అన్వేషించండి

SBI News: టెక్కీలకు శుభవార్త చెప్పిన ఎస్బీఐ.. భారీ రిక్రూట్మెంట్ ప్లాన్ ఇదే..

బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఐటీ, ఇతర అవసరాల కోసం 12000 మంది టెక్ ఉద్యోగులను నియమించుకుంటున్నట్లు ప్రకటించింది. కోటక్ బ్యాంక్ పై ఆర్బీఐ చర్యల తర్వాత ఈ నిర్ణయం వెలువడింది.

SBI Hiring: దేశంలో ప్రభుత్వ యాజమాన్యంలోని అతిపెద్ద బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా తన ఐటీ సేవల అవసరాలతో పాటు ఇతర ఖాళీలకు పెద్ద మెుత్తంలో ఉద్యోగులను నియమించుకుంటున్నట్లు కంపెనీ ఛైర్మన్ దినేష్ ఖారా పేర్కొన్నారు. వీరికి బ్యాంకింగ్ వ్యవస్థలో అవగాహన కల్పించిన తర్వాత కొందరిని అసోసియేట్ రోల్స్ లోకి పంపనున్నట్లు వెల్లడించారు. 

కంపెనీ ప్రస్తుతం 11,000 నుంచి 12,000 మంది ఉద్యోగులను నియమించుకునే పనిలో ఉన్నట్లు వెల్లడించింది. వీరు సాధారణ ఉద్యోగులని కానీ మా అసోసియేట్ స్థాయిలో, అధికారుల స్థాయిలో దాదాపు 85 శాతం మంది ఇంజనీర్లు ఉండే వ్యవస్థను కలిగి ఉన్నట్లు ఖారా వెల్లడించారు. వారికి బ్యాంకింగ్ వ్యవస్థపై కొంత ఎక్స్‌పోజర్ ఇచ్చిన తర్వాత వివిధ అసోసియేట్ పాత్రలలోకి మార్చడం ప్రారంభిస్తామని, మరికొందరిని ఐటీలోకి ఛానెల్ చేయబడతారని చెప్పారు. 2023లో మెుత్తం ఎస్బీఐ ఉద్యోగుల సంఖ్య 2,35,858 నుంచి 2024లో 2,32,296కి పడిపోయింది.

సాంకేతిక నైపుణ్యాల కోసం కొత్త ఉద్యోగులను కూడా బ్యాంకు ప్రత్యేకంగా తీసుకోవాలనుకుంటున్నామన్న ఖారా.. తాము ఆలస్యంగా ఈ ప్రక్రియను ప్రారంభించినట్లు వెల్లడించారు. దీనికి ముందు బ్యాంక్ మే9న తన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ఈ క్రమంలో మార్కెట్ అంచనాలను అధిగమించి రూ.20,698 కోట్లుగా నమోదైంది. వాస్తవానికి బలమైన రుణ వృద్ధి రేటు ఉత్తమపనితీరుకు కారణంగా బ్యాంక్ పేర్కొంది. గత ఏడాది ఇదే సమయంలో మార్చి త్రైమాసిక లాభం రూ.16,695 కోట్లుగా ఉంది. ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం వడ్డీ ఆదాయం 19 శాతం పెరిగి రూ.1.11 లక్షల కోట్లుగా నమోదైంది.

మార్చితో ముగిసిన ఫలితాల్లో బ్యాంక్ అసెట్ క్వాలిటీ మెరుగుపడింది. ఇదే క్రమంలో జనవరి-మార్చి మధ్య కాలంలో బ్యాంక్ ఆదాయం రూ.1.28 లక్షల కోట్లుగా నమోదైంది. ఇదే సమయంలో ప్రొవిజన్స్ సగానికి తగ్గి రూ.1,609 కోట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది ఇదే సమయంలో ప్రొవిజన్స్ రూ.3,315 కోట్లుగా ఉన్నాయి. 

వాస్తవానికి బ్యాంక్ భారీ ఐటీ నిపుణుల రిక్రూట్మెంట్ ఇటీవల రిజర్వ్ బ్యాంక్ కోటక్ మహీంద్రా బ్యాంకుపై ఆంక్షల తర్వాత వచ్చింది. బ్యాంక్ ఐటీ విభాగాల్లో నాణ్యత ఉండాల్సిన స్థాయిల్లో లేకపోవటంపై రిజర్వు బ్యాంక్ చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో దిద్దుబాటు చర్యలు ప్రారంభించిన కోటక్ బ్యాంక్ కొత్తగా 400 మంది టెక్ నిపుణులను నియమించుకుంటున్నట్లు ప్రకటించింది. వీరిని ఈ ఏడాదిలో ఆన్ బోర్డ్ చేసి సేవలను మెరుగుపరచాలని బ్యాంక్ చూస్తోంది. అయితే ప్రస్తుతం దేశంలో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ గా అవతరించిన స్టేట్ బ్యాంక్ పనితీరు విఫలాన్ని నిరోధించేందుకు ముందస్తుగానే అవసరమైన స్థాయిలో టెక్ నిపుణులను ఎస్బీఐ నియమించుకుంటున్నట్లు తెలుస్తోంది. 
 

 

టాప్ హెడ్ లైన్స్

EPFO Crediting Interest: కోట్లాది మంది ఉద్యోగులకు EPFO తీపి కబురు! 8.25% వడ్డీ జమ ప్రారంభం.. ఇలా చెక్ చేసుకోండి!
కోట్లాది మంది ఉద్యోగులకు EPFO తీపి కబురు! 8.25% వడ్డీ జమ ప్రారంభం.. ఇలా చెక్ చేసుకోండి!
Revamped Gold Monetization Scheme: ఇళ్లలోని ఇన్‌యాక్టివ్ గోల్డ్‌కు మోక్షం - సరికొత్త గోల్డ్ మానిటైజేషన్ పాలసీతో కేంద్రం భారీ స్కెచ్!
ఇళ్లలోని ఇన్‌యాక్టివ్ గోల్డ్‌కు మోక్షం - సరికొత్త గోల్డ్ మానిటైజేషన్ పాలసీతో కేంద్రం భారీ స్కెచ్!
Axis Mutual Fund NFO: యాక్సిస్ నిఫ్టీ50 ఈక్వల్ వెయిట్స్ ఇండెక్స్ ఫండ్ NFO ప్రారంభం.. రూ.100తో జులై 17 వరకు ఛాన్స్
యాక్సిస్ నిఫ్టీ50 ఈక్వల్ వెయిట్స్ ఇండెక్స్ ఫండ్ NFO ప్రారంభం.. రూ.100తో జులై 17 వరకు ఛాన్స్
200 Rupee News: 200 రూపాయల నోటు అసలైనదో, నకిలీదో ఎలా గుర్తించాలి? ఆర్‌బిఐ చెప్పిన ట్రిక్స్‌ ఇవే!
200 రూపాయల నోటు అసలైనదో, నకిలీదో ఎలా గుర్తించాలి? ఆర్‌బిఐ చెప్పిన ట్రిక్స్‌ ఇవే!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
FIFA World Cup Dispute: ఈజిప్ట్‌-అర్జెంటీనా మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ మోస్తఫా జికో సంచలన వ్యాఖ్యలు, కన్నీళ్లు పెట్టుకున్న లియోనెల్ మెస్సి!
ఈజిప్ట్‌-అర్జెంటీనా మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ మోస్తఫా జికో సంచలన వ్యాఖ్యలు, కన్నీళ్లు పెట్టుకున్న లియోనెల్ మెస్సి!
US Attacks Iran: ఇరాన్‌పై మెరుపుదాడులు చేసిన అమెరికా సైన్యం.. చమురు విక్రయాల లైసెన్స్ రద్దు, ఆంక్షలు కఠినతరం
ఇరాన్‌పై మెరుపుదాడులు చేసిన అమెరికా సైన్యం.. చమురు విక్రయాల లైసెన్స్ రద్దు, ఆంక్షలు కఠినతరం
Pawan Kalyan Fan Dies: పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్‌ మృతి.. ఆ కోరిక తీరకుండానే..!
పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్‌ మృతి.. ఆ కోరిక తీరకుండానే..!
Viral Video: ఆదోని శివాలయం గర్భగుడిలో సిగరెట్‌ వెలిగించి అపచారం, నిందితుడి అరెస్ట్
ఆదోని శివాలయం గర్భగుడిలో సిగరెట్‌ వెలిగించి అపచారం, నిందితుడి అరెస్ట్
IND vs ENG Highlights: మూడో T20లో టీమ్ ఇండియా చరిత్రలోనే అతిపెద్ద ఓటమి! వైభవ్ , అభిషేక్ సహా ప్రధాన బ్యాటర్లు విఫలం! 
మూడో T20లో టీమ్ ఇండియా చరిత్రలోనే అతిపెద్ద ఓటమి! వైభవ్ , అభిషేక్ సహా ప్రధాన బ్యాటర్లు విఫలం! 
Kadiri Crime News: కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
ఒక్క ఫోన్ కాల్‌ చేయండి! ఫుడ్ కల్తీ భరతం పడతాం : ABP దేశంతో టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్
ఒక్క ఫోన్ కాల్‌ చేయండి! ఫుడ్ కల్తీ భరతం పడతాం : ABP దేశంతో టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్
Hyderabad Crime News: హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లోపడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లో పడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
Embed widget