News
News
వీడియోలు ఆటలు
X

PMJDY: జన్ ధన్ యోజన చీకటి నిజం - క్లెయిమ్‌ సెటిల్‌మెంట్లలో కొండంత నిర్లక్ష్యం

క్షేత్ర స్థాయిలో 'పీఎం జన్ ధన్ యోజన' వాస్తవ పరిస్థితి ఏంటి అన్నది సమాచార హక్కు చట్టం (RTI) ద్వారా వెల్లడైంది.

FOLLOW US: 
Share:

PMJDY Insurance Claims Settlement : నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రకటించిన మొదటి పెద్ద పథకంగా 'ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన'కు పేరుంది. దేశంలోని బ్యాంకింగ్ సేవలకు దూరంగా ఉన్న ప్రజలకు ఆ సౌకర్యాలను దగ్గర చేయడం దీని లక్ష్యం. క్షేత్ర స్థాయిలో 'పీఎం జన్ ధన్ యోజన'  వాస్తవ పరిస్థితి ఏంటి అన్నది సమాచార హక్కు చట్టం (RTI) ద్వారా వెల్లడైంది.

పీఎం జన్ ధన్ యోజన ఖాతాదార్లకు అందించే బీమా (PMJDY Insurance) సమాచారం గురించి చెప్పాలని, సమాచార హక్కు చట్టం కింద ప్రభుత్వానికి అర్జీ అందింది. స.హ.చట్టం కార్యకర్త చంద్రశేఖర్ అడిగిన ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో, ఈ పథకం కింద అందిన బీమా క్లెయిమ్‌ల్లో సగం మాత్రమే పరిష్కరించగలిగామని వెల్లడించింది.

గత రెండు సంవత్సరాల్లో సగమే పరిష్కారం
ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారం... గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో, ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన కింద 647 బీమా క్లెయిమ్‌లు కేంద్రానికి అందాయి. వాటిలో 329 క్లెయిమ్‌లను మాత్రమే పరిష్కరించారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 341 క్లెయిమ్‌లు వచ్చాయి. వాటిలో 182 క్లెయిమ్స్‌ సెటిల్ చేయగా, 48 దరఖాస్తులను తిరస్కరించారు. మిగిలిన 111 క్లెయిమ్‌లు ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నాయో ప్రభుత్వానికి కూడా తెలియదు. సెటిల్‌ చేసిన క్లెయిమ్‌ల కోసం రూ. 2.27 కోట్లు చెల్లించారు.

అదేవిధంగా, 2022-23 ఆర్థిక సంవత్సరంలో 306 క్లెయిమ్‌లలో 147 క్లెయిమ్‌లను పరిష్కరించారు. 10 క్లెయిమ్‌లు తిరస్కరించారు. మిగిలిన 149 దరఖాస్తుల ప్రస్తుత పరిస్థితి ఏంటో గవర్నమెంట్‌ వారికి సైతం తెలియదు. గత ఆర్థిక సంవత్సరంలో సెటిల్ అయిన కేసుల కోసం రూ. 1.88 కోట్లు చెల్లించారు.

2014 ఆగస్టులో, తన మొదటి స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో జన్ ధన్ యోజన గురించి ప్రధాని నరేంద్ర మోదీ హింట్‌ ఇచ్చారు. ఆ తర్వాత, 28 ఆగస్టు 2014న ఈ పథకం ప్రారంభమైంది. పథకం కింద, ఖాతాదార్లకు ప్రమాద బీమా రక్షణ లభిస్తుంది. గతంలో ఈ కవరేజీ రూ. 1 లక్షగా ఉండగా, ఇప్పుడు రూ. 2 లక్షలకు పెంచారు.

ఒక్క షరతుతో క్లెయిమ్స్‌ నిరాకరణ
ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన ఖాతాదార్లు బ్యాంక్ ఖాతాతో పాటు రూపే డెబిట్ కార్డ్‌ను పొందుతారు. ప్రమాద బీమా పరంగా ఇది చాలా ముఖ్యమైనది. ప్రమాదం జరిగిన రోజుకు ముందు 90 రోజుల లోపు, ఆ ఖాతాదారు తన రూపే కార్డును ఉపయోగించి ఏదైనా లావాదేవీ జరిపినట్లయితే, అతను మాత్రమే క్లెయిమ్ చేసుకోవడానికి అర్హుడు అన్న షరతు ఉంది. చాలా సందర్భాలలో క్లెయిమ్ తిరస్కరణకు ఈ షరతే కారణం.

4 కోట్ల ఖాతాల్లో డబ్బులు లేవు
2023 మార్చి నెల వరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, దేశంలో ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన బ్యాంకు ఖాతాల సంఖ్య 48.65 కోట్లు. ప్రస్తుతం ఈ బ్యాంకు ఖాతాల్లో మొత్తం రూ. 1,98,844.34 కోట్లు జమ అయ్యాయి. దాదాపు 4.03 కోట్ల ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన బ్యాంకు ఖాతాల్లో ఒక్క రూపాయి కూడా లేదు.

Published at : 27 Apr 2023 01:01 PM (IST) Tags: PMJDY INSURANCE Pradhan Mantri Jan Dhan Yojana claim settlement rate

సంబంధిత కథనాలు

Stock Market News: ఫుల్‌ జోష్‌లో స్టాక్‌ మార్కెట్లు - 18,600 సమీపంలో ముగిసిన నిఫ్టీ!

Stock Market News: ఫుల్‌ జోష్‌లో స్టాక్‌ మార్కెట్లు - 18,600 సమీపంలో ముగిసిన నిఫ్టీ!

Cryptocurrency Prices: క్రిప్టో మార్కెట్లకు యూఎస్‌ డెట్‌ సీలింగ్‌ ఊపు - బిట్‌కాయిన్‌ రూ.70వేలు జంప్‌!

Cryptocurrency Prices: క్రిప్టో మార్కెట్లకు యూఎస్‌ డెట్‌ సీలింగ్‌ ఊపు - బిట్‌కాయిన్‌ రూ.70వేలు జంప్‌!

Latest Gold-Silver Price Today 29 May 2023: మళ్లీ పడిన పసిడి - ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

Latest Gold-Silver Price Today 29 May 2023: మళ్లీ పడిన పసిడి - ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

Petrol-Diesel Price 29 May 2023: తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - కొత్త రేట్లివి

Petrol-Diesel Price 29 May 2023: తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - కొత్త రేట్లివి

NSC: మీకు ₹72 లక్షలు కావాలా? ఈ పోస్టాఫీస్‌ పథకం ఇస్తుంది!

NSC: మీకు ₹72 లక్షలు కావాలా? ఈ పోస్టాఫీస్‌ పథకం ఇస్తుంది!

టాప్ స్టోరీస్

4 Years Of YSRCP: వైఎస్ జగన్ పాలనకు నాలుగేళ్లు పూర్తి- భారీగా బైక్ ర్యాలీలు, కార్యక్రమాలకు నేతలు శ్రీకారం

4 Years Of YSRCP: వైఎస్ జగన్ పాలనకు నాలుగేళ్లు పూర్తి- భారీగా బైక్ ర్యాలీలు, కార్యక్రమాలకు నేతలు శ్రీకారం

Mahendra Singh Dhoni Retirement: రిటైర్మెంట్ ప్రకటించడానికి బెస్ట్ టైం ఇదే... కానీ - మహేంద్ర సింగ్ ధోని ఏమన్నాడంటే?

Mahendra Singh Dhoni Retirement: రిటైర్మెంట్ ప్రకటించడానికి బెస్ట్ టైం ఇదే... కానీ - మహేంద్ర సింగ్ ధోని ఏమన్నాడంటే?

Telangana CM KCR: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలపై అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు

Telangana CM KCR: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలపై అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు

'యూత్‌ ను ఎంకరేజ్‌ చేయాలే, ధమ్‌ ధమ్‌ చేయొద్దు' - జక్కన్న ట్వీట్ వైరల్!

'యూత్‌ ను ఎంకరేజ్‌ చేయాలే, ధమ్‌ ధమ్‌ చేయొద్దు'  - జక్కన్న ట్వీట్ వైరల్!