఇది గత ఐదేళ్లలో ప్రజలకు మొదటిసారిగా కలిగిన ఉపశమనం. తరువాత, రెపో రేటు 6.25 శాతానికి తగ్గింది. మరోసారి ఏప్రిల్ నెలలో మరో 25 బేసిస్ పాయింట్ల కోత విధించింది ఆర్బీఐ. ఆ తర్వాత జూన్‌లోనూ ఊహించని విధంగా ఆర్బీఐ ఏకంగా 50 బేసిస్ పాయింట్ల కోత విధించింది. ఈ ప్రకటన తరువాత రెపో రేటు 5.5 శాతానికి దిగొచ్చింది. దాంతో గృహ కొనగోలు చేయాలనుకున్న వారు, పర్సనల్ లోన్ కోసం చూస్తున్న వారు తమ ప్రయత్నాలు మొదలుపెట్టారు.
MPC రెపో రేటుపై దలాల్ స్ట్రీట్ ట్రేడింగ్ దాదాపు ఫ్లాట్
రెపో రేటును మార్చకుండా తటస్థ వైఖరిని కొనసాగించాలనే RBI నిర్ణయంతో స్టాక్ మార్కెట్లు దాదాపు ఫ్లాట్‌గా ఉన్నాయి. అయితే కొన్ని రంగాల్లో షేర్లు స్వల్పంగా పడిపోయాయి. ఉదయం 10:21 నాటికి BSE సెన్సెక్స్ 51 పాయింట్లు పడిపోయి 80,660 వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 50.. 8 పాయింట్లు తగ్గి 24,650 దిగువకు వచ్చింది. CPI ద్రవ్యోల్బణం 3.1 శాతంగా అంచనా వేసినట్లు తెలిపారు. జూన్‌లో జరిగిన గత MPC సమావేశంలో పేర్కొన్న 3.7 శాతం అంచనా నుండి తగ్గించి సవరించారని గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు.
2026 ఆర్థిక సంవత్సరం GDP అంచనా 6.5 శాతం
వృద్ధి అంచనాపై ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా మాట్లాడుతూ, "వాణిజ్యంలో నిర్మాణాత్మకమైన, స్థిరమైన వృద్ధితో సేవలు మరింత మెరుగవుతున్నాయి. సుంకాల అనిశ్చితుల మధ్య బయటి నుంచి డిమాండ్‌లో అనిశ్చితి నెలకొంది’ అన్నారు. 2026 ఆర్థిక సంవత్సరానికి గతంలో GDP అంచనాను 6.5 శాతాన్ని కొనసాగించారు. తొలి త్రైమాసికం (Q1) FY26 కోసం GDP అంచనా 6.5 శాతం, Q2 FY26 కోసం 6.7 శాతంగా, Q3 FY26 కోసం 6.6 శాతం, నాలుగో త్రైమాసికం FY26 కోసం 6.3 శాతంగా ఉందని తెలిపారు. 2026-27 మొదటి త్రైమాసికంలో, GDP అంచనా 6.6%గా ఉందన్నారు.






















