అన్వేషించండి

Radiant Cash Management IPO: తుస్సుమన్న రేడియంట్‌ ఐపీవో, ఇంట్రస్ట్‌ చూపని ఇన్వెస్టర్లు, కేవలం 53% సబ్‌స్క్రిప్షన్‌

ఈ ఇష్యూ చివరి రోజున ‍‌(మంగళవారం, 27 డిసెంబర్‌ 2022) కేవలం 53 శాతం మాత్రమే సబ్‌స్క్రయిబ్ అయింది.

Radiant Cash Management Services IPO: రేడియంట్ క్యాష్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ ఇనీషియల్‌ పబ్లిక్ ఆఫర్‌కు (Initial Public Offer) ఇన్వెస్టర్ల నుంచి పెద్దగా స్పందన రాలేదు. ఈ ఇష్యూ చివరి రోజున ‍‌(మంగళవారం, 27 డిసెంబర్‌ 2022) కేవలం 53 శాతం మాత్రమే సబ్‌స్క్రయిబ్ అయింది.

IPO ద్వారా ప్రైమరీ మార్కెట్‌ నుంచి రూ. 388 కోట్లు సేకరించాలని రేడియంట్ క్యాష్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ భావించింది.

నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ NSE డేటా ప్రకారం... 2 కోట్ల 74 లక్షల 29 వేల 925 షేర్లను ఇనీషియల్‌ షేర్‌ సేల్‌ ఆఫర్‌ కోసం ఈ కంపెనీ మార్కెట్‌లోకి తీసుకొస్తే... ఇన్వెస్టర్లు ఒక కోటి 45 లక్షల 98 వేల 150 షేర్ల కోసం మాత్రమే దరఖాస్తులు (బిడ్స్‌) దాఖలు చేశారు.

బిడ్స్‌ వచ్చిన తీరిది..
అర్హత గల సంస్థాగత కొనుగోలుదార్ల (Qualified Institutional Buyers -QIBలు) కోసం ఉద్దేశించిన కోటా పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయింది. అయితే సంస్థాగతేతర పెట్టుబడిదార్ల (Non Institutional Investors - NIIలు) భాగం 66 శాతం సబ్‌స్క్రిప్షన్ పొందింది. రిటైల్ ఇండివిడ్యువల్ ఇన్వెస్టర్ల (Retail Individual Investors - RIIలు) కోటా మరీ దారుణంగా 20 శాతం సబ్‌స్క్రిప్షన్ దక్కించుకుంది. అంటే.. రిటైల్‌ ఇన్వెస్టర్ల కోసం 100 షేర్లను ఈ కంపెనీ అమ్మకానికి పెడితే, కేవలం 20 షేర్ల కోసమే బిడ్స్‌ వచ్చాయి.

ఈ రూ. 388 కోట్ల ఆఫర్‌లో రూ. 60 కోట్ల విలువైన ప్రైమరీ (ఫ్రెష్‌) షేర్లను కంపెనీ ఇష్యూ చేసింది. మిగిలిన భాగం ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (Offer For Sale - OFS) వాటా. కంపెనీలో ఇప్పటికే ఉన్న వాటాదారులు తమ స్టేక్‌లో కొంత భాగాన్ని ఆఫర్‌ ఫర్‌ సేల్‌ రూట్‌లో ఆఫ్‌లోడ్‌ చేస్తున్నారు. ఫ్రెష్‌ షేర్ల ద్వారా వచ్చిన డబ్బు కంపెనీ ఖాతాలో జమ అవుతుంది. ఈ డబ్బును కంపెనీ అభివృద్ధికి, ఇతర అవసరాలకు వినియోగిస్తారు. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ రూట్‌లో అమ్మే సెకండరీ షేర్ల ద్వారా వచ్చే డబ్బు ప్రస్తుత పెట్టుబడిదారుల సొంత ఖాతాల్లోకి వెళ్తుంది, ఈ డబ్బుతో కంపెనీకి ఎలాంటి సంబంధం ఉండదు.

ఈ IPOలో రూ.94-99 ప్రైస్‌ రేంజ్‌లో ఒక్కో షేరును రేడియంట్ క్యాష్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ ఆఫర్‌ చేసింది. ఒక్కో లాట్‌కు 150 షేర్లను కంపెనీ కేటాయించింది. 

IIFL సెక్యూరిటీస్, మోతీలాల్ ఓస్వాల్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్స్, YES సెక్యూరిటీస్ ఈ ఆఫర్‌కి బుక్‌ రన్నింగ్‌ మేనేజర్లుగా ఉన్నాయి.

రేడియంట్ క్యాష్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ భారతదేశంలోని నగదు నిర్వహణ సేవల పరిశ్రమలో ఒక భాగం. రిటైల్ క్యాష్ మేనేజ్‌మెంట్ (RCM) విభాగంలో ప్రముఖంగా పని చేస్తోంది. నెట్‌వర్క్ పరంగా RCM విభాగంలో అతి పెద్ద కంపెనీల్లో ఇది ఒకటి. భారతదేశంలోని 13,044 పిన్ కోడ్‌లలో రేడియంట్‌ సేవలు అందిస్తోంది. లక్షద్వీప్ మినహా దేశంలోని అన్ని జిల్లాలను కవర్ చేస్తోంది. జులై 31, 2022 నాటికి 5,388కు పైగా ప్రాంతాల్లో దాదాపు 55,513 టచ్‌ పాయింట్‌ సేవలు అందిస్తోంది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan On Arjun:  అల్లు అర్జున్ అరెస్టుపై పవన్‌కు సూటి ప్రశ్న - డిప్యూటీ సీఎం స్పందన ఇదే !
అల్లు అర్జున్ అరెస్టుపై పవన్‌కు సూటి ప్రశ్న - డిప్యూటీ సీఎం స్పందన ఇదే !
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
Nitish Records Alert: ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులుమాజీ ప్రధానికేనా.. నా తండ్రికి ఇవ్వరా? కాంగ్రెస్ తీరుపై ప్రణబ్ కుమార్తె ఆగ్రహంNasa Parker Solar Probe Signal | సూర్యుడికి అతి దగ్గరగా వెళ్లిన సేఫ్ గా ఉన్న పార్కర్ ప్రోబ్ | ABP DesamPushpa 2 Bollywood Collections | బాలీవుడ్ ను షేక్ చేయటం ఆపని బన్నీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan On Arjun:  అల్లు అర్జున్ అరెస్టుపై పవన్‌కు సూటి ప్రశ్న - డిప్యూటీ సీఎం స్పందన ఇదే !
అల్లు అర్జున్ అరెస్టుపై పవన్‌కు సూటి ప్రశ్న - డిప్యూటీ సీఎం స్పందన ఇదే !
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
Nitish Records Alert: ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
Pawan Kalyan: 'వైసీపీ నేతలకు అహంకారంతో కళ్లు నెత్తికెక్కాయి' - ఖబడ్దార్ అంటూ పవన్ వార్నింగ్, ఎంపీడీవోకు పరామర్శ
'వైసీపీ నేతలకు అహంకారంతో కళ్లు నెత్తికెక్కాయి' - ఖబడ్దార్ అంటూ పవన్ వార్నింగ్, ఎంపీడీవోకు పరామర్శ
Manmohan Singh Last Rites: ముగిసిన మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు, మాజీ ప్రధానికి తుది వీడ్కోలు పలికిన భారతావని
ముగిసిన మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు, మాజీ ప్రధానికి తుది వీడ్కోలు పలికిన భారతావని
Look Back 2024: భామలు... కొత్త భామలు... టాలీవుడ్‌లో 2024లో స్పార్క్ చూపించిన నలుగురు బ్యూటీలు
భామలు... కొత్త భామలు... టాలీవుడ్‌లో 2024లో స్పార్క్ చూపించిన నలుగురు బ్యూటీలు
Chiranjeevi Odela Movie: పాటలు, హీరోయిన్ లేకుండానే చిరు - ఓదెల సినిమా?... రూమర్లపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత
పాటలు, హీరోయిన్ లేకుండానే చిరు - ఓదెల సినిమా?... రూమర్లపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత
Embed widget